అమ్ముడుపోయిన అధికారం! | ROs Accused of Siding with Chandrababu | Sakshi
Sakshi News home page

అమ్ముడుపోయిన అధికారం!

Oct 29 2026 5:26 AM | Updated on Oct 29 2026 5:27 AM

ROs Accused of Siding with Chandrababu

శ్రీకాకుళం జిల్లా పొందూరు ఆర్వో సూర్యప్రకాశరావును నిలదీస్తున్న మహిళా అభ్యర్థులు, వైఎస్సార్‌సీపీ నాయకులు

చంద్రబాబు ఆడమన్నట్టలా ఆడిన ఆర్వోలు..  నామినేషన్లలో కొన్ని పత్రాలు తీసేసి అనర్హులుగా ప్రకటించిన ఆర్వోలు

సాక్షి, టాస్క్ ఫోర్స్‌/నెట్‌వర్క్‌: ఎన్నికలంటే ప్రజల తీర్పు.. ప్రతి అభ్యర్థికీ పోటీ చేసే హక్కు.. ఆ హక్కుకు రక్షణగా నిలవాల్సింది ఎన్నికల సంఘం, దాని అధికార యంత్రాంగం! మరి రాష్ట్రంలో స్థానిక ఎన్నికల వేళ ఏం జరిగింది? ప్రతిపక్ష అభ్యర్థుల నామినేషన్‌ పత్రాలను లాక్కుని చించేస్తుంటే రిటర్నింగ్‌ అధికారులు ఏం చేశారు? పోలీసు యంత్రాంగాన్ని అదిలించి అభ్యర్థులకు రక్షణ కల్పించాల్సిన అధికారులు ప్రేక్షకపాత్రకు ఎందుకు పరిమితమయ్యారు? ఎన్నికల ప్రక్రియను నిష్పక్షపాతంగా నిర్వహించాల్సిన బాధ్యతను పక్కనపెట్టి, అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించడమేనా వారి విధి? చంద్రబాబు కోరుకున్న ఏకగ్రీవాల కోసం ప్రతిపక్ష అభ్యర్థుల నామినేషన్లకు అడ్డంకులు సృష్టించడం, పత్రాలు చించేయడం, స్రూ్కటినీ పేరుతో తిరస్కరణలు, బలవంతపు ఉపసంహరణలు.. ఇలా ఒక్కో దశలో ప్రజాస్వామ్య ప్రక్రియనే ప్రశ్నార్థకం చేసే పరిణామాలనేకం చోటుచేసుకున్నాయి.

నామినేషన్‌ పత్రాలను కాపాడలేని అధికారులు ఎన్నికలను ఎలా కాపాడతారు? అధికార పార్టీ ఒత్తిళ్లకు తలవంచితే ప్రజాస్వామ్యానికి ఇక రక్షణ ఎక్కడ? అసలు ఎన్నికల సంఘం ఎవరి కోసం? రిటర్నింగ్‌ అధికారులు ఎవరి ఆదేశాల కోసం? ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికా.. అధికార పార్టీకి మార్గం సుగమం చేయటానికా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎన్నికల యంత్రాంగంపైనా, ప్రభుత్వంపైనా ఉంది. ఎన్నికల అధికారులు గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే. వారు అధికార పార్టీకి సేవకులు కాదు.ప్రజాస్వామ్యానికి కాపలాదారులు! నామినేషన్‌ పత్రాన్ని కాపాడలేని వ్యవస్థ, ఓటు హక్కును ఎలా కాపాడుతుంది? నామినేషన్ల తొలి రోజు నుంచి ఉపసంహరణల వరకు జరిగిన అక్రమాలన్నిటికీ ఆర్వోలే ప్రత్యక్ష సాక్షులు. వారిలో కొందరి గురించి చూద్దామా...  

గిద్దలూరులో నామినేషన్లు మాయం..
మార్కాపురం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో 75 ఎంపీటీసీ స్థానాలకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారు. కొమరోలు మండలంలో ఐదుగురు అభ్యర్థులు నామినేషన్లు వేస్తే.. ఐదుగురి పత్రా­లూ మాయమయ్యాయి! పత్రాలు కనిపించడం లేదంటూ ఆర్‌ఓ వంగా జ్యోతి వారి నామినేషన్లను తిరస్కరించారు. కొమరోలు­–1 షేక్‌ తస్లీమా, కొమరోలు–2 మాజీ ఎంపీపీ కామూరి అమూల్య, చింతలపల్లి సారె ఓబులమ్మ, రెడ్డిచర్ల కరిస్మా, అల్లినగరం కామూరి శ్రీనివాసరెడ్డి నామినేషన్లకు ఇదే పరిస్థితి.

మరోవైపు, జెడ్పీటీసీ అభ్యర్థి సారె వెంకటనాయుడు సమర్పించిన ఎన్నికల ఖర్చుల డిక్లరేషన్‌ను తొలగించి, ఆయన నామినేషన్‌నూ తిరస్కరించారు. నామినేషన్లు స్వీకరించిన అధికారులు వాటిని భద్రపరచలేకపోయారా? ఐదుగురి పత్రాలూ ఒకేసారి ఎలా మాయమయ్యాయి? పత్రాలను కాపాడాల్సిన ఆర్‌ఓలే అవి కనిపించడం లేదంటూ నామినేషన్లు తిరస్కరిస్తే బాధ్యత ఎవరిది?

టీడీపీకి కోసం తాత్సారం
ప్రకాశం జిల్లా దర్శి మున్సిపాలిటీ ఆర్వోగా ఉన్న ఎంఈఓ–2 రమాదేవి పసుపు చొక్కా వేసుకున్న టీడీపీ నేతలా వ్యవహరించారు. లోపల టీడీపీకి చెందిన వారి నామినేషన్‌లు తీసుకుని వైఎస్సార్‌సీపీ వారివి తీసుకోకుండా సమయం వృథా చేశారు. ఈలోపు టీడీపీ గూండాలు అక్కడకు వచ్చి వైఎస్సార్‌ సీపీనేతలపై దాడి చేసి వారి నామినేషన్లు చించేశారు.

విత్‌డ్రా పేరుతో వంచన.. చివరకు నామినేషన్‌ గల్లంతు!
టెక్కలి నియోజకవర్గం కోట»ొమ్మాళి మండలం చిన్నసాన ప్రాదేశికంలో రొక్కం శ్రావణి పేరుతో వేర్వేరు ప్రతిపాదకులతో రెండు నామినేషన్లు దాఖలయ్యాయి. రెండింటిలో ఒకటి ఉపసంహరించుకోవాలని అధికారులు సూచించడంతో, ఆ మేరకు ఒక నామినేషన్‌ను విత్‌డ్రా చేసుకున్నారు. బీ ఫారం సమర్పించేందుకు వెళితే.. నామినేషన్‌ పూర్తిగా తిరస్కరించబడిందని అధికారులు చెప్పారు. ఒక నామినేషన్‌ ఉపసంహరించుకోవాలని చెప్పి.. చివరకు మొత్తం నామినేషనే లేకుండా చేశారా? అభ్యర్థికి సరైన సమాచారం ఇచ్చి, నిబంధనల ప్రకారం మార్గనిర్దేశం చేయాల్సిన అధికారులే ఇలా వ్యవహరిస్తే ఆమెకు న్యాయం చేసేది ఎవరు?

పత్రం చించేసి నామినేషన్‌ తిరస్కరణ!
తిరుపతి జిల్లా బండారుపల్లి మాజీ వైస్‌ ఎంపీపీ, వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి టి. జనార్ధన్‌ రెడ్డి నామినేషన్‌ వేయడానికి వెళ్తే.. ఏర్పేడు కేంద్రం వద్ద సుమారు 500 మంది టీడీపీ మూకలు ఆయనపై, ఇద్దరు నామినీలపై రాళ్లతో దాడి చేశారు. ప్రాణభయంతో వెనుదిరిగిన ఆయన, ఎంపీ డాక్టర్‌ మద్దెల గురుమూర్తి చొరవతో మరుసటి రోజు నామినేషన్‌ వేశారు. అయితే, నామినేషన్‌ పరిశీలనలో ఆయన పత్రాల్లో ఒకదాన్ని చించేసి, దాని స్థానంలో ఖాళీ ఫారం పెట్టి, సంతకం లేదనే కారణంతో నామినేషన్‌ను తిరస్కరించారు.

చివరకు ఆ స్థానాన్ని టీడీపీ ఏకగ్రీవం చేసుకుంది. మొదట నామినేషన్‌ వేయకుండా దాడులు.. తర్వాత వేసిన నామినేషన్‌ పత్రాన్ని చించేసి తిరస్కరణ! అభ్యర్థి పత్రాలను భద్రపరచాల్సిన ఆర్‌ఓల పర్యవేక్షణలోనే ఇదంతా ఎలా జరిగింది? దాడులను అడ్డుకోలేని వ్యవస్థ, నామినేషన్‌ పత్రాలను కూడా కాపాడలేకపోతే ఎన్నికల నిష్పక్షపాతానికి భరోసా ఎక్కడ?

సిల్లీ రీజన్‌తో నామినేషన్‌ ఔట్‌!
గుంటూరు జిల్లా దుగ్గిరా­ల మండలం చిలువూరు–1 నుంచి వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన అభ్యర్థి ఓటరు జాబితాలో తన వార్డు నంబరు 6కు బదులు 7గా రాశారనే కారణంతో నామినేషన్‌ తిరస్కరణకు గురైంది. అదే సమయంలో కూటమి అభ్య­ర్థులు నామినేషన్‌ పత్రాల్లో తప్పులను కొట్టివేసి సరిచేసినా వారి నామినేషన్లు ఆమోదించారు. వార్డు నంబరులో పొరపాటు­కు ఒకరి నా­మినేషన్‌ తిరస్కరణ.. ఇతరు­ల తప్పులకు మిన­హాయింపులా? నిబంధనలు అందరికీ ఒకేలా వర్తించాలా, పార్టీని బట్టి మారాలా? ఈ వ్యవహారంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు అభ్యర్థి 
సిద్ధమయ్యారు.

పొందూరులో ఫేక్‌ విత్‌డ్రాలు..
శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలంలో 21 ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్లను ఆర్‌ఓ సూర్యప్రకాశరావు ఆమోదించారు. 21 మందికి బీ ఫారాలు తీసుకుని, రసీదులు కూడా ఇచ్చారు. కానీ విత్‌డ్రా రోజు రాత్రి 8 గంటలకు సీన్‌ మారిపోయింది! వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఉపసంహరించుకోకపోయినా, ఐదుగురు విత్‌డ్రా చేసుకున్నట్లు చూపించి ఐదు స్థానాలను టీడీపీకి ఏకగ్రీవం చేశారు! అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకోలేదని ప్రశ్నించి, విత్‌డ్రాలు చేసినవారిని సీసీటీవీ ఫుటేజీలో చూపించాలని అడిగితే.. కెమెరాలే లేవని ఆర్‌ఓ సమాధానమిచ్చారు. నామినేషన్లు ఆమోదించి రసీదులు ఇచ్చిన ఆర్‌ఓ.. అభ్యర్థుల ప్ర­మే­యం లేకుండానే విత్‌డ్రాలు ఎలా నమోదు చేశారు? ఉపసంహరణ పత్రాలను ఎవరు సమర్పించారు? సీసీ కెమెరాలు లేని కేంద్రంలో ఈ ప్రక్రియకు ఆధారాలేమిటి?

అభ్యర్థులు రాకుండానే విత్‌డ్రాలు
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం కురిచేడు మండలం ఎన్నికల అధికారి పురుషోత్తమరాజు టీడీపీ కార్యకర్తలా 
పనిచేశారు. టీడీపీకి ఏకగ్రీవం చేయాలనే దురుద్దేశంతో నామినేషన్ల ఉపసంహరణ సందర్భంగా అభ్యర్థులు రాకుండానే 
ఉపసంహరణ చేసి టీడీపీ నాయకుల కనుసన్నల్లో వారికి ఏకగ్రీవం చేశారు.

వైట్‌నర్‌ వాడొచ్చని చెప్పి.. అదే కారణంతో నామినేషన్‌ తిరస్కరణ!
మార్కాపురం మండలం భూపతిపల్లి ఎంపీటీసీ స్థానానికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి భవనం వెంకట రామిరెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. ఫారం నింపే సమయంలో వైట్‌నర్‌ వాడవచ్చని చెప్పిన ఎన్నికల అధికారులే, స్రూ్కటినీ సమయంలో అదే వైట్‌నర్‌ను సాకుగా చూపి నామినేషన్‌ను తిరస్కరించారు. ముందు అనుమతించి.. తర్వాత అదే కారణంతో తిరస్కరించడం! ఆర్‌ఓల ద్వంద్వ వైఖరికి ఇదే నిదర్శనం.

చిత్తూరులో ఫోర్జరీ విత్‌డ్రాలు.. 51 ఏకగ్రీవాల ప్రకటన!
చిత్తూరు కార్పొరేషన్‌లో మొత్తం 60 డివిజన్లు ఉంటే.. ఏకంగా 51 డివిజన్లలో ఏకగ్రీవాలంటూ ఆర్వోలు డిక్లరేషన్లు ఇచ్చేశారు. వీటిలో టీడీపీకి 47, జనసేనకు 2, బీజేపీకి 1, వైఎస్సార్‌సీపీకి 1 స్థానం దక్కినట్లు ప్రకటించారు. అసలు కుట్ర ఇక్కడే! అభ్యర్థులు, ప్రతిపాదకులు ఎవరూ నామినేషన్లు ఉపసంహరించుకోకపోయినా, వారి సంతకాలను ఫోర్జరీ చేసి విత్‌డ్రా లేఖలు సృష్టించారు.

ఆ లేఖలను పరిశీలించి నిజానిజాలు నిర్ధారించాల్సిన ఆర్‌వోలు, ఉపసంహరణలు జరిగినట్లు ప్రకటించి 51 స్థానాలను ఏకగ్రీవం చేశారు. అభ్యర్థులు ఉపసంహరించుకోకుండానే ఉపసంహరణలు ఎలా జరిగినట్లు? సంతకాలు చేయకుండానే విత్‌డ్రా లేఖలు ఎలా వచ్చాయి? ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిన ఆర్‌వోలు, ఏకగ్రీవాల ప్రకటనలకు ఎలా ఆమోదముద్ర వేశారు?

చెక్‌లిస్ట్‌ లేదు.. ఫారం–5 లేదు.. కారణాలు చెప్పకుండానే నామినేషన్లు ఔట్‌!
కర్నూలు జిల్లా ఆలూరులో ఆర్వో ఆనంద్‌ రాజ్‌కుమార్‌ వ్యవహారంతో ముగ్గురు వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థులు ఎన్నికలకు దూరమయ్యారు. పెద్దహోతూరు–2 నుంచి లక్ష్మి, మొలగవల్లి–2 నుంచి నరసమ్మ, ఆలూరు–3 నుంచి వినోద్‌కుమార్‌ నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్లలో తప్పులున్నాయంటూ పత్తికొండ ఆర్‌డీవో చిన్న ఓబులేసు వద్దకు వెళ్లాలని చెప్పిన ఆర్‌వో.. ఏ తప్పులున్నాయో స్పష్టంగా వివరించలేదు. చెక్‌లిస్ట్, ఫారం–5 ఇవ్వకుండానే నరసమ్మ నామినేషన్‌ను తిరస్కరించారు. ఆర్‌డీవో కూడా స్పష్టమైన కారణాలు వెల్లడించకుండా నామినేషన్లను తిరస్కరించడంతో ముగ్గురూ పోటీకి దూరమయ్యారు.

చేబ్రోలులో ఏకపక్షంగా 19 నామినేషన్లు ఔట్‌!
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలంలో రిటర్నింగ్‌ అధికారి కోమలి పద్మ 19 వైఎస్సార్‌సీపీ నామినేషన్లను చిన్నచిన్న కారణాలతో తిరస్కరించారు. ఈ నిర్ణయాలపై తెనాలి ఆర్డీఓకు అప్పీల్‌ చేయగా, కొన్ని నామినేషన్ల విషయంలో నిర్ణయాలు మారాయిౄనాలుగు తిరస్కరించగా, ఆరు నామినేషన్లను ఆమోదించారు. తెనాలి, శేకూరులో ఓటు హక్కు కలిగి ఉన్నారనే కారణంతో ఒక అభ్యర్థి నామినేషన్‌ను తిరస్కరించారు.

నామినేషన్ల తిరస్కరణలో ఏకపక్షంగా వ్యవహరించారన్న విమర్శలు, అప్పీల్‌ స్థాయిలో కొన్ని నిర్ణయాలు మారడం ఆర్‌ఓ నిర్ణయాలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఒకే మండలంలో 19 నామినేషన్ల తిరస్కరణ.. అప్పీల్‌లో కొన్ని నిర్ణయాల మార్పు! నామినేషన్లను పరిశీలించాల్సిన అధికారి నిబంధనలను నిష్పక్షపాతంగా అమలు చేశారా? లేక అభ్యర్థుల పోటీ హక్కును దెబ్బతీసేలా వ్యవహరించారా?  

టీడీపీ అభ్యర్థులకే వెసులుబాటు
శ్రీకాకుళం జిల్లా కోట»ొమ్మాళి మండలం రిటర్నింగ్‌ అధికారి కె.జగన్మోహన్‌రావు ఏక పక్షంగా టీడీపీ అభ్యర్థుల కోసం పనిచేశారు. మంత్రి అచ్చెన్నాయుడు చెప్పినట్లు చేస్తూ ఎన్నికల నిబంధనలకు తూట్లు పొడిచారు. దంత ఎంపీటీసీ ప్రాదేశికం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యరి్ధగా నామినేషన్‌ వేసిన హేమసుందర్‌రాజును పరిశీలన కోసం మండల పరిషత్‌ కార్యాలయానికి పిలిపించారు. నామినేషన్‌ పత్రాల్లో చిన్న చిన్న కారణాలు చూపించి నామినేషన్‌ను తిరస్కరించేశారు. ఎన్ని తప్పులున్నా, పత్రాలు లేకపోయినా టీడీపీ అభ్యర్థులకు మాత్రం వెసులుబాటు కలి్పంచి అక్కడికక్కడే తప్పులు సరిదిద్దేశారు.  

అనంతపురం రూరల్‌లో వైఎస్సార్‌సీపీకి ఒక న్యాయం.. టీడీపీకి మరో న్యాయం! 
కందుకూరు–1 ఎంపీటీసీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కామక్కగారి మురళి ఒరిజినల్‌ కుల ధ్రువీకరణ పత్రాన్ని టీడీపీ వ్యక్తులు చించేయడంతో జిరాక్స్‌ కాపీతో నామినేషన్‌ వేశారు. స్రూ్కటినీ సమయానికి ఒరిజినల్‌ పత్రం తీసుకురావాలని అధికారులు చెప్పడంతో ఆయన అలాగే సమర్పించారు. అయినా జిరాక్స్‌ కాపీ జత చేశారనే కారణంతో నామినేషన్‌ తిరస్కరించారు. ఆర్‌డీఓను ఆశ్రయించినా న్యాయం జరగలేదు.

అదే రూరల్‌ మండలం రాచాననపల్లి–1లో టీడీపీ అభ్యర్థి డి. రమ్య నామినేషన్‌లోనూ కుల ధ్రువీకరణ పత్రం జిరాక్స్‌ కాపీనే సమర్పించారు. ఆమె నామినేషన్‌ను తొలుత తిరస్కరించినా, అప్పీల్‌లో ఆర్‌డీఓ ఆమోదించారు. ఒకే తరహా తప్పు.. వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి తిరస్కరణ, టీడీపీ అభ్యర్థికి ఆమోదం! ఇదేనా ఎన్నికల అధికారుల నిష్పక్షపాత ధోరణి? నిబంధనలు పార్టీని బట్టి మారతాయా?

ముందు పోటీలో ఉన్నట్లు ధ్రువీకరణ.. తర్వాత నామినేషన్‌ తిరస్కరణ!
చిత్తూరు జిల్లా నగరి మునిసిపాలిటీలో వైఎస్సార్‌సీపీ చైర్మన్‌ అభ్యర్థి బాలకృష్ణన్‌ నామినేషన్‌ పరిశీలన అనంతరం పోటీలో ఉన్నట్లు ఆర్‌ఓ ఫారం–7 ఇచ్చారు. కొద్దిసేపటికే సీన్‌ మారిపోయింది! ఆయన నామినేషన్‌ చెల్లదంటూ తిరస్కరించి, టీడీపీ అభ్యర్థి చైర్మన్‌గా ఏకగ్రీవంగా గెలిచినట్లు ప్రకటించారు. పోటీలో ఉన్నట్లు ధ్రువీకరించిన నామినేషన్‌ కొద్దిసేపటికే ఎలా చెల్లకుండాపోయింది? నిర్ణయం మార్చడానికి కారణమేంటి? ఆర్‌ఓ సంజీవకుమార్, మునిసిపల్‌ కమిషనర్‌ బాలాజీ నాయక్‌ అధికార పార్టీకి అనుకూలంగా పనిచేశారనేందుకు ఈ ఉదాహరణ సరిపోదా?

పేజీ తొలగించి నామినేషన్‌కు మంగళం!
ఆలూరులో స్థానిక ఎన్నికల వేళ అధికార యంత్రాంగం తీరుపై తీవ్ర ప్రశ్నలు! ఆలూరు–3, పెద్దహోతూరు–2, మొలగవల్లి–2 స్థానాల్లో అభ్యర్థుల నామినేషన్లలో తప్పులు లేకున్నా, అప్పీళ్ల పేరుతో ఉపసంహరణలకు దారితీశారు. ఆలూరు–3 నుంచి నామినేషన్‌ వేసిన వినోద్‌ పత్రాల్లో నాలుగో పేజీ తొలగించి, నామినేషన్‌ను తిరస్కరించారు. అరికెర గ్రామం నుంచి నామినేషన్‌ వేసిన తిమ్మప్ప బీ ఫారం సమర్పించేందుకు ఆలూరు ఎంపీడీఓ కార్యాలయానికి వస్తే, ఎస్‌ఐ మన్మథ విజయ్‌ బలవంతంగా తీసుకెళ్లి నామినేషన్‌ ఉపసంహరింపజేశారు. పత్రాలు తొలగించి నామినేషన్ల తిరస్కరణ.. పోలీసుల బలంతో ఉపసంహరణలు! అభ్యర్థుల పోటీ హక్కును కాపాడాల్సిన అధికారులే అడ్డంకులుగా మారితే ఎన్నికల స్వేచ్ఛకు రక్షణ ఎక్కడ? 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement