దర్శకుడు అట్లీ, నటుడు విజయ్ సేతుపతి కాంబినేషన్లో రూపొందుతున్న తాజా చిత్రానికి బత్తా అనే టైటిల్ నిర్ణయించారు. ఇంతకు ముందు అట్లీ దర్శకత్వం వహించిన హిందీ చిత్రం జవాన్‌లో విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా నటించిన విషయం తెలిసిందే. తాజాగా అట్లీ సమర్పణలో విజయ్ సేతుపతి హీరోగా బాలాజీ ధరణి ధరన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం బత్తా. విజయ్ సేతుపతి, బాలాజీ ధరణి ధరన్ కాంబోలో రూపొందుతున్న మూడవ చిత్రమన్నది గమనార్హం. ఇంతకు ముందు వీరి కాంబినేషన్లో నడువుల కొంచెం పక్కత్తుల కానోమ్, సీతాక్కాది వంటి సక్సెస్ ఫుల్ చిత్రాలు వచ్చాయి.
దీంతో తాజాగా రూపొందుతున్న బత్తా చిత్రంపై భారీ అంచనాలు నెలకొనడం సహజమే. స్టార్ స్టూడియో 18, దర్శకుడు అట్లీ సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రంలో విజయ్ సేతుపతికి జంటగా జై భీమ్ చిత్రం ఫేమ్ విజోమోల్ జోస్ నటిస్తున్నారు. దీనికి యువ సంగీత దర్శకుడు సాయి అభయంకర్ సంగీతాన్ని, ఎస్ కే.సెల్వకుమార్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఏ ఫర్ యాపిల్ సినీ 1 స్టూడియోస్‌లో అధినేతలు మురద్ కేదాని, ప్రియా అట్లీ, అలోక్ జైన్, అజిత్ అందారే కలిసి నిర్మిస్తున్న చిత్రం ఇది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 1వ తేదీన విడుదల చేయనున్నట్లు యూనిట్ వర్గాలు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.
K-town history la nadula konjam pakkatha skip pannama paatha…
You know it’s going to be a banger when this combo reunites for the third time 🔥#Baththa will meet you on October 1st ❤️#VJSxBalajiCombo#BaththaFromOct1
Makkal Selvan @VijaySethuOffl #BalajiTharaneetharan… pic.twitter.com/ETJo60SzcL— atlee (@Atlee_dir) August 12, 2026


