ధనుష్‌ పార్టీ వైపు డాక్టర్‌ రామదాస్‌ కుమార్తె చూపు? | Actor Dhanush Political Entry Sparks Buzz In Tamil Nadu As Lotus Symbol On Diwali Gifts Triggers BJP Links Speculation | Sakshi
Sakshi News home page

ధనుష్‌ పార్టీ వైపు డాక్టర్‌ రామదాస్‌ కుమార్తె చూపు?

Oct 27 2026 9:14 AM | Updated on Oct 27 2026 10:44 AM

Dhanush Political Entry Buzz

సాక్షి, చెన్నై: తమిళ ప్రముఖ నటుడు ధనుష్‌ రాజకీయ అరంగేట్రంపై తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.ఓఎంఆర్‌ రోడ్డులోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో నిర్వహించిన ధనుష్‌ ఛారిటీ మూవ్‌మెంట్‌ మహిళా ప్రతినిధుల సమావేశంలో ఆయన పంపిణీ చేసిన బహుమతి పెద్ద వివాదానికి దారితీసింది. ఈ సమావేశానికి హాజరైన వెయ్యికి పైగా మహిళా ప్రతినిధులకు ధనుష్‌ దీపావళి కానుకగా రూ.1.3 కోట్ల విలువైన వెండి కామాక్షి దీపా లను బహుకరించారు. అయితే, ఆ దీపాల అడుగుభాగంలో కమలం (తామర) గుర్తు చెక్కి ఉండటం కలకలం రేపింది. ధనుష్‌ స్థాపిస్తున్న తమిళగ ఎళుచ్చి కళగం అనే కొత్త పారీ్టకి, బీజేపీకి సంబంధాలు ఉన్నాయని, బీజేపీనే ఆయనను వెనుక ఉండి నడిపిస్తోందని విమర్శలు బయలు దేరాయి. 

టీమ్‌ వివరణ 
ఈ ఆరోపణలను ధనుష్‌ ఛారిటీ మూవ్‌మెంట్‌ ప్రతినిధులు తీవ్రంగా ఖండించారు. తామర గుర్తు అనేది కేవలం ఆభరణ తయారీదారుడి ముద్ర  మాత్రమే తప్ప, ఏ పార్టీ ఎన్నికల గుర్తు కాదని స్పష్టం చేశారు. కాగా, : ఒకవైపు బీజేపీ, మరోవైపు ఏఐఏడీఎంకే అన్నాడీఎంకే ధనుష్‌ను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని, కాంగ్రెస్‌ నాయకులు మాత్రం ఢిల్లీ నాయకత్వం ప్లాన్‌ డీ పేరుతో సెలబ్రిటీలను వాడుకుంటోందని ఆరోపిస్తున్నారు. 

ధనుష్‌ పార్టీ వైపు డాక్టర్‌ రామదాస్‌ కుమార్తె చూపు? 
పీఎంకే  అధినేత డాక్టర్‌ రామదాస్‌, ఆయన కుమారుడు అన్బుమణి రామదాస్‌ మధ్య చెలరేగిన విభేదాల పర్యవసానాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇటీవల ఎన్నికల అనంతరం వీరిద్దరూ రాజీ పడినప్పటికీ, రాందాస్‌ కుమార్తె గాందీమతి మాత్రం ఈ పరిణామాలపై తీవ్ర అసంతృప్తి తో ఉన్నట్లు సమాచారం. తండ్రి నిర్ణయాల పై  కోపంతో ఉన్న గాందీమతి, నటుడు ధనుష్‌ స్థాపించబోయే నూతన పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది.ధనుష్‌ను కలిసి తన భవిష్యత్తు రాజకీయ అడుగులపై చర్చించేందుకు ఆమె సమయం కోరినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement