నేను రాజకీయం చేస్తే తట్టుకోలేరు | Anam Ramanarayana Reddy Fire On Beeda Ravichandra | Sakshi
Sakshi News home page

నేను రాజకీయం చేస్తే తట్టుకోలేరు

Oct 28 2026 12:44 PM | Updated on Oct 28 2026 12:47 PM

Anam Ramanarayana Reddy Fire On Beeda Ravichandra

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో టీడీపీ నేతల మధ్య వర్గావిభేదాలు మరోసారి బట్టబయలయ్యాయి. జిల్లా టీడీపీ కార్యాలయం వేదికగా జెడ్పీటీసీల అభ్యర్థులకు బీఫారాలు అందజేసే కార్యక్రమంలో నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఆత్మకూరు నియోజకవర్గానికి చెందిన కన్నబాబు అక్కడికి చేరుకోవడంతో పార్టీకి ద్రోహం చేసే వారిని ఎలా అనుమతిస్తారంటూ ఆత్మకూరు టీడీపీ మండల అధ్యక్షుడు సుంకర పెంచలచౌదరి మండిపడ్డారు. ఈ క్రమంలో కన్నబాబు ఏమి మాట్లాడుతున్నావని ముందుకు రావడంతో టీడీపీ నేతలు వారించే ప్రయత్నం చేశారు. కొద్దిసేపు కార్యాలయంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ఆనం రామనారాయణరెడ్డికి ఆయన వర్గీయులు ఫోన్‌ చేసి పరిస్థితిని వివరించారు. దీంతో ఆగమేఘాల మీద కార్యాలయానికి చేరుకున్నారు.  

బీద రవిచంద్రపై ఆగ్రహం  
ఆనం రామనారాయణరెడ్డి కార్యాలయానికి చేరుకుని జిల్లా టీడీపీ అధ్యక్షుడు బీద రవిచంద్రతోపాటు పార్టీ పరిశీలకులు రాకేష్‌ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన నియోజకవర్గంలో పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్న వ్యక్తిని ఎందుకు అనుమతించారని ప్రశ్నించారు. బీజేపీ, జనసేనలోని కొందరితో నామినేషన్లు వేయించారని, వారికి తనకు తెలియకుండా బీఫారాలు ఎలా ఇస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నా వర్గీయులనే బెదిరిస్తారా? తెరచాటు రాజకీయాలు చేయడం సరైన పద్ధతి కాదన్నారు. ఇప్పటి వరకు ఎన్ని జరుగుతున్నా తలదించుకుని వెళుతున్నానని, తలెత్తి రాజకీయాలు చేస్తే తట్టుకోలేరన్నారు.     

ఇదీ చదవండి: ఏపీ మున్సిపల్‌ ఎన్నికల్లో రాయగడ మ‌హిళ‌ పోటీ


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement