సాక్షి, విజయవాడ: అర్నబ్ తుపాను ప్రభావంతో పలు విమానాలు, రైళ్లు రద్దు అయ్యాయి. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు విమాన రాకపోకలు నిలిచిపోయాయి. మంగళ, బుధవారాల్లో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం (గన్నవరం), రాజమండ్రి విమానాశ్రయం నుంచి పలు సర్వీసులను రద్దు చేశారు. విజయవాడ నుంచి రాకపోకలు సాగించే ఆరు విమానాలను రద్దు చేశారు. కడప, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నుంచి గన్నవరానికి నడిచే ఐదు ఇండిగో సర్వీసులను రద్దు చేశారు.
విశాఖ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సర్వీస్ రద్దయింది. ఇవాళ (బుధవారం) ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన అన్ని సర్వీస్‌లను రద్దు చేసినట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఫ్లై 91 హైదరాబాద్–విజయవాడ సర్వీసులు, ఎయిర్ ఇండియా న్యూఢిల్లీ సర్వీసును రద్దు చేసిన ట్లు ఆ సంస్థలు ప్రకటించాయి. రాజమహేంద్రవరం విమానాశ్రయంలోనూ సర్వీసులను రద్దు చేశారు.
పలు రైళ్లు రద్దు
రైల్వే శాఖ పలు రైళ్లను రద్దు చేసి కొన్నింటిని దారి మళ్లించింది. శ్రీకాకుళం రోడ్ – చర్లపల్లి (07038), సికింద్రాబాద్–హౌరా (12704), సికింద్రాబాద్–భువనేశ్వర్ (17016), హైదరాబాద్–విశాఖపట్నం (12728), మహబూబ్‌నగర్–విశాఖపట్నం (12862), లింగంపల్లి–కాకినాడ (12776), లింగంపల్లి–నర్సాపూర్ (17256)..
లింగంపల్లి–కాకినాడ (12738), నాందేడ్–సంబల్పూర్ (20810), చర్లపల్లి–శ్రీకాకుళంరోడ్ (07037) రైళ్లను ఈ నెల 27, 28 తేదీల్లో రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. నాగర్‌సోల్ నుంచి నర్సాపూర్ (12788) ట్రైన్‌ను చర్లపల్లి నుంచి నర్సాపూర్‌కు పరిమితం చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ వెల్లడించారు.
ఇదీ చదవండి: తుపాన్ ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: వైఎస్ జగన్


