నరసాపురం-యానాం మధ్య తీరం దాటనున్న ’అర్నబ్‌’ | Andhra Pradesh: Cyclone Arnab October 28 2026 Updates | Sakshi
Sakshi News home page

నరసాపురం-యానాం మధ్య తీరం దాటనున్న ’అర్నబ్‌’

Oct 28 2026 6:53 AM | Updated on Oct 28 2026 7:55 AM

Andhra Pradesh: Cyclone Arnab October 28 2026 Updates

ఏపీలో అర్నాబ్ తుపాను విధ్వంసం సృష్టించింది. కోనసీమలో 19 మండలాల పరిధిలో వందలాది చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఏకధాటిగా కురిసిన ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. నేలకూలిన.. లోతట్టు ప్రాంతాలు  జలమయమయ్యాయి. ఈదురు గాలుల తీవ్రతకు తీరప్రాంతవాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. నిన్న సాయంత్రం నుంచి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పూర్తిగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కోనసీమలో రాత్రి అంతా అంధకారం నెలకొంది. 

ఏలూరు జిల్లాలోఅర్నబ్‌ తుపాన్‌ బీభత్సం..

  • ఏలూరు మినీ బైపాస్ లో బస్సుపై కూలిన భారీ వృక్షం

  • పలాస నుంచి విజయవాడ వెళ్తున్న ప్రతాప్ ట్రావెల్స్ బస్సుపై విరిగిపడిన మహావృక్షం

  • బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసం.. తప్పిన పెను ప్రమాదం

  • డ్రైవర్ చాకచక్యంతో అదుపు తప్పకుండా ఆగిన బస్సు.. తప్పిన భారీ ప్రమాదం

  • ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు

  • ప్రయాణికులను సురక్షితంగా మరో బస్సులోకి తరలించిన సిబ్బంది

  • డ్రైవర్‌కు స్వల్ప గాయాలు.. ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలింపు

  • భారీ వర్షంలోనూ రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది.. వృక్షాన్ని  తొలగించిన సిబ్బంది

  • ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టిన పోలీస్ సిబ్బంది

కోనసీమకు పొంచి ఉన్న ముప్పు..

  • నెమ్మదిగా అర్నబ్ ల్యాండ్ ఫాల్ ప్రక్రియ
  • నరసాపురం - యానాం మధ్య తీరం దాటనున్న అతి తీవ్ర తుపాన్
  • మధ్యాహ్నానికి తీరం దాటే అవకాశం
  • యానాం తీరానికి సమీపంగా వచ్చిన తర్వాత తీరం దాటే సమయంలో స్థిరంగా కొనసాగడంతో కోనసీమకు పొంచి ఉన్న ముప్పు
  • విశాఖలో 24 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదు
  • పలు ప్రాంతాల్లో నిలిచిన వర్షపు నీరు
  • అల్లకల్లోలంగా సముద్ర వాతావరణం
  • మరో 24 గంటలపాటు కొనసాగనున్న ప్రభావం..

ఉమ్మడి విశాఖ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షం

  • హరిజన జగ్గయ్యపాలెంలో ఇళ్లలోకి చేరిన వర్షపు నీరు..
  • నీట మునిగిన జగ్గయ్యపాలెం.. 
  • రాకపోకలకు అంతరాయం..

రెండు గంటలుగా నిలకడగా ఉన్న తీరం దాటే ప్రక్రియ

  • నరసాపురానికి 30 కిమీ దూరంలోనే కేంద్రీకృతం
  • మధ్యాహ్ననికి పూర్తిగా తీరం దాటే అవకాశం
  • తీరం వెంబడి కొనసాగనున్న బలమైన ఈదురుగాలులు, వర్షాలు
  • ఇవాళ కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: విపత్తుల సంస్థ

అర్నబ్‌ ఎఫెక్ట్‌.. పలు విమానాలు, రైళ్లు రద్దు

  • భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు నిలిచిన విమాన రాకపోకలు
  • తుపాను కారణంగా 28 విమాన సర్వీసులు రద్దు
  • నేడు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో అన్ని విమానాలు రద్దు
  • గన్నవరం ఎయిర్‌పోర్టులో 20 విమాన సర్వీసులు రద్దు

కోనసీమలో అల్లకల్లోలం:

  • కోనసీమలో పలుచోట్ల కూలిన చెట్లు
  • రావులపాలెం నుండి అమలాపురం వెళ్లే దారిలో పెద్ద సంఖ్యలో రోడ్లపై చెట్లు కూలిపోవడంతో నిలిచిపోయిన రాకపోకలు
  • ఈతకోట నుంచి పి. గన్నవరం వెళ్లే దారిలో భారీగా కూలిన చెట్లు
  • భారీ సంఖ్యలో చెట్లు నేలకొరగడంతో కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురానికి వెళ్లే దారుల బంద్
  • భారీగా నిలిచిపోయిన దూర ప్రాంతాల బస్సులు
  • పలుచోట్ల దెబ్బతిన్న వరి పనలు
  • వేలాది ఎకరాల్లో నేలనంటిన వరిపనలు

తుపాన్‌ ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: వైఎస్‌ జగన్‌

  • ప్రజల ప్రాణాలు కాపాడడమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యత కావాలి

  • పునరావాస కేంద్రాలు, ఆహారం, తాగునీరు, మందులు, 

  • మౌలిక వసతులపై దృష్టి పెట్టాలి

  • గర్భిణులు, బాలింతలు, చిన్న పిల్లలు, వృద్ధులు, వ్యాధిగ్రస్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి

  • రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ బకాయిలు వెంటనే అందజేయాలి 

  • సహాయక చర్యల్లో వైఎస్సార్‌సీపీ శ్రేణులు చురుగ్గా పాల్గొనాలి
     

అనకాపల్లి జిల్లా:

  • తుపాను ప్రభావంతో ఈదురు గాలులతో కూడిన  వర్షం
  • పలు గ్రామాల్లో విద్యుత్‌కు అంతరాయం
  • యలమంచిలి జాతీయ రహదారి రేగిపాల వద్ద కూలిన భారీ వృక్షం.. ట్రాఫిక్‌కి అంతరాయం
  • లంకెలపాలెం వద్ద జాతీయ రహదారి కూలిని చెట్లు రాకపోకలకు అంతరాయం
  • ఏజెన్సీలో కురుస్తున్న భారీ వర్షాలు
  • ప్రమాద స్థాయికి చేరుకున్న పెద్దేరు రిజర్వాయర్ నీటి మట్టం
  • లోతట్టు ప్రాంత ప్రజలను ప్రభుత్వం చేసి 500 క్యూసెక్కుల నీటిని వీడియోలు చేసిన జలవనరుల శాఖ అధికారులు
  • అనకాపల్లి జిల్లాలో అత్యధికంగా కసింకోట మండలంలో 131.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు

అర్నబ్ తుపాను ఎఫెక్ట్:

  • విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో మునిగిపోయిన ఐదు మత్స్యకార బోట్లు
  • మరికొన్ని బోట్లు ధ్వంసం అయినట్టు సమాచారం

కొనసాగుతున్న అర్నబ్ ల్యాండ్ ఫాల్ ప్రక్రియ

  • మరో మూడు గంటల్లో పూర్తిగా తీరం దాటనున్న అర్నబ్

  • అర్నబ్ ప్రభావంతో ఉమ్మడి కృష్ణా జిల్లాలో గాలులతో కూడిన భారీ వర్షం

  • పలు గ్రామాలకు నిలిచిపోయిన విద్యుత్ సరఫరా

  • అంధకారంలో గ్రామాలు

కాకినాడ జిల్లా:

  • జిల్లాపై అర్నబ్ తుఫాన్ భీభత్సం
  • రాత్రి నుండి పెను గాలులు, భారీ వర్షాలు
  • విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో రాత్రి నుంచి అంధకారంలో ప్రజలు
  • తీరంలో ఎగసిపడిన రాకాసి అలలు
  • కాకినాడ మహలక్ష్మీ నగర్, ముత్తానగర్, ఉప్పాడలో సుబ్బంపేట, సూరాడ పేటలో ముందుకు చొచ్చుకొచ్చిన సముద్రం
  • నీట మునిగిన పలు ఇళ్లు
  • నేలకొరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలు

విశాఖపట్నం:

పలు ప్రాంతాల్లో నిలిచిన విద్యుత్ సరఫరా
భీకర గాలులకు నేలకొరిగిన భారీ వృక్షాలు
అనకాపల్లి జిల్లా కన్నూరు పాలెంలో 25 సెం.మి వర్షపాతం నమోదు
విశాఖ నగరంలో 24,సింహాచలం లో 22 సెంమి వర్షపాతం నమోదు
గడచిన 24 గంటలగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం..

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement