సాక్షి,విజయవాడ: రాష్ట్రంలో ఉత్కంఠ రేపుతున్న స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ తేదీల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం మార్పులు చేసింది. ఈ మేరకు బుధవారం జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
కొత్త షెడ్యూల్ వివరాలు:
ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోలింగ్: నవంబర్ 5న నిర్వహించనున్నారు
కౌంటింగ్ తేదీ: నవంబర్ 7న ఓట్ల లెక్కింపు జరగనుంది.
మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ నవంబర్ 3న ఉండటంతో.. ఒకే సమయంలో ఎన్నికల నిర్వహణ, పోలీస్ సిబ్బంది కొరత వంటి పరిపాలనా పరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు.
మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ యథాతథం
పట్టణ స్థానిక సంస్థల (మున్సిపల్) ఎన్నికల పోలింగ్ తేదీలను ఇటీవల అక్టోబర్ 28 నుంచి నవంబర్ 1వ తేదీకి, ఓట్ల లెక్కింపును అక్టోబర్ 30 నుంచి నవంబర్ 3వ తేదీకి మార్చిన విషయం తెలిసిందే. ఈ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ యథావిధిగా నవంబర్ 1న జరగనుండగా, నవంబర్ 3న ఫలితాలు విడుదలవుతాయని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

ఇదీ చదవండి : మీరేం ఎస్‌ఈసీ!


