టీడీపీ గూండాలపై హత్యాయత్నం కేసు | MP Mithun Reddy Files Complaint in Attempted Murder Case Against TDP Workers | Sakshi
Sakshi News home page

టీడీపీ గూండాలపై హత్యాయత్నం కేసు

Oct 28 2026 4:27 AM | Updated on Oct 28 2026 4:27 AM

MP Mithun Reddy Files Complaint in Attempted Murder Case Against TDP Workers

మధూసూదన్‌ నాయుడు

పుంగనూరు టీడీపీ ఇన్‌చార్జి 

మధుసూదన్‌ నాయుడు సహా 23 మందిపై కేసు నమోదు 

ఈనెల 16న ఎంపీ మిథున్‌ రెడ్డిపై టీడీపీ మూకల హత్యాయత్నం 

వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి ఫిర్యాదుతో ఎట్టకేలకు కేసు నమోదు

సాక్షి, మదనపల్లె: పుంగనూరులో ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన మున్సిపల్‌ ఎన్నికల్లో హింసతో నామినేషన్లను అడ్డుకొని, ఈ నెల 16న వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. టీడీపీ గూండాల దాడిలో ఎంపీ మిథున్‌రెడ్డికి రక్షణగా ఉన్న సీఆర్పీఎఫ్‌ భద్రతా సిబ్బంది, వైఎస్సార్‌సీపీ శ్రేణులు సైతం తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై ఎంపీ మిథున్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పుంగనూరు సీఐ సుబ్బరాయుడు ఆదివారం రాత్రి కేసు నమోదు చేశారు. 

ఈ మేరకు ఏ–1 మధుసూదన్‌ నాయుడు (పుంగనూరు టీడీపీ ఇన్‌చార్జ్‌), ఏ–2 రవి నాయుడు (టీడీపీ అబ్జర్వర్‌), ఏ–3 మధుసూదన్‌ రాయల్, ఏ–4 సయ్యద్‌ సుహేల్, ఏ–5 సయ్యద్‌ ఇబ్రహీం, ఏ–6 శామీర్, ఏ–7 మమ్ము, ఏ–8 జేఎంబీ అంజాద్, ఏ–9 బీడీ కాలనీ సయ్యద్, ఏ–10 రామకృష్ణమరాజు, ఏ–11 సుబ్రహ్మణ్యం రాజు, ఏ–12 సుబ్బరాయప్ప, ఏ–13  అయూబ్‌ ఖాన్, ఏ–14 ఇంతియాజ్‌ ఖాన్, ఏ–15 చిన్న మోహన్, ఏ–16 పెద్ద మోహన్, ఏ–17 శ్రీకాంత్‌ మొదలియార్, ఏ–18 ఇరికిపెంట శ్రీనివాసులు నాయుడు, ఏ–19 దేశాది ప్రకా‹Ù, ఏ–20 మిర్జేపల్లి ప్రసాద్, ఏ–21 శివ, ఏ–22 పవన్‌ నాయుడు, ఏ–23 మునిరాజు, ఇతర టీడీపీ నేతలపై కేసు నమోదైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement