సాక్షి, వైఎస్సార్ జిల్లా: ‘‘మున్సిపల్ ఎన్నికల ఓటింగ్ రోజు నేను పులివెందుల వస్తా. అయినా మీరు అక్రమాలు చేయాలనుకున్నారో?. ఎంత మంది వస్తారో రండి. గట్టిగా తగులుదాం. ప్రజాస్వామ్యంలో ఎవరు మంచి చేశారో ప్రజలు వాళ్లకు మాత్రమే తోడుగా నిలబడతారనే సంకేతం కచ్చితంగా పంపిస్తాం’’ అంటూ టీడీపీ గూండాలను వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హెచ్చరించారు.
‘‘మీ మీద పడ్డ దెబ్బను మీ అన్న చూస్తూ ఊరుకోడు. జగన్ 2.0లో జగన్ ఒక్కటైతే.. రెండోది కార్యకర్తే. మీరు తోడుగా నిలబడ్డారు కాబట్టే నేను సీఎం అయ్యాను. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ గెలుపు ఖాయమన్న ఆయన.. మన హక్కులు మనమే కాపాడుకోవాలి. తిరగబడండి.. మీ అన్న మీకు తోడుగా ఉంటాడు. మీ మీద పడ్డ దెబ్బను మీ అన్న చూస్తూ ఊరుకోడు. పులివెందులలో కొడితే చెంప గుయ్‌మనాలి. పులివెందులలో సౌండ్ రాష్ట్రంలో మోగాలి’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.
‘‘మీరు డ్యూటీ చేస్తున్నది చంద్రబాబు కోసం కాదు. మీ టోపీపై మూడు సింహాలను చూసి డ్యూటీ చేయండి. రక్షకులుగా ఉండాల్సినవారే దౌర్జన్యం చేస్తే కాపాడేదెవరు?. అరెస్టులు చేసినా, కేసులు పెట్టినా భయపడేది లేదు. మా వాళ్లపై చెయ్యి వేస్తే.. నాపై వేసినట్టే..!’’ అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: ఈ రెండేళ్లు ఓపిక పట్టండి.. వచ్చేది జగన్ 2.0


