టీడీపీ నేతలపై చెప్పులతో తిగబడ్డ గ్రామస్తులు | villager fire on tdp leaders | Sakshi
Sakshi News home page

టీడీపీ నేతలపై చెప్పులతో తిగబడ్డ గ్రామస్తులు

Oct 28 2026 9:32 PM | Updated on Oct 28 2026 9:32 PM

villager fire on tdp leaders

నెల్లూరు,సాక్షి : అధికార బలంతో విర్రవీగుతున్న టీడీపీ నాయకులకు వసంతపురం గ్రామస్తులు గట్టి షాక్ ఇచ్చారు. నెల్లూరు జిల్లా కోవూరు మండలం వసంతపురంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం కోసం వెళ్లిన టీడీపీ నేతలకు ప్రజల నుంచి తీవ్ర నిరసన ఎదురైంది.

గ్రామంలో ఓట్లు అడగడానికి వచ్చిన నాయకులను గడిచిన రెండేళ్ల కాలంలో తమ ఊరికి ఏం అభివృద్ధి చేశారంటూ గ్రామస్తులు నిలదీశారు. ప్రజల నుంచి ఊహించని ప్రశ్నలు ఎదురుకావడంతో టీడీపీ నేతలు సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు. ఏమీ తోచక మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు.  

అయినా గ్రామస్తులు పట్టువీడకపోవడంతో విసుగు చెందిన టీడీపీ నేతలు అసహనానికి గురయ్యారు. ఏకంగా ప్రజలపైనే నోరు పారేసుకుంటూ దురుసుగా ప్రవర్తించారు. ఈ క్రమంలో టీడీపీ నేత సుబ్బారాయుడు గ్రామస్తులపై బూతులతో రెచ్చిపోవడంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.

నాయకుల తీరుపై తీవ్ర కోపోద్రికులైన గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నిస్తే బూతులు తిడతారా అంటూ చెప్పులు చేతపట్టుకుని టీడీపీ నేతలపైకి తిరగబడ్డారు. ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో చేసేది లేక టీడీపీ నేతలు ప్రచారాన్ని మధ్యలోనే ఆపేసి అక్కడి నుంచి పరుగులు తీశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement