తిరుపతిలో వైఎస్సార్‌సీపీ నిరసన | YSRCP Protests In Tirupati, Seeks Police Action To Prevent Alleged Rigging In Municipal Corporation Elections | Sakshi
Sakshi News home page

తిరుపతిలో వైఎస్సార్‌సీపీ నిరసన

Oct 29 2026 11:16 AM | Updated on Oct 29 2026 12:45 PM

Ysrcp Corporation Candidates Protest In Tirupati

సాక్షి, తిరుపతి: తిరుపతిలో వైఎస్సార్‌సీపీ కార్పొరేషన్‌ అభ్యర్థులు నిరసన చేపట్టారు. పోలింగ్ రోజు రిగ్గింగ్‌ని ఆపాలంటూ నిరసనకు దిగారు. తిరుపతిలో కూటమి ప్రభుత్వం పోలింగ్ రోజు రిగ్గింగ్‌కు పాల్పడే అవకాశం ఉందని.. నామినేషన్ వేసే క్రమంలో కూడా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై టీడీపీ గుండాలు దాడులకు పాల్పడ్డారని వైఎస్సార్‌సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

పోలింగ్ రోజు రిగ్గింగ్ జరిగే అవకాశం ఉండడంతో ముందస్తు చర్యలు చేపట్టాలని పోలీసులు, అధికారులకు నిరసన ద్వారా వైఎస్సార్‌సీపీ విజ్ఞప్తి చేసింది. నిరసన కార్యక్రమంలో మేయర్ అభ్యర్థి వాసుదేవ యాదవ్‌, కార్పొరేట్ అభ్యర్థులు, తిరుపతి జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు భూమన అభినయ్‌ రెడ్డి పాల్గొన్నారు.

తిరుపతి కార్పొరేషన్‌ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడితే సహించే ప్రసక్తే లేదని.. పారదర్శంగా ప్రక్రియ పూర్తి చేయాలని వైఎస్సార్‌సీపీ నేతలు అన్నారు. వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్‌ అభ్యర్థులను నామినేషన్లు వేయనీయకుండా టీడీపీ గూండాలు చేసిన అరాచకాలకు పోలీసులు సహకరించారని.. కార్పొరేషన్‌ ఎన్నికల్లో టీడీపీ గూండాలు రిగ్గింగ్‌కు పాల్పడితే మళ్లీ కోర్టును ఆశ్రయించి వారికి సహకరించిన పోలీస్, ఎన్నికల అధికారులందరినీ న్యాయస్థానం ముందు నిలబెడుతామని వైఎస్సార్‌సీపీ రీజనల్‌ కో–ఆర్డినేటర్‌ భూమన కరుణాకరరెడ్డి హెచ్చరించారు.

ఇదీ చదవండి: అమ్ముడుపోయిన అధికారం!

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement