breaking news
Haiwaan Movie
-
అక్షయ్-సైఫ్ యాక్షన్ మూవీ.. ఫుల్ వయొలెంట్‌గా ట్రైలర్
అక్షయ్ కుమార్, సైఫ్ అలీ ఖాన్ లీడ్ రోల్లో వస్తోన్న లేటేస్ట్ మూవీ హైవాన్. ఈ మూవీని ప్రియదర్శన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని వెంకట్ నారాయణ, శైలజ దేశాయ్ ఫెన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా వచ్చే నెల 11న థియేటర్లలో సందడి చేయనుంది.ఈ నేపథ్యంలోనే హైవాన్ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ చూస్తుంటే మర్డర్స్ నేపథ్యంలోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇందులో సన్నివేశాలు చూస్తుంటే ఫుల్ వయొలెంట్‌గా ఉండనుందని అర్థమవుతోంది. అక్షయ్- సైఫ్ మధ్య ఫైట్ సీన్స్ ఈ చిత్రంపై మరింత ఆసక్తి పెంచుతున్నాయి. కాగా.. ఈ చిత్రంలో బోమన్ ఇరానీ, సయామీ ఖేర్, శ్రియా పిల్గాంకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
పదిహేడేళ్ల తర్వాత కలిసి నటిస్తున్న స్టార్ హీరోలు!
బాలీవుడ్ హీరోలు అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన్ పదిహేడేళ్ల తర్వాత కలిసి నటించిన చిత్రం ‘హైవాన్’. ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో బొమన్ ఇరానీ, సయామీ ఖేర్, శ్రియ పిల్గాంకర్ ఇతర పాత్రలు పోషించారు. కేవీఎన్ ప్రొడక్షన్స్, తెస్పియన్ ఫిలింస్ బ్యానర్స్‌పై వెంకట్ కె. నారాయణ, శైలజా దేశాయ్ ఫెన్ నిర్మించిన ఈ మూవీ సెప్టెంబరు 11న రిలీజ్ కానుంది. బుధవారం ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ టీజర్లో సైఫ్ అలీఖాన్ని దివ్యాంగుడి పాత్రలో చూపించారు. అక్షయ్ కుమార్ ఇంటెన్స్ క్యారెక్టర్లో కనిపించారు. ‘‘సరికొత్త థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘హైవాన్’. ప్రియదర్శన్ తన మార్క్ థ్రిల్లర్ మూవీని ప్రేక్షకులకు చూపించబోతున్నారు. వెంకట్ కె. నారాయణ, శైలజా దేశాయ్ హై క్వాలిటీ ప్రొడక్షన్ వేల్యూస్‌తో నిర్మించారు. ఈ ప్రెస్టీజియస్ మూవీలో ఫస్ట్ టైమ్ నెగిటివ్ క్యారెక్టర్లో నటించారు అక్షయ్ కుమార్. ఇప్పటికే రిలీజ్ చేసిన ఈ మూవీ ఫస్ట్ లుక్ ΄ోస్టర్‌కి ΄ాన్ ఇండియా స్థాయిలో మంచి స్పందన లభించింది. ఇప్పుడు టీజర్‌కి కూడా మంచి స్పందన వస్తోంది’’ అని చిత్రయూనిట్ తెలిపింది. ఈ చిత్రానికి కెమెరా: దివాకర్ మణి, సంగీతం: ప్రీతమ్ చక్రవర్తి.


