అదృష్టం ఎవరికో? | Mandala Parishad Chair Race Mother-in-Law and Daughter-in-Law | Sakshi
Sakshi News home page

అదృష్టం ఎవరికో?

Oct 28 2026 11:11 AM | Updated on Oct 28 2026 11:18 AM

Mandala Parishad Chair Race Mother-in-Law and Daughter-in-Law

కాకినాడ: తుని మండల పరిషత్‌ పీఠం దక్కించుకునేందుకు ప్రాదేశిక పోరులో అత్తా కోడళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కేఓ మల్లవరం గ్రామానికి చెందిన వైఎస్సార్‌ సీపీ సీనియర్‌ నాయకుడు డొంక వెంకట బెనర్జీ తల్లి సత్యవతి, భార్య వెంకట రామ నాగ భరణి వైఎస్సార్‌ సీపీ తరఫున ఎంపీటీసీ అభ్యర్థులుగా పోటీలో నిలిచారు. కేఓ మల్లవరం సర్పంచ్‌గా (2021–26) పని చేసిన అనుభవంతో సత్యవతి అదే గ్రామంలో ఎంపీటీసీగా పోటీ చేస్తుండగా, ఆమె కోడలు పక్కనే ఉన్న రాపాక ఎంపీటీసీ స్థానం నుంచి పోటీలో ఉన్నారు. 
– తుని రూరల్‌ 


మనవరాలి గెలుపు కోసం.. 
పెదపూడి – 1 ఎంపీటీసీ స్థానానికి వైఎస్సార్‌ సీపీ తరఫున కొంగర విజయలక్ష్మి పోటీ చేస్తున్నారు. ఆమె విజయం కోసం తాత కొంగర అబ్బులు 96 ఏళ్ల వయసులోనూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఫ్యాన్‌ గుర్తుపై ఓటు వేసి తన మనవరాలిని గెలిపించాలంటూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఆ పెద్దాయన ఓట్లు అడుగుతున్న తీరును, ఆయన ఉత్సాహాన్ని చూసి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
 – పెదపూడి 


వాడపాలెం సెంటర్‌లో కూటమి నేతల ఫొటోలతో..   

 ఇవి కనబడలేదా? 
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది. దాని ప్రకారం రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు కప్పాలి. ప్రభుత్వ పథకాలు, రాజకీయ నేతల ఫ్లెక్సీలను తొలగించాలి. కానీ ఈ నిబంధనలు వైఎస్సార్‌ సీపీకి చెందిన వారికి మాత్రమే అమలవుతున్నాయి. కూటమికి చెందిన ఫ్లెక్సీలు మాత్రం కొందరు అధికారులకు కనిపించడం లేదు. కొత్తపేట మండలంలో వీటిని చూసి ప్రజలు విస్తుపోతున్నారు.                  
– కొత్తపేట   


కొత్తపేట – వాడపాలెం రోడ్డులో పవన్‌ కల్యాణ్‌ ఫ్లెక్సీ  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement