త్రిష.. ఆ నవ్వుకి అర్థమేంటో? | Trisha Krishnan Draws Huge Crowds In Coimbatore, Sparks Political Entry Speculation With Her Mysterious Smile | Sakshi
Sakshi News home page

Trisha: రాజకీయ ఎంట్రీపై ప్రశ్న.. త్రిష ఏమందంటే?

Oct 26 2026 8:50 AM | Updated on Oct 26 2026 9:47 AM

Trisha Reacts Her Political Entry Latest

దక్షిణాదిలోని ప్రస్తుతం స్టార్ హీరోయిన్లలో త్రిష ఒకరు.  రెండు దశాబ్దాలుగా సినిమాలు చేస్తూనే ఉంది. ఈ ఏడాది కరుప్పు మూవీతో వచ్చింది. చిరంజీవితో చేసిన విశ్వంభర, మోహన్‌లాల్‌కు జంటగా నటించిన రామ్‌ రిలీజ్ కావాల్సి ఉన్నాయి. ఈమె కొత్తగా మూవీస్ ఏం అంగీకరించకపోవడంతో పలు రూమర్స్ వస్తన్నాయి. ముఖ్యమంత్రి విజయ్‌కు స్నేహితురాలు అనే పేరు ఉన్న త్రిష.. రాజకీయ రంగప్రవేశం తథ్యమనీ, ఉపముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందనే ప్రచారం చాలా కాలంగా జరుగుతోంది. కాగా ఈ భామకు ప్రజల్లో ఎంత క్రేజ్‌ ఉందన్నది మరోసారి రుజువైంది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి విజయ్ సేతుపతి 'బత్తా' సినిమా.. అసలు మిస్ అవ్వొద్దు)

త్రిష.. కోయంబత్తూర్‌లోని ఓ మొబైల్‌ షాప్‌ ప్రారంభోత్సవానికి ఆదివారం వెళ్లింది. దీంతో ప్రజలు, అభిమానులు త్రిషని చూడటానికి ఏకంగా విమానాశ్రయానికే పరుగులు తీశారు. అక్కడి నుంచి కారులో బయలుదేరిన ఈమెకు రోడ్డు పొడుగునా అభిమానులు స్వాగతం పలికారు. దీంతో ఆమె రెట్టించిన ఉత్సాహంతో ఓపెన్‌ కారులో చిరునవ్వులు చిందిస్తూ అందరికీ అభివాదం చేస్తూ వెళ్లింది. త్రిష ఇలా ప్రయాణించడం వల్ల ప్రజాజీవనానికి అంతరాయం కలిగిందనేది పక్కన పెడితే ఆమెకు ప్రజల్లో ఉన్న క్రేజ్‌ ఇక్కడ చర్చగా మారింది. ఇదిలా ఉంటే కోయంబత్తూర్‌ విమానాశ్రయంలో మీరు రాజకీయాల్లోకి వస్తున్నారా? అని మీడియా ప్రతినిథులు ప్రశ్నించగా నవ్వి అక్కడి నుంచి వెళ్లిపోయింది. మరి ఈ నవ్వుకు అర్థమేంటి? అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.

(ఇదీ చదవండి: బన్నీ సినిమా దెబ్బకు ఎన్టీఆర్‌కి జెలసీ!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement