విత్‌డ్రా కోసం అరాచకం! | TDP Accused of Pressuring YSRCP Candidates to Withdraw Nominations | Sakshi
Sakshi News home page

విత్‌డ్రా కోసం అరాచకం!

Oct 28 2026 5:05 AM | Updated on Oct 28 2026 5:05 AM

TDP Accused of Pressuring YSRCP Candidates to Withdraw Nominations

కర్నూలు జిల్లా అరికెర వైఎస్సార్‌సీపీ అభ్యర్థి తిమ్మప్పను బలవంతంగా లాక్కెళ్తున్న ఆలూరు ఎస్‌ఐ

పచ్చమూకల కిడ్నాప్‌లు.. బెదిరింపులు.. దాడులు..  

నామినేషన్ల చించివేతలు.. ఫోర్జరీ సంతకాలతో ఉపసంహరణలు

వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు బెదిరింపులు, ఒత్తిళ్లు

రాళ్లపాడులో ఎంపీటీసీ అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యుల కిడ్నాప్‌

చాగలమర్రిలో వైఎస్సార్‌సీపీ నేత కుమార్‌రెడ్డి ఇంటిపై రాళ్ల దాడి 

బీఫారం సమర్పించేందుకు వచ్చిన అరికెర అభ్యర్థిని పోలీస్‌ స్టేషన్‌కు తరలించిన ఎస్‌ఐ

మార్కాపురంలో వైఎస్సార్‌సీపీకి చెందిన తొమ్మిది మంది అభ్యర్థుల బీఫారాలు లాక్కొని చించివేత

వజ్రకరూరులో ఇద్దరు అభ్యర్థులు అదృశ్యమయ్యారంటూ కుటుంబ సభ్యుల ఆందోళన

టెక్కలిలో ఎంపీటీసీ అభ్యర్థి నామినేషన్‌ ఉపసంహరణకు మంత్రి అచ్చెన్నాయుడు ఒత్తిడి 

గంగడపాలెంలో అభ్యర్థి సంతకం ఫోర్జరీ చేసి నామినేషన్‌ ఉపసంహరణ 

చిన్నసాన, ఆలూరు, నాయుడుపేట సహా పలు ప్రాంతాల్లో బలవంతపు ఉపసంహరణలు

సాక్షి, అమరావతి: ప్రజాస్వామ్యానికి పాతరేసి.. ఎన్నికల బరినే అరాచకాల రణరంగంగా మార్చేశారు!  పచ్చ గూండాలు దారుణమైన దాడులకు దిగారు. నామినేషన్‌ వేస్తే బెదిరింపులు.. బరిలో నిలిస్తే కిడ్నాప్‌లు.. బీఫారం సమర్పించబోతే అడ్డంకులు.. విత్‌డ్రా చేయకపోతే పోలీసుల ఒత్తిళ్లు! మార్కాపురంలో తొమ్మిది మంది అభ్యర్థుల బీఫారాలు లాక్కొని చించివేయడం, వజ్రకరూరులో అభ్యర్థులు అదృశ్యమయ్యారనే ఫిర్యాదులు, ఆలూరులో అభ్యర్థిని పోలీస్‌ స్టేషన్‌కు తరలించిన ఘటన, గంగడపాలెంలో సంతకాల ఫోర్జరీ ఆరోపణలు.. టెక్కలిలో నామినేషన్‌ ఉపసంహరించుకోవాలంటూ మంత్రి అచ్చెన్నాయుడు స్వయంగా ఫోన్‌ చేయడం.. మంగళవారం నామినేషన్ల విత్‌డ్రా కోసం వెన్నుపోటుపార్టీ చేయని అరాచకం లేదు. వారికి వెన్ను దన్నుగా కొందరు పోలీసు అధికారులు చెలరేగారు. అధికారపార్టీ అభ్యర్థుల ఏకగ్రీవాల కోసం గతంలో ఎన్నడూ లేనంతగా దిగజారారు.  

రాళ్లపాడులో ఎంపీటీసీ అభ్యర్థి కిడ్నాప్‌ 
ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం రాళ్లపాడులో నామినేషన్‌ విత్‌డ్రా చేసుకోవాలంటూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థిపై టీడీపీ నేతలు దౌర్జన్యం చేశారు. రాళ్లపాడు ఎంపీటీసీ అభ్యర్థి కుర్రా లక్షి్మ, కుర్రా లింగమ్మలను సోమవారం అర్థరాత్రి టీడీపీ గూండాలు కిడ్నాప్‌ చేశారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి, వారి కుటుంబ సభ్యులను, పిల్లలను కూడా వదలకుండా టీడీపీ వాళ్లు తీసుకుపోవడంతో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. 

వైఎస్సార్‌సీపీ నేత కుమార్‌రెడ్డి ఇంటిపై రాళ్ళ దాడి 
ఆళ్లగడ్డ నియోజకవర్గం చాగలమర్రి మండల కేంద్రంలో వైఎస్సార్‌సీపీ కన్వీనర్‌ కుమార్‌రెడ్డి ఇంటిపై పచ్చ గూండాలు రాళ్లు దాడికి పాల్పడ్డారు. రెండు వాహనాలతో వచి్చన రౌడీలు రాళ్ల దాడి చేయడంపై కుమార్‌రెడ్డి చాగలమర్రి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.  

సీతారాంపురంలో లోకేష్ రెడ్డి అక్రమ అరెస్టు.. 
నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం సీతారాంపురం వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి చింతం లోకేష్ రెడ్డిని పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. మంగళవారం ఆయన నామినేషన్‌ కేంద్రంలో బీఫామ్‌ సమరి్పస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనను అక్రమంగా అరెస్టు చేయడంపై నిరసన వ్యక్తం చేస్తూ సీతారాంపురం పోలీస్‌ స్టేషన్‌ వద్దకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. లోకేష్ రెడ్డి అరెస్ట్‌ను తప్పుబడుతూ ఉదయగిరి 
వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్‌రెడ్డి కార్యకర్తలతో కలిసి  పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్నారు. కుట్ర రాజకీయాలపై రాజగోపాల్‌రెడ్డి 
మండిపడ్డారు. 

మార్కాపురంలో టీడీపీ నేత బరితెగింపు.. వైఎస్సార్‌సీపీ బీఫాంలు లాక్కొని చించివేత! 
మార్కాపురం మండల పరిషత్‌ కార్యాలయంలో టీడీపీ నేత కాకర్ల శ్రీనివాసులు అరాచకానికి తెగబడ్డారు. ఎంపీటీసీ నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియలో భాగంగా వైఎస్సార్‌సీపీకి చెందిన తొమ్మిది మంది అభ్యర్థులు మధ్యాహ్నం 3 గంటల్లోపు ఆర్వో రవిప్రసాద్‌కు అందజేసిన బీఫాంలను బలవంతంగా లాక్కొని బయటకు తీసుకెళ్లి చించేశారు. అధికారుల వద్ద భద్రంగా ఉండాల్సిన బీఫాంలనే లాక్కొని ధ్వంసం చేయడం ద్వారా ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేశారు. ఘటనపై స్పందించిన అధికారులు.. కాకర్ల శ్రీనివాసులుపై కేసు నమోదు చేస్తామని తెలిపారు. 

నంచర్లలో ఎంపీటీసీ అభ్యర్థి దంపతులకు బెదిరింపులు 
కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి మండలం నంచర్ల గ్రామంలో ఎంపీటీసీ అభ్యర్థి, ఆయన భార్యను టీడీపీ నేతలు కిడ్నాప్‌ చేశారు. నామినేషన్‌ ఉపసంహరించుకోవాలని బెదిరించారు. ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకునేలా అభ్యర్థిపై ఒత్తిడి చేశారు. నంచర్ల ఎంపీటీసీ అభ్యర్థి, ఆయన భార్య భద్రతపై తక్షణమే దృష్టి సారించాలని, వారి ఆచూకీపై స్పష్టత తీసుకురావాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీని వైఎస్సార్‌సీపీ నేతలు కోరారు.  నూజెండ్ల మండలం మలకలూరు ఎంపీటీసీ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేసిన వంగల వీరమ్మ బీఫారం సమర్పించేందుకు వెళుతుండగా బలవంతంగా విత్‌ డ్రా ఫారం మీద టీడీపీ నేతలు సంతకం పెట్టించి నామినేషన్‌ ఉపసంహరించుకునేలా చేశారు. 

దెందులూరులో ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులపై ఒత్తిళ్లు.. 
ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులను పోటీ నుంచి తప్పించేందుకు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ అనుచరులు బెదిరింపులకు దిగారు. పోటీ నుంచి తప్పుకోవాలని వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను కిడ్నాప్‌లు, అక్రమ కేసుల బెదిరింపులకు పాల్పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి మండిపడ్డారు.  

బెదిరించి విత్‌డ్రా చేయించారు
నాయుడుపేట మండల వైఎస్సార్‌సీపీ అభ్యర్థి నరసమ్మను పచ్చ నేతలు బెదిరించి నామినేషన్‌ విత్‌డ్రా చేయించారు. దీంతో టీడీపీ అభ్యర్థిగా 
ఉన్న తుపాకులు కన్నెమ్మ జెడ్పీటీసీగా ఏకగ్రీవం చేసుకున్నారు. అధికార పార్టీ నేతలు, పోలీసులు బెదిరింపులకు పాల్పడి వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థిని పోటీ నుంచి తప్పించారని ప్రజలు చర్చించుకుంటున్నారు.  

పయ్యావుల ఇలాకాలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు అదృశ్యం! 
మంత్రి పయ్యావుల కేశవ్‌ ఇలాకా అనంతపురం జిల్లా వజ్రకరూరులో ఎంపీటీసీ ఎన్నికల వేళ కలకలం రేగింది. వజ్రకరూరు–1 స్థానానికి నామినేషన్లు వేసిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు కదిరప్ప, నల్లబోతుల రాజును మంగళవారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తులు ఇళ్ల నుంచి తీసుకెళ్లారని కుటుంబ సభ్యులు తెలిపారు. నామినేషన్లు ఉపసంహరించుకునేలా ఒత్తిళ్లు తెచి్చ, తన భర్తను కిడ్నాప్‌ చేశారని రాజు భార్య, మాజీ సర్పంచ్‌ మోనాలీసా ఆరోపించారు. దీనిపై ఎన్నికల అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరో అభ్యర్థి గురుస్వామిపైనా ఉపసంహరణకు ఒత్తిడి తెచ్చారని తెలిపారు. అయితే, ఇద్దరు అభ్యర్థులూ నామినేషన్లు ఉపసంహరించుకున్నారని, టీడీపీ అభ్యర్థి గుడిసె డేవిడ్‌ ఏకగ్రీవమైనట్లు ఆర్వో రామకృష్ణ ప్రకటించారు.

ఎన్నికల అధికారి మోసంతో నామినేషన్‌ గల్లంతు! 
శ్రీకాకుళం జిల్లా కోట»ొమ్మాళి మండలం చిన్నసాన ఎంపీటీసీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి రొక్కం శ్రావణి నామినేషన్‌ తిరస్కరణకు గురైందని ఆమె భర్త కరుణాకర్‌ (శ్రీధర్‌) తెలిపారు. ఈ నెల 22, 23 తేదీల్లో రెండు నామినేషన్లు దాఖలు చేసి, ఒక్కోదానికి రూ.3 వేల చొప్పున చెల్లించామన్నారు. పరిశీలన సమయంలో నామినేషన్లు సక్రమంగానే ఉన్నాయని అధికారులు చెప్పారని, అనంతరం వారి సూచన మేరకు ఒక నామినేషన్‌ను ఉపసంహరించుకున్నామని వివరించారు. మిగిలిన నామినేషన్‌కు బీ ఫారం తీసుకురావాలని చెప్పిన అధికారులు, మంగళవారం వచ్చేసరికి మొత్తం నామినేషన్‌ తిరస్కరించినట్లు చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల అధికారి జగన్మోహన్‌రావు మోసం వల్లే అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ, న్యాయం కోసం కోర్టును ఆశ్రయిస్తామని వెల్లడించారు.

ఫోర్జరీ సంతకాలతో నామినేషన్‌ విత్‌డ్రా!
గంగడపాలెం ఎంపీటీసీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కూచిపూడి కుమారి నామినేషన్‌ ఉపసంహరణ వివాదాస్పదంగా మారింది. కూటమి నాయకులు ఆమె సంతకాన్ని ఫోర్జరీ చేసి ఉపసంహరణ పత్రం సమర్పించారని, అభ్యర్థి హాజరు లేకుండానే ఎన్నికల అధికారి నాగయ్య దానిని ఆమోదించారని కుమారి తనయుడు మణికంఠ ఆరోపించారు. మూడు రోజులుగా బెదిరింపులు, ప్రలోభాలకు గురిచేసినా తన తల్లి నామినేషన్‌ ఉపసంహరించుకోలేదన్నారు. రాత్రి 7 గంటల వరకు ఉపసంహరణ వివరాలు వెల్లడించకపోవడం, మీడియా ఫోన్లకు అధికారి స్పందించకపోవడంపై ప్రశ్నలు లేవనెత్తారు. ఈ వ్యవహారంపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని మణికంఠ తెలిపారు.

ఆలూరు ఎస్‌ఐ బరితెగింపు.. 
కర్నూలు జిల్లా ఆలూరులో పోలీసుల అండతో ఎన్నికల ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. అరికెర వైఎస్సార్‌ సీపీ ఎంపీటీసీ అభ్యర్థి తిమ్మప్ప బీ ఫారం సమర్పించేందుకు ఎంపీడీవో కార్యాలయానికి వస్తే.. ఎస్‌ఐ మన్మథ విజయ్‌ అతడిని బలవంతంగా పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అక్కడ మాజీ సర్పంచ్‌ను దుర్భాషలాడి బెదిరించారు. అంతటితో ఆగకుండా అధికారులే తిమ్మప్ప సంతకం చేసి నామినేషన్‌ ఉపసంహరణను నమోదు చేశారు. వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులను ఫోన్‌లో బెదిరించడం.. బీ ఫారాలు సమర్పించేందుకు వచి్చన వారిని అడ్డుకోవడం.. చివరకు బలవంతంగా నామినేషన్లు ఉపసంహరింపజేయడం.. ఆలూరులో ఎన్నికల ప్రక్రియ ఏ స్థాయికి దిగజారిందో ఈ ఘటన స్పష్టం చేస్తోంది. 

ఎంపీటీసీ అభ్యర్థిపై మంత్రి అచ్చెన్న ఒత్తిడి! 
శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థిని బరిలో నుంచి తప్పించేందుకు మంత్రి అచ్చెన్నాయుడే రంగంలోకి దిగారు. సంత»ొమ్మాళి మండలం చిన్నతుంగాం ఎంపీటీసీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కాని జగ్గారావుకు ఫోన్‌ చేసి నామినేషన్‌ ఉపసంహరించుకోవాలని ఒత్తిడి తెచ్చినట్లు చెబుతున్న సంభాషణ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. టీడీపీ మాజీ సర్పంచ్‌ శిమ్మ గోవిందరావు తొలుత జగ్గారావుకు ఫోన్‌ చేసి, మంత్రి మాట్లాడతారని చెప్పడం.. వెంటనే కాన్ఫరెన్స్‌ కాల్‌లో అచ్చెన్నాయుడు మాట్లాడటం ఈ వ్యవహారంలో కీలకంగా మారింది. 

ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అనేది అభ్యర్థి నిర్ణయం కావాల్సింది పోయి.. నామినేషన్‌ ఉపసంహరించుకోవాలంటూ మంత్రి స్థాయి నుంచే ఒత్తిడి రావడం టెక్కలి రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గం పొందూరు మండలంలో ఐదుగురు వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్లను వారికే తెలియకుండా విత్‌ డ్రా అయినట్టు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ప్రకటించడంతో అభ్యర్థులు అవక్కయ్యారు. దీనిపై ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిని నిలదీశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement