ఈ రెండేళ్లు ఓపిక పట్టండి.. వచ్చేది జగన్‌ 2.0 | Pulivendula: YS Jagan comments on Chandrababu government | Sakshi
Sakshi News home page

ఈ రెండేళ్లు ఓపిక పట్టండి.. వచ్చేది జగన్‌ 2.0

Oct 27 2026 12:41 PM | Updated on Oct 27 2026 1:20 PM

Pulivendula: YS Jagan comments on Chandrababu government

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: పులివెందులలో సౌండ్‌ రాష్ట్రంలో మోగాలి.. కూటమి ప్రభుత్వం తుడిచిపెట్టుకుపోతుంది.. పులివెందులలో మా వాళ్లపై చేయ్యి వేస్తే నాపై వేసినట్టేనని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఇవాళ (మంగళవారం) ఆయన పులివెందులలో పార్టీ నేతలు, కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ రెండేళ్లు ఓపిక పట్టండి.. వచ్చేది జగన్‌ 2.0’’ అంటూ స్పష్టం చేశారు.

‘‘అన్యాయం చేసిన ఏ అధికారినీ వదిలిపెట్టం. మా టైం వచ్చినప్పుడు వడ్డీతో సహా చెల్లిస్తాం. రిటైర్‌ అయిన అధికారిని కూడా ఎక్కడున్నా తీసుకొస్తాం. మీరు డ్యూటీ చేస్తున్నది చంద్రబాబు కోసం కాదు. మీ టోపీపై మూడు సింహాలను చూసి డ్యూటీ చేయండి. రక్షకులుగా ఉండాల్సినవారే దౌర్జన్యం చేస్తే కాపాడేదెవరు?. అరెస్టులు చేసినా,  కేసులు పెట్టిన భయపడేది లేదు’’ అని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.
 

‘‘ఎన్నికల్లో 50 శాతం సీట్లలో పోటీ చేస్తున్నది అక్కచెల్లెమ్మలే. అక్కచెల్లెమ్మల నామినేషన్లను  నడిరోడ్డుపై అడ్డుకుంటున్నారు. నడ్డిరోడ్డుపై అక్కచెల్లెమ్మల చీరలు చించి దాడులు చేశారు.అక్కచెల్లెమ్మలపై దాడి చేయడానికి మీకు సిగ్గుందా?. వైఎస్సార్‌సీపీ హయాంలోనే అక్కచెల్లెమ్మలకు న్యాయం జరిగింది. చంద్రబాబు చేస్తున్న పనులకు తానే సిగ్గుతో తలదించుకోవాలి. 17 మున్సిపాలిటీలు ఏకగ్రీవమని వీళ్లే ప్రకటించుకున్నారు. పులివెందులలో  20 వార్డుల్లోనే నామినేషన్లు వేయగాలిగాం. 7  జడ్పీటీసీ స్థానాలకు కేవలం 4 స్థానాల్లో పోటీ జరుగుతుంది. స్క్రూటినీ పేరిట 2 మండలాల్లో నామినేషన్లు తిరస్కరించారు.

‘‘పోలీసులను ప్రశ్నిస్తే లాఠీఛార్జ్‌ చేశారు. నామినేషన్లు వేయడానికి వెళ్తుంటే కాల్పులు జరిపారు. వైఎస్సార్‌సీపీ  కార్యకర్తలపై 37 రౌండ్ల కాల్పులు జరిపారు. పోలీసులు బలప్రయోగం ఎందుకు చేశారు. నామినేషన్ల వేయడానికి రావడం తప్పా?. పోటీకి ఇంత భయముంటే ఎన్నికలు ఎందుకు పెట్టారు. సుప్రీం ఆదేశాలిచ్చినా ఎస్‌ఈసీ, అధికారుల్లో మార్పు రాలేదు. ఇది తొండా, దౌర్జన్యం, అన్యాయం కాదా?. కడపలో 17 జడ్పీటీసీ స్థానాల్లో పోటీ లేకుండా చేశారు. అధికారుల సమక్షంలోనే నామినేషన్లు చించివేశారు. అధికారుల సమక్షంలోనే మన హక్కులను లాగేసుకున్నారు.

..రేపు మన ఆస్తి పత్రాలను కూడా లాక్కుంటారు. తిరగబడండి.. మీ అన్న మీకు తోడుగా ఉంటాడు. పులివెందులలో కొడితే చెంప గుయ్‌మనాలి. పులివెందులలో సౌండ్‌ రాష్ట్రంలో మోగాలి. కూటమి ప్రభుత్వం తుడిచిపెట్టుకుపోతుంది. పులివెందులలో మా వాళ్లపై చేయ్యి వేస్తే నాపై వేసినట్టే. అన్యాయం చేసిన ఏ అధికారినీ వదిలిపెట్టం. మా టైం వచ్చినప్పుడు వడ్డీతో సహా చెల్లిస్తాం. రిటైర్‌ అయిన అధికారిని కూడా ఎక్కడున్నా తీసుకొస్తాం’’ అని వైఎస్‌ జగన్‌ తేల్చి చెప్పారు.

YS Jagan : మా వాళ్లపై చేయి వేస్తే.. నాపై వేసినట్టే..

‘‘మీ మీద పడ్డ దెబ్బను మీ అన్న  చూస్తూ ఊరుకోడు. జగన్‌ 2.0లో జగన్‌ ఒక్కటైతే.. రెండోది కార్యకర్తే. మున్సిపల్ ఎన్నికల ఓటింగ్‌ రోజు నేను పులివెందుల వస్తా. మీరు తోడుగా నిలబడ్డారు కాబట్టే నేను సీఎం అయ్యాను. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ గెలుపు ఖాయం. మన హక్కులు మనమే కాపాడుకోవాలి. తిరగబడండి.. మీ అన్న మీకు తోడుగా ఉంటాడు’’ అని వైఎస్‌ జగన్‌ పిలుపునిచ్చారు.
 

ఇదీ చదవండి: శకునిలా చంద్రబాబు మాయ పాచికలు: వైఎస్‌ జగన్‌

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement