పదిహేడేళ్ల తర్వాత కలిసి నటిస్తున్న స్టార్‌ హీరోలు! | Akshay Kumar And Saif Ali Khan Reuniting In Haiwaan After 17 Years, Teaser Out | Sakshi
Sakshi News home page

పదిహేడేళ్ల తర్వాత కలిసి నటిస్తున్న స్టార్‌ హీరోలు.. టీజర్‌ అదిరింది!

Aug 13 2026 8:49 AM | Updated on Aug 13 2026 9:46 AM

Akshay Kumar And Saif Ali Khan Reuniting In Haiwaan After 17 Years, Teaser Out

బాలీవుడ్‌ హీరోలు అక్షయ్‌ కుమార్, సైఫ్‌ అలీఖాన్‌ పదిహేడేళ్ల తర్వాత కలిసి నటించిన చిత్రం ‘హైవాన్‌’. ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్‌ తెరకెక్కించిన ఈ చిత్రంలో బొమన్‌ ఇరానీ, సయామీ ఖేర్, శ్రియ పిల్గాంకర్‌ ఇతర పాత్రలు పోషించారు. కేవీఎన్‌ ప్రొడక్షన్స్, తెస్పియన్‌ ఫిలింస్‌ బ్యానర్స్‌పై వెంకట్‌ కె. నారాయణ, శైలజా దేశాయ్‌ ఫెన్‌ నిర్మించిన ఈ మూవీ సెప్టెంబరు 11న రిలీజ్‌  కానుంది. 

బుధవారం ఈ మూవీ టీజర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ఈ టీజర్‌లో సైఫ్‌ అలీఖాన్‌ని దివ్యాంగుడి పాత్రలో చూపించారు. అక్షయ్‌ కుమార్‌ ఇంటెన్స్‌ క్యారెక్టర్‌లో కనిపించారు. ‘‘సరికొత్త థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘హైవాన్‌’. ప్రియదర్శన్‌ తన మార్క్‌ థ్రిల్లర్‌ మూవీని ప్రేక్షకులకు చూపించబోతున్నారు. వెంకట్‌ కె. నారాయణ, శైలజా దేశాయ్‌ హై క్వాలిటీ ప్రొడక్షన్‌ వేల్యూస్‌తో నిర్మించారు. 

ఈ ప్రెస్టీజియస్‌ మూవీలో ఫస్ట్‌ టైమ్‌ నెగిటివ్‌ క్యారెక్టర్‌లో నటించారు అక్షయ్‌ కుమార్‌. ఇప్పటికే రిలీజ్‌ చేసిన ఈ మూవీ ఫస్ట్‌ లుక్‌ ΄ోస్టర్‌కి ΄ాన్‌ ఇండియా స్థాయిలో మంచి స్పందన లభించింది. ఇప్పుడు టీజర్‌కి కూడా మంచి స్పందన వస్తోంది’’ అని చిత్రయూనిట్‌ తెలిపింది. ఈ చిత్రానికి కెమెరా: దివాకర్‌ మణి, సంగీతం: ప్రీతమ్‌ చక్రవర్తి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement