ఓటీటీలోకి అద్భుతమైన సినిమా.. అసలు మిస్ అవ్వొద్దు | Baththa Movie OTT Release Date | Sakshi
Sakshi News home page

Baththa OTT Release Date: బెస్ట్ మూవీ ఆఫ్ ద ఇయర్.. ఓటీటీ ప్రకటన

Oct 25 2026 11:07 AM | Updated on Oct 25 2026 11:38 AM

Baththa Movie OTT Release Date

రీసెంట్ టైంలో చాలామంది మాట్లాడుకునేలా చేసిన సినిమా ఒకటి.. ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. సాధారణ ప్రేక్షకుల నుంచి రివ్యూయర్ల వరకు ప్రతిఒక్కరికి ఇది నచ్చేసింది. చెప్పాలంటే చాలామంది దీనిని బెస్ట్ మూవీ ఆఫ్ ద ఇయర్ అని కూడా అన్నారు. ఇంతకీ ఈ చిత్రం సంగతేంటి? ఎందులోకి ఎప్పుడు రానుంది?

(ఇదీ చదవండి: శోభనం జరగనివ్వని 'తోకచుక్క'.. ఓటీటీలో మలయాళ థ్రిల్లర్ 'ధూమకేతు' రివ్యూ)

విజయ్ సేతుపతి అద్భుతమైన నటుడు. అందుకు తగ్గట్లే మంచి మంచి సినిమాలు కూడా చేశారు. ఇతడి నుంచి వచ్చిన లేటెస్ట్ తమిళ మూవీ 'బత్తా'. అట్లీ నిర్మించిన ఈ చిత్రానికి బాలాజీ ధరణిధరన్ దర్శకుడు. ఓ ఎమోషనల్ డ్రామా కథతో దీన్ని తెరకెక్కించారు. ఈ నెల 01వ తేదీన థియేటర్లలో రిలీజైంది. అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది. ఇప్పుడిది 29వ తేదీ(ఈ గురువారం) నుంచి నెట్‌ఫ్లిక్స్‌లోకి రానుందని ప్రకటించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది.

'బత్తా' విషయానికొస్తే.. బత్తా అనే గ్యాంగ్‌స్టర్‌ని ఓ పిల్లాడు, స్కూల్‌లోని ఓ బాత్రూంలో పెట్టి బంధిస్తాడు. తర్వాత ఏమైంది? బత్తాలో ఎలాంటి మార్పొచ్చింది? అనేది మిగతా స్టోరీ. విజయ్ సేతుపతి ఇప్పటికే పలు సినిమాల్లో అద్భుతమైన ఫెర్ఫార్మెన్స్‌లు ఇచ్చాడు కానీ ఇందులో ఎప్పటికీ గుర్తుండిపోయే యాక్టింగ్‌తో అదరగొట్టేశాడు. సేతుపతే అనుకుంటే శబరి పాత్ర చేసిన పిల్లాడైతే ఆశ్చర్యపోయేంత షాకింగ్‌గా నటించాడు. వీళ్లిద్దరే కాదు సేతుపతి భార్యగా చేసిన లిజోమోల్, కూతురిగా చేసిన పాప కూడా అదరగొట్టేశారు. ఓటీటీలోకి వచ్చిన తర్వాత దీన్ని మిస్ కావొద్దు.

(ఇదీ చదవండి: పరువు విలువ ఎంత? ఓటీటీ సినిమా రివ్యూ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement