breaking news
Baththa Movie
-
'టాలీవుడ్'కి క్లాస్ పీకుతున్న ప్రేక్షకులు
'అసలు టాలీవుడ్ ఎటు వెళ్తోంది? ఒకప్పుడు కథ, కథనం, బలమైన భావోద్వేగాలు, కొత్తదనం ఉన్న సినిమాలు వచ్చేవి. ప్రేక్షకులు కూడా మరో ఆలోచన లేకుండా థియేటర్లకు వచ్చి వాటిని చూసేవాళ్లు. నచ్చితే సెలబ్రేట్ చేసుకునేవాళ్లు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. చాలా మూవీస్‌లో సరైన కథ ఉండదు. కథనం ఆసక్తికరంగా సాగదు. పాత్రల్లో బలం కనిపించదు. కామెడీ పేరుతో ఏదో హడావిడి చేయడం. కమర్షియల్ ఫార్ములాని నమ్ముకోవడం తప్ప కొత్తగా ప్రయత్నించే చిత్రాలు చాలా అంటే చాలా తక్కువగా కనిపిస్తున్నాయి''ప్రేక్షకులు మారుతున్నారు. వారి అభిరుచులు మారుతున్నాయి, ప్రపంచ సినిమా స్థాయి పెరుగుతోంది. కానీ మన టాలీవుడ్లో మాత్రం ఇంకా పాత ఫార్ములాలని పట్టుకుని దర్శకనిర్మాతలు సినిమాలు తీస్తున్నారు. కేవలం హిట్, కలెక్షన్లు మాత్రమే కాదు.. మంచి కథలు, గుర్తుండిపోయే పాత్రలు, అద్భుతమైన స్క్రీన్‌ప్లే ఉన్న సినిమాలు రావాలి. నిజంగా తెలుగు సినిమా ఎటు వెళ్తోంది? మన దర్శకులు కొత్తగా ఆలోచించే సమయం రాలేదా?'.. ఇలా సగటు ప్రేక్షకుడు తమ బాధన్ని, ఆవేశాన్ని వెళ్లగక్కుతున్నారు. హీరోలు, దర్శకనిర్మాతలని గట్టిగా క్లాస్ పీకుతున్నారు. మరి మిగతా ఇండస్ట్రీలతో పోలిస్తే నిజంగా తెలుగు సినిమా వెనకబడిపోయిందా?(ఇదీ చదవండి: సూర్య సూపర్ 'సీన్'.. తొలిరోజు వసూళ్లు ఎన్ని కోట్లు?)ప్రస్తుతం సినిమా అనేది చాలారకాలుగా అందుబాటులో ఉంది. తెలుగులో స్టార్ హీరోల సినిమాలని థియేటర్లలో చూసేందుకు ప్రేక్షకుడు ఇష్టపడుతున్నారు. మిడ్ రేంజ్ హీరోల మూవీస్ అయితే చాలా బాగుంటేనే బిగ్ స్క్రీన్లపై చూస్తున్నారు. లేదంటే ఓటీటీకి వచ్చాక చూసుకుందాంలే అని అనుకుంటున్నారు. లేదంటే పూర్తిగా చూడటమే మానేస్తున్నాడు. దానికి తోడు ఈ ఏడాది తమిళంలో వచ్చిన డీసీ, జైలర్ 2, బత్తా, బ్లాస్ట్, వీరభద్రుడు, డోరతి, మొదరాత్రి లాంటి మూవీస్ చూసిన తెలుగు ప్రేక్షకులు.. ఇలాంటివి మన దగ్గర ఎందుకు రావట్లేదు అని అనుకుంటున్నారు. కానీ ఇక్కడే చాలా లెక్కలు ఆధారపడి ఉంటాయి.సినిమా అనేది పక్కా వ్యాపారం. ప్రేక్షకులే దేవుళ్లు, వాళ్లు లేకపోతే మేం లేం అని హీరోలు, దర్శకనిర్మాతలు ఊరికే చెప్పరు. ఎందుకంటే తమ పెట్టుబడి తిరిగి రాబట్టాలంటే ఆడియెన్స్‌ని కాకా పట్టాలి. టాలీవుడ్లో చాలామంది నిర్మాతలు చేస్తున్నది అదే. ఉదాహరణకు రీసెంట్ టైంలో తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చిన డోరతి, బత్తా సినిమాలనే తీసుకుందాం. థియేటర్లలో రిలీజైనప్పుడు వీటికి పెద్దగా కలెక్షన్స్ రాలేదు. డబ్బులు రాని చిత్రాల్ని మన నిర్మాతలు ఎందుకు తీస్తారు? వాళ్లకేం అవసరం? సరిగ్గా ఇక్కడే తెలుగు సినిమా మార్కెట్ స్వరూపం, కమర్షియల్ లెక్కలు బయటపడతాయి.ఎక్కువ మంది ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకుని భారీ స్థాయిలో సినిమాలు రూపొందించేటప్పుడు కొన్ని కమర్షియల్ అంశాలని తప్పనిసరిగా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం నిర్మాతలకు ఉంటుంది. ప్రేక్షకుల అభిరుచులు, హీరోల ఇమేజ్, సినిమా మార్కెట్, పెట్టుబడులు, బాక్సాఫీస్ అంచనాలు వంటి అంశాలన్నీ సినిమాకు వచ్చే ఆదాయంపై ప్రభావం చూపిస్తాయి. అందుకే ప్రతి దర్శకుడికి తనదైన శైలిలో సినిమా తెరకెక్కించే స్వేచ్ఛ ఉన్నప్పటికీ, భారీ బడ్జెట్‌తో, భారీ అంచనాల మధ్య రూపొందే సినిమాల్లో కొన్ని కమర్షియల్ అంశాలను పక్కన పెట్టడం సాధ్యం కాదు. అందుకే హీరోల దగ్గర నుంచి దర్శకనిర్మాతల వరకు ఎవరూ సాహసం చేయలేకపోతున్నారు.(ఇదీ చదవండి: సమస్య ప్రేక్షకుల దగ్గరే ఉంది.. టాలీవుడ్ నిర్మాత)తెలుగు సినిమాకు వైవిధ్యం అవసరమే. కొత్త కథలు, కొత్త కథనాలు, హీరోలను భిన్నంగా చూపించే ప్రయత్నాలు జరగాలి. అయితే పొరుగు భాషల్లో వచ్చిన ప్రతి హిట్ సినిమాని తీసుకుని టాలీవుడ్‌ని టార్గెట్ చేయడం కంటే టాలీవుడ్ మార్కెట్, ఇక్కడి ప్రేక్షకుల అంచనాలు, నిర్మాతలు పెట్టే పెట్టుబడులు లాంటి అంశాలను కూడా ప్రేక్షకులు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.అయితే పాన్ ఇండియా మోజులో పడిపోయి మన హీరోలు.. మంచి సినిమాలు తీయడం మానేశారు. మాస్ సినిమాలు సూట్ అవ్వకపోయినా, రికార్డులు కోసం కృత్రిమంగా కమర్షియల్ అంశాల్ని ఇరికించి తీసేస్తున్నారు. అవి ఏమో సరిగ్గా వర్కౌట్ అవట్లేదు. ఈ ఏడాది అలా చాలా చిత్రాలు.. ప్రేక్షకులకు చిరాకు తెప్పించాయి. భారీతనం కంటే మనసుకు హత్తుకునే సినిమాలు తీస్తే అవే గొప్పవి అవుతాయి. దర్శకనిర్మాతలు-హీరోలు ఈ విషయం ఎప్పుడు అర్థమవుతుందో ఏంటో?(ఇదీ చదవండి: హీరో నిఖిల్ ఏమయ్యాడు? 'స్వయంభు' రిలీజ్ ఎప్పుడు?) -
జైభీమ్‌లోని సింగేని.. ‘బత్తా’లోనూ సత్తా చూపించి..!
ఓటీటీలో ఎన్నో సినిమాలు వస్తుంటాయి.. వెళ్తుంటాయి. కానీ కొన్ని చిత్రాలు మాత్రం ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేస్తాయి. అందులోని పాత్రలు కూడా చాలాకాలం గుర్తుండిపోతాయి. ముఖ్యంగా కొన్ని పాత్రలు ప్రేక్షకులను నవ్విస్తే.. మరికొన్ని కంటతడి పెట్టిస్తాయి. అలా తన నటనతో ప్రేక్షకుల హృదయాలను కదిలించే నటీమణుల్లో లిజి మోల్ జోస్ ఒకరు. పెద్దగా పరిచయం లేని పాత్రల్లో కనిపించినా.. తన సహజమైన నటనతో ప్రేక్షకులను కథలోకి తీసుకెళ్లడం ఆమె ప్రత్యేకత. అందుకే జై భీమ్ నుంచి బత్తా వరకు ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.ప్రతి భావాన్ని ఎంతో సహజంగాసూర్య ప్రధాన పాత్రలో నటించిన ‘జై భీమ్’ సినిమా ప్రేక్షకులకు గుర్తుండిపోయే చిత్రాల్లో ఒకటి. ఈ సినిమాలో లిజి మోల్ జోస్ సెంగేని రాజకన్నుగా కనిపించారు. తన భర్త కోసం న్యాయపోరాటం చేసే ఓ మహిళగా ఆమె నటన ప్రేక్షకులను కదిలించింది. ముఖ్యంగా భర్తను కోల్పోయిన బాధ, తన కుటుంబానికి జరిగిన అన్యాయం, న్యాయం కోసం ఆమె పడే తపన.. ఇలా ప్రతి భావాన్ని ఎంతో సహజంగా పలికించారు.ఇటీవల ఓటీటీలో విడుదలైన ‘బత్తా’ సినిమాలోనూ కన్నిమాగా కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రంలోనూ తన సహజమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కథకు అవసరమైన భావోద్వేగాలను తన నటనతో అందిస్తూ.. సినిమాలో తన పాత్రకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. జై భీమ్‌లో సెంగేని పాత్రను చూసిన ప్రేక్షకులు.. బత్తాలో ఆమెను మరో కోణంలో చూసి ఆశ్చర్యపోతున్నారనడంలో సందేహం లేదు. లిజోమోల్ జోస్ విషయానికి వస్తే..లిజోమోల్ జోస్ విషయానికి వస్తే.. ప్రధానంగా మలయాళం, తమిళ సినిమాల్లో నటిస్తున్నారు. 2016లో ‘మహేశింటే ప్రతీకారం’ సినిమాతో నటిగా పరిచయమయ్యారు. 2021లో విడుదలైన తమిళ చిత్రం ‘జై భీమ్’లో సెంగేని పాత్రతో విశేష గుర్తింపు పొందారు. ఈ సినిమాలో ఆమె నటనకు ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన బత్తా సినిమాతో మరోసారి గుర్తింపు తెచ్చుకున్నారు. (ఇదీ చదవండి: ఓటీటీకి వచ్చిన లేటెస్ట్ సెన్సేషన్ 'బత్తా'.. ఎలా ఉందంటే?) View this post on Instagram A post shared by Lijomol Jose (@lijomol) -
'బత్తా' మూవీ రివ్యూ.. ఓటీటీలో బ్యూటీఫుల్ సినిమా..
-
వీడు అలరిస్తాడు... అదే వీడి సత్తా
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో తమిళ చిత్రం ‘బత్తా’ ఒకటి. నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.ఏదైనా సున్నితమైన అంశాన్ని సూటిగా చెప్పకుండా సుతిమెత్తగా, సుతారంగా... ముఖ్యంగా సినిమాటిక్‌గా చెబితే ఇక ఆ సినిమా సూపర్ హిట్టే. ఆ కోవలో తీసిన సినిమానే ‘బత్తా’. ప్రముఖ దర్శకుడు అట్లీ సమర్పణలో విజయ్ సేతుపతి హీరోగా నటించిన ఈ సినిమా ఓ అద్భుతమనే చెప్పాలి. కథాంశం పక్కన పెడితే... విజయ్ సేతుపతి ఇమేజ్‌కి ఈ సినిమా చేయడమంటే చాలా సాహసమనే చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమా కథ అంత చిన్నది కాబట్టి. కానీ విజయ్ సేతుపతి చేయడం వల్ల ఈ సినిమా కథాంశం ప్రేక్షకాదరణకు నోచుకుంది. దర్శకుడు బాలాజీ తరణీతరన్ ఈ కథ రాసి, తెరకెక్కించిన విధానం న భూతో న భవిష్యతి అని చెప్పవచ్చు. అంతేకాకుండా విజయ్ సేతుపతితో పాటు ఈ సినిమాలో నటించిన ఓ బాల నటుడి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సినిమా మొత్తంలో తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన ఈ బుడతడి పేరు సాయి పృథ్వీరాజ్. తను ఈ సినిమాలో నటించలేదు... జీవించాడు. ‘బత్తా’ సినిమా మొత్తం కేవలం రెండు పాత్రల చుట్టూనే కథ తిరుగుతుంది. ఒకటి విజయ్ సేతుపతి పాత్ర అయితే మరోటి ఈ సాయి పృథ్వీరాజ్‌ది. సినిమా అయిపోయాక ఇదా కథ అని అనుకోకుండా ఉండలేరు. అంతలా మెప్పించిన ఆ కథేంటో ఓసారి చూద్దాం. 1986 కాలం ఇతివృత్తంగా రాసుకున్న కథ ఇది. అప్పట్లో మద్రాసు నగరానికి దగ్గరలో ఉండే ఓ పల్లెటూరిలో కరడుగట్టిన ఓ కసాయి రౌడీ భక్తవత్సలం బత్తా (విజయ్ సేతుపతి) పేరుతో చలామణీ అవుతుంటాడు. ఊర్లో ఉన్న చిన్నా పెద్దా అందరికీ బత్తా అంటే వణుకే. మరీ ముఖ్యంగా ఆ ఊరి ప్రైమరీ స్కూల్లో చదివే శబరి అనే చిన్నోడికి మాత్రం బత్తా పేరు వింటేనే చెమటలు పడుతుంటాయి. అలాంటి రౌడీని ఈ పిల్లాడు అనుకోకుండా కిడ్నాప్ చేస్తాడు. అదే సినిమాలోని అసలైన పాయింట్. మరి... పిల్లాడి చేతిలో కిడ్నాప్ అయిన ఈ రౌడీ బత్తా బయటపడ తాడా? లేదా? అసలు అంత పెద్ద రౌడీ చిన్నపిల్లాడి చేతికి ఎలా చిక్కాడు? ఇటువంటి వాటన్నిటికీ సమాధానమే ‘బత్తా’. సినిమా మొత్తం ఎగ్జైటింగ్‌గా ఉంటుంది. క్లైమాక్స్‌లో వచ్చే అనూహ్యమైన మలుపు ప్రేక్షకులను గిలిగింతలు పెట్టిస్తుంది. విజయ్ సేతుపతి సహజ నటన, సాయి పృథ్వీరాజ్ అసమాన ప్రతిభ ఈ సినిమాకి మణి మాణిక్యాలు. ఈ ‘బత్తా’ సినిమా మాతృక తమిళం అయినా నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులోనూ లభ్యమవుతోంది. మస్ట్ వాచ్ విత్ ఫ్యామిలీ ఫర్ ది వీకెండ్. – హరికృష్ణ ఇంటూరు -
ఓటీటీలో బ్యూటీఫుల్ సినిమా.. 'బత్తా' తెలుగు రివ్యూ
కొన్ని సినిమాలు పెద్దగా అంచనాల్లేకుండానే వచ్చి సంచలనం సృష్టిస్తుంటాయి. అలాంటి ఓ చిత్రమే 'బత్తా'. విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో బాలాజీ ధరణిధరన్ దర్శకత్వం వహించిన తమిళ మూవీ ఇది. ఈనెల 01వ తేదీన థియేటర్లలో రిలీజై టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయిపోయింది. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులోనూ స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ఇంతకీ ఇదెలా ఉంది? చూడొచ్చా లేదా?(ఇదీ చదవండి: 'రామాయణ' సినిమా ఫస్ట్ రివ్యూ)కథేంటి?అది 1970ల కాలం. బత్తా(విజయ్ సేతుపతి) అనే రౌడీ తన ప్రత్యర్థులని చావగొడుతూ ఊరిలో డామినేషన్ చూపిస్తుంటాడు. భార్య కన్నిమా(లిజి మోల్), కూతురికి కూడా టైమ్ ఇవ్వనంత బిజీగా ఊరిమీద పడి తిరుగుతుంటాడు. అలాంటి ఇతడు అనుకోకుండా ఓ రోజు అదే ఊరిలోని స్కూల్ బాత్రూంలో లాక్ అయిపోతాడు. ఇతడు లోపల ఉండగా బయట నుంచి ఎవరో గడియ పెట్టేస్తారు. తర్వాత ఏమైంది? బత్తా బయటకు రాగలిగాడా లేదా? శబరి (సాయి పృథ్వీరాజ్) అనే పిల్లాడికి బత్తాతో సంబంధమేంటి? చివరకు ఎవరెవరు ఏమేం తెలుసుకున్నారు అనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?కొన్ని సినిమాలు కంటికి నచ్చుతాయి. కొన్ని మనసుకు నచ్చుతాయి. 'బత్తా' రెండో కేటగిరీలోకి వస్తుంది. చూస్తున్నంతసేపు ఎంతో సరదాగా అనిపించే ఈ మూవీ.. పూర్తయిన తర్వాత మనసుకు హాయినిస్తుంది. చెప్పాలంటే చిత్రం, అందులోని పాత్రలు మనతో పాటు ఇంటికి వచ్చేస్తాయి. చాలాసేపు ఆలోచించేలా చేస్తాయి. అసలు మనలో చాలామంది ఏమేం మిస్ అవుతున్నాం అనే విషయాలు గుర్తుచేస్తాయి.'బత్తా' గురించి చెప్పాలంటే స్టోరీ చాలా సింపుల్. ఓ బాత్రూంలో ఓ పేరు మోసిన రౌడీ ఇరుక్కుపోతాడు. దాదాపు 8 రోజుల పాటు అందులోనే ఉండిపోతాడు. మరి బయటకొచ్చాడా లేదా? ఒకవేళ వస్తే ఏం చేశాడు? ఇతడిలో ఏం మార్పొచ్చింది? అనేది కథ. ఏంటి ఇదేనా కథ. ఇందులో అంత స్పెషల్ ఏముంది అని మీరనుకోవచ్చు. కానీ చూస్తే మాత్రం ఆ మాట అనరు. ఇంత మంచి సినిమా థియేటర్లలో ఎందుకు మిస్ అయ్యామా అనుకుంటారు.ఇప్పుడంటే పిల్లలు ఫోన్లు చూసి చెడిపోయారు గానీ గతంలో ఎంతో ఆనందంగా ఉండేవాళ్లు. అమాయకంగా, పక్కనోళ్లకు సాయం చేయాలనే మంచితనంతో, వాళ్లు వీళ్లు చెప్పినవి విని కొందరిని చూసి తెగ భయపడిపోవడం, నిజం చెప్పడానికి తర్జనభర్జన పడటం లాంటివి అప్పటి పిల్లల్లో కనిపించేవి. ఇందులో శబరి పాత్రకు ఇలాంటి లక్షణాలే ఉంటాయి. అవే ఈ కథకి టర్నింగ్ పాయింట్స్.ఓ ఎనిమిదేళ్ల పిల్లాడు.. ఓ పెద్ద రౌడీ జీవితాన్ని ఎలా మార్చేశాడు? సదరు పిల్లాడు చెప్పిన మాటలు.. ఆ రౌడీని ఎలాంటి ఆలోచనల్లో పడేశాయి? లాంటివి వినడానికి చాలా సాధారణంగా ఉంటాయి. కానీ వాటిని స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు ఇంత బాగున్నాయేంటి అనిపించకమానదు. చిన్నతనంలో చాలామంది పిల్లలకు ఏదేదో చేసేయాలి, ఏదో అయిపోవాలని ఉంటుంది. కానీ చుట్టూ ఉండేవాళ్ల ప్రవర్తన.. సదరు పిల్లల్ని ఎలా మార్చేస్తుంది అనే విషయాల్ని ఇందులో చూపించిన విధానం మన చిన్ననాటిని గుర్తుచేస్తుంది.ఈ సినిమా కథ గురించి ఏం చెప్పినా స్పాయిలర్ అవుతుంది. కాబట్టి ఈ రివ్యూలో డీటైల్డ్‌గా చెప్పాలనుకోలేదు. ఓ మంచి ఫీల్ గుడ్ మూవీ చూడాలనుకుంటే 'బత్తా'ని మాత్రం అస్సలు మిస్ అవ్వొద్దు. ఎందుకంటే యాక్షన్, థ్రిల్లర్సే కాదు అప్పుడప్పుడు ఈ తరహా సినిమాలు చూస్తేనే జీవితం అంటే ఏంటి? రోజువారీ బిజీలో పడి మనం ఏమేం కోల్పోతున్నాం? అనే విషయాలు తెలుస్తాయి.బత్తా, శబరి పాత్రలు కథకు కీలకం కావొచ్చు. కానీ బాత్రూం తలుపు తయారు చేసిన ఓ వడ్రంగి(కార్పెంటర్), ఓ రస్క్, శబరి ఆడుకునే ఓ బొమ్మ, ఓ పాము.. ఇలా సినిమాలో పెద్దగా గమనించని చాలా వస్తువులు, మనుషులు కథనే కాదు బత్తా జీవితాన్ని మలుపు తిప్పుతారు. సినిమా అంతా ఒకెత్తు క్లైమాక్స్ మరో ఎత్తు. బత్తాకి నిజం తెలిసే సన్నివేశం, చివరలో వచ్చే 'చెల్లమే మగళే' పాట, నా దగ్గర రస్క్ కొనడానికే డబ్బులున్నాయి లాంటి సీన్స్ వస్తున్నప్పుడు మన గుండె బరువెక్కిన ఫీలింగ్ కలుగుతుంది.నటీనటుల విషయానికొస్తే బత్తా పాత్రలో విజయ్ సేతుపతి జీవించాడు. చెప్పాలంటే పరకాయ ప్రవేశం చేశాడు. సేతుపతి ఇప్పటికే ప్రూవ్ చేసుకున్న నటుడు కాబట్టి ఇతడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ ఇందులో శబరి అనే ఏడేళ్ల పిల్లాడిగా చేసిన సాయి పృథ్వీరాజ్ నటన గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువే. ఇంత చిన్న పిల్లాడు అసలు అంత బాగా యాక్టింగ్ ఎలా చేశాడా? అనిపించకమానదు. బత్తా భార్య కన్నిమాగా చేసిన లిజి మోల్, కూతురిగా చేసిన పాప కూడా అద్భుతంగా నటించారు.టెక్నికల్ విషయాలకొస్తే దర్శకుడు బాలాజీ ధరణిధరణ్కి ఇంతమంచి సినిమా తీసినందుకు మొదటగా క్రెడిట్స్ ఇచ్చేయాలి. తర్వాత సంగీతమందించిన సాయి అభ్యంకర్‌ని మెచ్చుకోవాలి. అవకాశమొచ్చింది కదా దబదబా బాదేయాలి. అవసరం లేకపోయినా పాటలు ఇచ్చేయాలి కాకుండా ఆ సీన్‌కి ఎంత అవసరమో అంతే మ్యూజిక్ ఇచ్చాడు. 'చెల్లమే మగళే' పాట అర్థం తెలియకపోయినా గానీ తెగ నచ్చేస్తుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. సెట్ వర్క్ అయితే నిజంగా మనం కూడా 1970-80ల్లో ఉన్నామా అనే ఫీలింగ్ కలుగుతుంది. పాత్రలు వేసుకున్న డ్రస్సుల దగ్గర నుంచి ప్రతిదీ ఫెర్ఫెక్ట్గా సరిపోయింది. అసభ్యకర సీన్స్ ఏం లేవు. కుటుంబంతోనూ కలిసి చూడొచ్చు.-చందు డొంకాన, సాక్షి వెబ్‌డెస్క్(ఇదీ చదవండి: శోభనం జరగనివ్వని 'తోకచుక్క'.. మలయాళ థ్రిల్లర్ 'ధూమకేతు' ఓటీటీ రివ్యూ) -
ఈ వారం ఓటీటీల్లోకి 25 సినిమాలు.. ఆ ఐదు అస్సలు మిస్ కావొద్దు
దసరా హడావుడి అంతా అయిపోయింది. మళ్లీ ఎవరిపనుల్లో వాళ్లు పడిపోయారు. మరోవారం కూడా వచ్చేసింది. ఈ వీకెండ్ థియేటర్లలోకి వెంకటేశ్-త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన 'ఆదర్శ కుటుంబం' రానుంది. దీంతో పాటే సీరియల్ బ్యూటీ జ్యోతి పూర్వాజ్ హీరోయిన్గా చేసిన కిల్లర్, చంద్రయాన్ అనే చిన్న చిత్రాలు రిలీజ్ కాబోతున్నాయి.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 22 సినిమాలు)మరోవైపు ఓటీటీల్లో 25కి పైగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో విజయ్ సేతుపతి 'బత్తా' అస్సలు మిస్ అవ్వొద్దు. తెలుగులోనూ ఇది అందుబాటులోకి రానుంది. దీనితో పాటు అవరచన్ & బాయ్స్, ఇమ్మోర్టల్ లాంటి డబ్బింగ్ మూవీస్‌తో పాటు కీర్తి సురేశ్ 'అక్క', రుద్రవనం పీఎస్ అనే తెలుగు సిరీస్‌లు చూడాలనే ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ మూవీ రానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (అక్టోబర్ 26 నుంచి నవంబర్ 01 వరకు)సోనీ లివ్ఇమ్మోర్టల్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - అక్టోబర్ 30హాట్స్టార్లవ్ ఆల్వేస్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - అక్టోబర్ 30అబ్సెసన్: ద ఒరిజినల్ అన్ కట్ వెర్షన్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబర్ 30నెట్ఫ్లిక్స్మినిమమ్ వేజ్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 26ద వన్ అబౌట్ మాథ్యూ పెర్రీ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - అక్టోబర్ 27దిండోరా సీజన్ 1 (హిందీ సిరీస్) - అక్టోబర్ 28బత్తా (తెలుగు డబ్బింగ్ మూవీ) - అక్టోబర్ 29బలారా: ద బ్లడ్ ఐలాండ్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 29యూ, మీ, అజ్ (ఇటాలియన్ సిరీస్) - అక్టోబర్ 29అవరచన్ & బాయ్స్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - అక్టోబర్ 30ఎస్ఐ యుగంధర్ (తెలుగు మూవీ) - అక్టోబర్ 30అక్క (తెలుగు డబ్బింగ్ సిరీస్) - అక్టోబర్ 30సిగ్మా (తెలుగు డబ్బింగ్ సినిమా) - అక్టోబర్ 30హౌ టూ రూయిన్ దివాళి: మీట్ ద పేరెంట్స్ (సౌతాఫ్రికన్ సిరీస్) - అక్టోబర్ 30ఏ కపుల్ ఆఫ్ లైస్ (స్వీడిష్ సిరీస్) - అక్టోబర్ 30కొలిజన్ కోర్స్ (స్పానిష్ మూవీ) - అక్టోబర్ 30డెడ్ ఎండ్ జాబ్ (కొరియన్ సిరీస్) - అక్టోబర్ 30మీథే మే క్యాన్ హై (హిందీ సిరీస్) - అక్టోబర్ 30అబ్సెస్ (అరబ్ సిరీస్) - అక్టోబర్ 30ఎస్సీటీవీ: ద గ్రేట్ షో యూ నెవర్ హెర్డ్ ఆఫ్ (కెనడియన్ షో) - అక్టోబర్ 30అమెజాన్ ప్రైమ్డ్రైవ్: ద ప్రెటెండర్స్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబర్ 28అపోకలిప్స్ జెడ్: న్యూ వరల్డ్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబర్ 30జీ5హాస్టల్ హడ్సా (హిందీ సిరీస్) - అక్టోబర్ 28రుద్రవనం పీఎస్ (తెలుగు సిరీస్) - అక్టోబర్ 30ఆపిల్ టీవీ ప్లస్నోక్టర్న్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 30(ఇదీ చదవండి: శోభనం జరగనివ్వని 'తోకచుక్క'.. మలయాళ థ్రిల్లర్ 'ధూమకేతు' ఓటీటీ రివ్యూ) -
ఓటీటీలోకి అద్భుతమైన సినిమా.. అసలు మిస్ అవ్వొద్దు
రీసెంట్ టైంలో చాలామంది మాట్లాడుకునేలా చేసిన సినిమా ఒకటి.. ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. సాధారణ ప్రేక్షకుల నుంచి రివ్యూయర్ల వరకు ప్రతిఒక్కరికి ఇది నచ్చేసింది. చెప్పాలంటే చాలామంది దీనిని బెస్ట్ మూవీ ఆఫ్ ద ఇయర్ అని కూడా అన్నారు. ఇంతకీ ఈ చిత్రం సంగతేంటి? ఎందులోకి ఎప్పుడు రానుంది?(ఇదీ చదవండి: శోభనం జరగనివ్వని 'తోకచుక్క'.. ఓటీటీలో మలయాళ థ్రిల్లర్ 'ధూమకేతు' రివ్యూ)విజయ్ సేతుపతి అద్భుతమైన నటుడు. అందుకు తగ్గట్లే మంచి మంచి సినిమాలు కూడా చేశారు. ఇతడి నుంచి వచ్చిన లేటెస్ట్ తమిళ మూవీ 'బత్తా'. అట్లీ నిర్మించిన ఈ చిత్రానికి బాలాజీ ధరణిధరన్ దర్శకుడు. ఓ ఎమోషనల్ డ్రామా కథతో దీన్ని తెరకెక్కించారు. ఈ నెల 01వ తేదీన థియేటర్లలో రిలీజైంది. అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది. ఇప్పుడిది 29వ తేదీ(ఈ గురువారం) నుంచి నెట్‌ఫ్లిక్స్‌లోకి రానుందని ప్రకటించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది.'బత్తా' విషయానికొస్తే.. బత్తా అనే గ్యాంగ్‌స్టర్‌ని ఓ పిల్లాడు, స్కూల్లోని ఓ బాత్రూంలో పెట్టి బంధిస్తాడు. తర్వాత ఏమైంది? బత్తాలో ఎలాంటి మార్పొచ్చింది? అనేది మిగతా స్టోరీ. విజయ్ సేతుపతి ఇప్పటికే పలు సినిమాల్లో అద్భుతమైన ఫెర్ఫార్మెన్స్లు ఇచ్చాడు కానీ ఇందులో ఎప్పటికీ గుర్తుండిపోయే యాక్టింగ్‌తో అదరగొట్టేశాడు. సేతుపతే అనుకుంటే శబరి పాత్ర చేసిన పిల్లాడైతే ఆశ్చర్యపోయేంత షాకింగ్‌గా నటించాడు. వీళ్లిద్దరే కాదు సేతుపతి భార్యగా చేసిన లిజోమోల్, కూతురిగా చేసిన పాప కూడా అదరగొట్టేశారు. ఓటీటీలోకి వచ్చిన తర్వాత దీన్ని మిస్ కావొద్దు.(ఇదీ చదవండి: పరువు విలువ ఎంత? ఓటీటీ సినిమా రివ్యూ) -
'బెస్ట్ మూవీ ఆఫ్ ద ఇయర్'.. నిజంగా అంత బాగుందా?
సినిమాకు భాషతో సంబంధం లేదు. బాగుండాలే గానీ ఏ భాషా చిత్రమైనా సరే చూసే ప్రేక్షకులు బోలెడుమంది. ఇప్పుడు అలా తెలుగు ఆడియెన్స్ మధ్య చర్చకు కారణమైంది 'బత్తా'. విజయ్ సేతుపతి ప్రధాన పాత్ర చేసిన ఈ తమిళ సినిమా.. గత వీకెండ్ థియేటర్లలోకి వచ్చింది. వాళ్లు వీళ్లు అనే తేడా లేకుండా ప్రతిఒక్కరి నుంచి బ్లాక్‌బస్టర్ టాక్ తెచ్చుకుంటోంది. ఈ ఏడాది రిలీజైన అత్యుత్తమ చిత్రమని తెగ పొగిడేస్తున్నారు. మరి అంతలా ఇందులో ఏముంది? అసలు కథేంటి?విజయ్ సేతుపతి.. ఓ లవ్లీ క్యూట్ గ్యాంగ్‌స్టర్‌గా చేసిన సినిమా 'బత్తా'. సేతుపతి పాత్ర పేరునే టైటిల్‌గా పెట్టారు. గ్యాంగ్‌స్టర్ అన్నాం కదా అని కత్తులు, నరుక్కోవడాలు ఉంటాయని అనుకోవద్దు. పూర్తిగా కామెడీ, ఎమోషనల్‌గా దీనిని తీశారు. బత్తా అనే గ్యాంగ్‌స్టర్‌ని ఓ పిల్లాడు.. స్కూల్లోని ఓ బాత్రూంలో పెట్టి బంధిస్తే తర్వాత ఏమైంది? బత్తాలో ఎలాంటి మార్పొచ్చింది? అనేది మిగతా స్టోరీ.విజయ్ సేతుపతి ఇప్పటికే పలు సినిమాల్లో అద్భుతమైన ఫెర్ఫార్మెన్స్లు ఇచ్చాడు. కానీ 'బత్తా'లో ఎప్పటికీ గుర్తుండిపోయే యాక్టింగ్‌తో అదరగొట్టేశాడు. సేతుపతే అనుకుంటే శబరి పాత్ర చేసిన పిల్లాడైతే ఆశ్చర్యపోయేంత షాకింగ్‌గా నటించాడు. వీళ్లిద్దరే కాదు సేతుపతి భార్యగా చేసిన లిజోమోల్, కూతురిగా చేసిన పాప కూడా అదరగొట్టేశారు.ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: అపూర్వకి ఇచ్చిపడేశారు.. నామినేషన్లలో రచ్చసినిమా చూసిన ప్రతి ఒక్కరూ.. తమకు పూర్తిగా సంతృప్తి చెందామని చెబుతున్నారు. అదే టైంలో ఈ ఏడాది తాము చూసిన అత్యుత్తమ చిత్రం ఇదేనని కూడా అంటున్నారు. సాయి అభ్యంకర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయితే సినిమాకు చాలా అంటే చాలా ప్లస్ అయిందని చెబుతున్నారు. దర్శకుడు బాలాజీ ధరణిధరన్ని ఎంత మెచ్చుకున్నా తక్కువేని అంటున్నారు.తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్ లాంటి చోట్ల 'బత్తా' సినిమా ప్రదర్శితమవుతున్నప్పటికీ ప్రస్తుతం తమిళంలో మాత్రమే అందుబాటులో ఉంది. తెలుగు డబ్బింగ్ చేస్తే అస్సలు మిస్ కావొద్దు! ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు రొమాంటిక్ సినిమా.. అధికారిక ప్రకటనsss -
అట్లీ, విజయ్ సేతుపతి కాంబోలో ‘బత్తా’.. మరో డిఫరెంట్ అటెంప్ట్!
దర్శకుడు అట్లీ, నటుడు విజయ్ సేతుపతి కాంబినేషన్లో రూపొందుతున్న తాజా చిత్రానికి బత్తా అనే టైటిల్ నిర్ణయించారు. ఇంతకు ముందు అట్లీ దర్శకత్వం వహించిన హిందీ చిత్రం జవాన్‌లో విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా నటించిన విషయం తెలిసిందే. తాజాగా అట్లీ సమర్పణలో విజయ్ సేతుపతి హీరోగా బాలాజీ ధరణి ధరన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం బత్తా. విజయ్ సేతుపతి, బాలాజీ ధరణి ధరన్ కాంబోలో రూపొందుతున్న మూడవ చిత్రమన్నది గమనార్హం. ఇంతకు ముందు వీరి కాంబినేషన్లో నడువుల కొంచెం పక్కత్తుల కానోమ్, సీతాక్కాది వంటి సక్సెస్ ఫుల్ చిత్రాలు వచ్చాయి. దీంతో తాజాగా రూపొందుతున్న బత్తా చిత్రంపై భారీ అంచనాలు నెలకొనడం సహజమే. స్టార్ స్టూడియో 18, దర్శకుడు అట్లీ సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రంలో విజయ్ సేతుపతికి జంటగా జై భీమ్ చిత్రం ఫేమ్ విజోమోల్ జోస్ నటిస్తున్నారు. దీనికి యువ సంగీత దర్శకుడు సాయి అభయంకర్ సంగీతాన్ని, ఎస్ కే.సెల్వకుమార్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఏ ఫర్ యాపిల్ సినీ 1 స్టూడియోస్‌లో అధినేతలు మురద్ కేదాని, ప్రియా అట్లీ, అలోక్ జైన్, అజిత్ అందారే కలిసి నిర్మిస్తున్న చిత్రం ఇది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 1వ తేదీన విడుదల చేయనున్నట్లు యూనిట్ వర్గాలు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.K-town history la nadula konjam pakkatha skip pannama paatha…You know it’s going to be a banger when this combo reunites for the third time 🔥#Baththa will meet you on October 1st ❤️#VJSxBalajiCombo#BaththaFromOct1Makkal Selvan @VijaySethuOffl #BalajiTharaneetharan… pic.twitter.com/ETJo60SzcL— atlee (@Atlee_dir) August 12, 2026


