3500 మంది మహిళలతో ధనుష్ మీటింగ్.. ఏంటి విషయం? | Dhanush Expands Fan Club Activities Across Tamil Nadu, Fuels Speculation About His Political Entry | Sakshi
Sakshi News home page

Dhanush: అభిమాన సంఘాల నుంచి.. రాజకీయాల వైపు!

Oct 26 2026 9:06 AM | Updated on Oct 26 2026 9:36 AM

Dhanush Latest Meet With Women Over His Political Entry

తమిళ స్టార్ హీరో ధనుష్‌ తన అభిమాన సంఘాలని సామాజిక, రాజకీయ దిశగా నడిపించేందుకు వేగంగా అడుగులు వేస్తున్నాడు. ఇందులో భాగంగా చైన్నె షోలింగనల్లూర్‌లోని జెప్పియార్‌ కళాశాల ఆడిటోరియంలో 30 జిల్లాలకు చెందిన 3,500 మందికి పైగా మహిళా విభాగ నిర్వాహకులతో ఆదివారం భారీ మీటింగ్ నిర్వహించారు. ఇటీవల నిర్వహించిన కీలక సమావేశంలో ‘ఆల్‌ ఇండియా ధనుష్‌ ఫ్యాన్‌ క్లబ్‌’ పేరుని అధికారికంగా ధనుష్‌ ఛారిటబుల్‌ ఆర్గనైజేషన్‌గా మార్చారు. కొత్త జెండా లోగోను సంస్థ సామాజిక లక్ష్యాలను ప్రతిబింబించేలా ఎరుపు, తెలుపు రంగుల్లో నాట్యం చేస్తున్న నక్షత్రం, మధ్యలో ధనుష్‌ చిత్రమున్న దానిని ఆవిష్కరించారు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి విజయ్ సేతుపతి 'బత్తా' సినిమా.. అసలు మిస్ అవ్వొద్దు)

ధనుష్‌.. ఏలుచ్చి కలగం అనే పేరుతో రాజకీయ పార్టీని నమోదు చేయడానికి ఢిల్లీ వెళ్లారని ప్రచారం జరిగినప్పటికీ, అది ఆయన సొంత పని అని టీమ్ స్పష్టం చేసింది. అయితే, క్షేత్రస్థాయిలో సభ్యత్వ నమోదు, రాజకీయ సంప్రదింపులు ముమ్మరంగా సాగుతున్నాయి. జిల్లాల వారీగా పర్యటిస్తూ నిర్వాహకులకు ఉత్సాహాన్ని నింపుతున్న ధనుష్‌.. తన కుమారుడు లింగా నుంచి నేర్చుకున్న పలు విషయాలను పంచుకున్నారు. నేను నా కుమారుడితో వీడియో గేమ్స్‌ ఆడేటప్పుడు వరుసగా గెలిచినా, ఓడిపోతున్న తన కొడుకు మాత్రం వదలకుండా కనీసం ఒక్కసారైనా గెలిచే వరకు ప్రయత్నిస్తూనే ఉండేవాడు. చివరికి విజయం సాధించేవాడు. మనం కూడా గెలిచేంత వరకు విశ్రమించకుండా పోరాడాలనే పట్టుదల అనే విషయాన్ని కుమారుడి నుంచే నేర్చుకున్నానని చెప్పాడు.

ఆదివారం సమావేశం జరిగిన కాలేజీ ప్రాంగణమంతా భారీ బ్యానర్లు, ధనుష్‌ కటౌట్లతో నిండిపోయింది. ‘ధనుష్‌.. రేపటి తమిళనాడు హీరో, మహిళల ప్రేమకు రక్షకుడైన సోదరుడు అనే నినాదాలతో హోరెత్తింది. ఉదయం నుంచి వర్షం పడుతున్నప్పటికీ మహిళలు తమ పిల్లలతో సహా తరలివచ్చారు. ఈ సమావేశంలో మహిళా విభాగం నమోదు, కోయంబత్తూరులోని ప్రధాన అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొత్త నిర్వాహకుల నియామకం, సంక్షేమ కార్యక్రమాల విస్తరణపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

సమావేశానికి హాజరైన మహిళా ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ తమ సంతోషాన్ని, మద్దతు వ్యక్తం చేశారు. ధనుష్‌ కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్నారనే వార్త మాకు ఎంతో సంతోషాన్ని ఇస్తోంది. ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో ఒక రకమైన లోటు ఉంది. ధనుష్‌ సొంత కష్టంతో అగ్రస్థానానికి వచ్చి ఎన్నో జాతీయ అవార్డులు సాధించారు. ఆయన కష్టపడే తత్వాన్ని నమ్మి ఓటు వేయవచ్చు అని వ్యాఖ్యానించడం గమనార్హం.

(ఇదీ చదవండి: రాజకీయ ఎంట్రీపై ప్రశ్న.. త్రిష ఏం చెప్పిందంటే?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement