ఏ ముఖం పెట్టుకుని ఓట్ల కోసం వచ్చారు? | TDP Leaders Face Public Resistance During Election Campaigning: AP | Sakshi
Sakshi News home page

ఏ ముఖం పెట్టుకుని ఓట్ల కోసం వచ్చారు?

Oct 29 2026 4:26 AM | Updated on Oct 29 2026 4:26 AM

 TDP Leaders Face Public Resistance During Election Campaigning: AP

టీడీపీ నేతలను నిలదీస్తున్న మహిళల

ప్రచారానికి వెళ్లిన టీడీపీ నేతలకు చుక్కెదురు   

వేగూరు వసంతపురంలో మహిళల తిరుగుబాటు  

కోవూరు: ఎన్నికల ప్రచారానికి వెళ్లిన టీడీపీ నాయకులకు ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ‘ఓట్లు వేసిన తర్వాత మా మీద కేసులు పెట్టి, మమ్మల్ని రోడ్డు మీద పోనీయకుండా చేశారు. మా కొట్టాలు పడగొట్టించారు. గ్రామంలో ఫ్లెక్సీ విషయంలో ఎటువంటి సంబంధం లేకపోయినా కేసులు పెట్టించారు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఓట్ల కోసం వచ్చారు. మర్యాదగా వెనక్కి వెళ్లండి’ అంటూ మహిళలు టీడీపీ నేతలపై విరుచుకుపడ్డారు. 

ఈ ఘటన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు మండలం వేగూరు పంచాయతీలోని వసంతపురంలో మంగళవారం చోటుచేసుకుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక టీడీపీ నేతలు సుబ్బానాయుడు, జెడ్పీటీసీ అభ్యర్థి గుత్తికొండ వెంకయ్య, మాజీ సర్పంచ్‌తోపాటు కరేటి శ్రీనివాసులు ఆ గ్రామానికి వెళ్లడంతో మా వాడలకు రావొద్దని ప్రజలు తిరుగుబాటు చేయడంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది.

 దీంతో టీడీపీ నాయకులు ‘శాంతించండి.. మాట్లాడుదాం’ అని బతిమాలుకున్నా.. చెప్పులతో కొడుతామంటూ తీవ్రస్థాయిలో మహిళలు తిరుగబడ్డారు. దీంతో అక్కడి నుంచి టీడీపీ నేతలు వెనుదిరిగారు. టీడీపీ నాయకులను స్థానికులు నిలదీస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement