స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అరాచకాలపై వైఎస్‌ అవినాశ్‌ ఆగ్రహం | MP YS Avinash Reddy Slams Ruling Alliance Over Atrocities in Local Body Elections | Sakshi
Sakshi News home page

స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అరాచకాలపై వైఎస్‌ అవినాశ్‌ ఆగ్రహం

Oct 27 2026 11:59 AM | Updated on Oct 27 2026 1:17 PM

MP YS Avinash Reddy Slams Ruling Alliance Over Atrocities in Local Body Elections

సాక్షి,పులివెందుల: స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో కూటమి ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతోందని ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పులివెందులలో వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్ ‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ ముఖ్యనేతలు, శ్రేణులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వైఎస్‌ అవినాశ్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో అధికార పార్టీ పెద్దఎత్తున అరాచకాలకు పాల్పడుతోందని, వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డు కుంటున్నారని ఆయన ఆరోపించారు.అధికార దుర్వినియోగంతో ఎన్నికలు నిర్వహిస్తున్నారని, నామినేషన్‌ వేయాలన్నా నేడు యుద్ధం చేయాల్సిన దుస్థితి నెలకొందని మండిపడ్డారు. పార్టీ కార్యకర్తలపై దాడులు చేసి, తిరిగి వారిపైనే అక్రమ కేసులు బనాయిస్తున్నారని విమర్శించారు. ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా, బెదిరింపులకు పాల్పడినా తాము భయపడేది లేదని స్పష్టం చేశారు.

మీ తప్పుడు కేసులకు భయపడేది లేదు..  కూటమికి అవినాష్ రెడ్డి వార్నింగ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement