అర్నబ్‌ ఎఫెక్ట్‌.. ఆ జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ | Cyclone Arnab Effect: Red Alert For Several Districts In AP | Sakshi
Sakshi News home page

అర్నబ్‌ ఎఫెక్ట్‌.. ఆ జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌

Oct 28 2026 11:05 AM | Updated on Oct 28 2026 11:21 AM

Cyclone Arnab Effect: Red Alert For Several Districts In AP

సాక్షి, కోనసీమ జిల్లా: యానాం-నరసాపురం మధ్య అర్నబ్‌ తుపాను తీరం దాటింది. తీరం దాటిన సమయంలో 125-130 కి.మీ వేగంతో పెను గాలులు వీస్తున్నాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, బాపట్ల, కృష్ణా, కాకినాడ, కోనసీమ, ఎన్టీఆర్ జిల్లాలకు రెడ్ అలర్ట్‌ను వాతావరణ శాఖ జారీ చేసింది. విజయనగరం, గుంటూరు, పల్నాడు, శ్రీకాకుళం, మన్యం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయ్యింది. అతి తీవ్ర తుపాను నుంచి తీవ్ర తుపానుగా బలహీనపడిన ఆర్నబ్‌.. ఈ ఉదయం 8:30 గంటలకు తీవ్ర తుపానుగా మారినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది.

తెల్లవారుజామున 2 గంటల నుంచి ఉదయం 8 గంటల మధ్య తీరం దాటిన తుపాను.. యానాంకు నైరుతి దిశగా తీరాన్ని దాటింది. నర్సాపురానికి తూర్పు ఈశాన్యంగా 20 కిలోమీటర్ల దూరంలో తీరాన్ని దాటిన తుపాను కేంద్రం.. యానాంకు నైరుతిగా 40 కిలోమీటర్లు.. కాకినాడకు నైరుతిగా 60 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రం ఉండగా.. గరిష్ఠంగా గంటకు 150 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచినట్లు వాతావరణ శాఖ తెలిపింది.

తుపాను కేంద్ర ప్రాంతం పూర్తిగా భూభాగంలోకి ప్రవేశించడంతో తీరం దాటే ప్రక్రియ పూర్తయినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

ఇదీ చదవండి: మహోగ్రరూపం.. విరుచుకుపడిన అర్నబ్‌(ఫొటోలు)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement