వాళ్లపై ఆధారపడి టీడీపీ మనుగడ..: లేళ్ల అప్పిరెడ్డి | Lella Appi Reddy on ap local body elections tdp | Sakshi
Sakshi News home page

వాళ్లపై ఆధారపడి టీడీపీ మనుగడ..: లేళ్ల అప్పిరెడ్డి

Oct 27 2026 6:39 PM | Updated on Oct 27 2026 6:56 PM

 Lella Appi Reddy on ap local body elections tdp

విజయవాడ: ఏపీలో స్థానిక ఎన్నికల వేళ జరుగుతున్న బెదిరింపులపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తెలిపారు. అన్ని ఆధారాలను స్టేట్ ఎలక్షన్ కమిషనర్‌కు ఇచ్చామని తెలిపారు. ఎన్నికల సంఘాన‍్ని కలిసిన తర్వాత లేళ్ల అప్పిరెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు.

‘‘అభ్యర్థుల ఇళ్ల ముందుకు వెళ్లి నామినేషన్ వేయడానికి రండి అని పోలీసులు ప్రచారం చేశారని చంద్రబాబు చెబుతున్నారు. నామినేషన్ వెయ్యలేని పరిస్థితి.. వేసినా రకరకాల కారణాలతో రిజెక్ట్ చేశారు. అభ్యర్థనలు చేసిన అధికారులు పెట్టించుకోలేదు. ఎక్స్‌ మేయర్ అజీజ్ సీఐకి ఫోన్ చేసి డబ్బులు నీ దగ్గరకి పంపుతున్న జీప్ లో పెట్టుకోవాలనిని చెబుతున్నారు. గూడూరు డీఎస్‌పీ నరసింహ మూర్తి వైస్సార్‌సీపీ అభ్యర్థులను బయపెట్టడానికి బెదిరిస్తున్నారు.

బరితెగింపునకు అంతం ఉంటుందా? వ్యవస్థలు కునారిల్లుతున్న పరిస్థితి ఎప్పుడూ చూడలేదు. భయపట్టడం, ప్రలోభ పెట్టడం, పోలీసులపై ఆధారపడి టీడీపీ మనుగడ సాగిస్తుంది. అధికారులను అడ్డం పెట్టుకొని టీడీపీ ముందుకు వెళ్తుంది. ఏఫైల్ ఎలా రాయలో అనంతపురం టీడీపీ నేత చెబుతున్నారు. గూండాలు కత్తులతో బయటికివచ్చి నూజివీడులో వీరంగం సృష్టిస్తున్నాడు. పల్నాడులో ఫేక్ అభ్యర్థులు నామినేషన్లు కొనసాగిస్తున్నారు’’ అని తెలిపారు.

నానా హంగామా చేస్తున్నారు.. 
మునిపాలిటీని ఎంచుకుని రౌడీలను, గుండాలను రప్పించి నానా హంగామా చేస్తున్నారని లేళ్ల అప్పిరెడ్డి చెప్పారు. ‘‘స్థానిక ఎన్నికల్లో ఓటర్లు మాత్రమే ఉండాలి.. ఆ విధంగా చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ ని కోరాం. ఎన్నికల తీర్పు ప్రభుత్వ పనితనానికి, ఏ విధంగా పని చేస్తున్నది అన్న దానికి కొలమానంగా చూస్తాం. గూడూరు డీఎస్పీని వెంటనే సస్పెండ్ చేయాలని కోరాం. 

నెల్లూరు సీఐని సస్పెండ్ చేయాలి. వెలుగులోకి రాని పోలీస్ అధికారుల బెదిరింపులు చాలా ఉన్నాయి. ఈ ఎన్నికలతోనే భవిష్యత్తు మారుతుందని వైఎస్సార్‌సీపీ భావించడం లేదు. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలు జరగాలనే మా పోరాటం. SECలో న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టు మెట్లు ఎక్కుతాం. ఎన్నికల్లో మార్పు రాకపోతే మేము అధికారంలోకి రాగానే విచారణ చేస్తాం. తప్పు చేసిన వాళ్లపై చర్యలు తీసుకొంటాం’’ అని అన్నారు.

మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు మాట్లాడుతూ.. ‘‘పునేఠా ఎన్నికల కమిషనర్‌గా ఉన్నారు. న్యాయం జరుగయితుంది అని అనుకొన్నాం. పోలీసులు DSP స్థాయి వాళ్లు, CI స్థాయి అధికారులు బేరం పెట్టేశారు. పోలీసుల తీరుపై అన్ని ఆధారాలు ఇచ్చాం. ఎన్నికలను రద్దు చేయాలని సుప్రీంకోర్టును కోరుతున్నాం. పవన్‌కు ఆయన వాటా వచ్చింది. జనసేన టికెట్స్ వాటా కాదు. మాధవ్‌కు కూడా ఏవో విసిరినట్లు ఉన్నారు. పోటీలో కుటమి మూడు పార్టీలు లేవు. కేవలం వున్నది ఒకటే పార్టీ అది టీడీపీ’’ అని చెప్పారు. 

ఇదీ చదవండి: కాల్పుల్లో గాయపడ‍్డ హఫీజ్‌కు ఫోన్‌ చేసి మాట్లాడిన వైఎస్‌ జగన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement