ఆరు జోన్లు.. రెండు మల్టీ జోన్లు | AP School Education Department Service Rule Updates | Sakshi
Sakshi News home page

ఆరు జోన్లు.. రెండు మల్టీ జోన్లు

Oct 28 2026 4:03 AM | Updated on Oct 28 2026 4:03 AM

AP School Education Department Service Rule Updates

విద్యాశాఖ సర్వీస్‌ రూల్స్‌లో కీలక మార్పులు

రాష్ట్రపతి ఉత్తర్వులు–2025కు అనుగుణంగా క్యాడర్‌ విభజన

సాక్షి, అమరావతి: ఏపీ పాఠశాల విద్యాశాఖ సర్వీస్‌ నిబంధనలను రాష్ట్రపతి ఉత్తర్వులు–2025కు అను­గుణంగా సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌ ఎడ్యుకేషనల్‌ సర్వీస్‌ రూల్స్‌­–1998లో మార్పులు చేసింది. పోస్టుల భర్తీ, బదిలీ­ల్లో కీలక మార్పులతోసహా డీఈవో పోస్టుల భర్తీని మల్టీ జోన్‌ పరిధిలోకి తేవడం, ప్రత్యక్ష నియామ­కా­ల్లో స్థానికులకు 95 శాతం రిజర్వే­షన్‌ అమలు ఉత్త­ర్వుల్లో కీలక అంశాలు. 

సవరణలు 2026 సెప్టెంబర్‌ 15 నుంచి అమల్లోకి వచ్చినట్లుగా పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్‌ ఎడ్యుకేష­నల్‌ సర్వీస్‌ రూల్స్‌ 1998’కి మా­ర్పులు చేస్తూ పాఠశాల విద్యా­శాఖ ముఖ్య కార్యద­ర్శి జె.శ్యామలరావు మంగళవారం జీవో జారీ చేశా­రు.  దీనిప్రకారం ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ స్పోర్ట్స్‌ కోఆర్డినేటర్, ఓపెన్‌ స్కూల్‌ జిల్లా కోఆర్డినేటర్, మండల ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్‌–2 పోస్టులను ప్రభుత్వం కొత్త కేటగిరీల్లో చేర్చింది. 

రాష్ట్రంలోని 26 జిల్లాలను ఆరు జోన్లు, రెండు మల్టీ జోన్లుగా విభజించింది. పోస్టుల­వారీగా నియామక యూనిట్లు, అధికా­రు­లను నిర్దేశించింది. ఇకపై ప్రత్యక్ష నియామకాలు (డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌), పదోన్నతులు, సీనియా­రిటీ, బదిలీలు తదితర సర్వీసు అంశాలన్నీ నిర్దేశించిన యూనిట్ల ప్రాతిపదికనే అమలు కానున్నాయి.

జోన్ల వారీగా జిల్లాలు..
జోన్‌ 1: శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీ­పురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి
జోన్‌ 2: అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదా వరి, కాకినాడ, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ
జోన్‌ 3: పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా
జోన్‌ 4: గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
జోన్‌ 5: తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్‌ కడప
జోన్‌ 6: నంద్యాల, అనంతపురం, కర్నూలు, శ్రీ సత్యసాయి
– అన్ని జిల్లాలను రెండు మల్టీ జోన్లుగా విభజించారు. మల్టీ జోన్‌–1లో జోన్‌ 1, 2, 3 జిల్లాలు, మల్టీ జోన్‌–2లో 4, 5, 6 జోన్లలోని జిల్లాలు వస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement