అక్షయ్-సైఫ్ యాక్షన్‌ మూవీ.. ఫుల్ వయొలెంట్‌గా ట్రైలర్ | Akshay Kumar and Saif Ali Khan Action Movie Haiwaan Official Trailer | Sakshi
Sakshi News home page

Haiwaan Official Trailer: అక్షయ్-సైఫ్ యాక్షన్‌ మూవీ.. ఫుల్ వయొలెంట్‌గా ట్రైలర్

Aug 25 2026 6:06 PM | Updated on Aug 25 2026 6:13 PM

Akshay Kumar and Saif Ali Khan Action Movie Haiwaan Official Trailer

అక్షయ్‌ కుమార్, సైఫ్‌ అలీ ఖాన్‌ లీడ్ రోల్లో వస్తోన్న లేటేస్ట్ మూవీ హైవాన్‌. ఈ మూవీని ప్రియదర్శన్‌ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని వెంకట్‌ నారాయణ, శైలజ దేశాయ్‌ ఫెన్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా వచ్చే నెల 11న థియేటర్లలో సందడి చేయనుంది.

ఈ నేపథ్యంలోనే హైవాన్ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ చూస్తుంటే మర్డర్స్ నేపథ్యంలోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇందులో సన్నివేశాలు చూస్తుంటే ఫుల్ వయొలెంట్‌గా ఉండనుందని అర్థమవుతోంది. అక్షయ్- సైఫ్ మధ్య ఫైట్ సీన్స్ ఈ చిత్రంపై మరింత ఆసక్తి పెంచుతున్నాయి. కాగా.. ఈ చిత్రంలో బోమన్‌ ఇరానీ, సయామీ ఖేర్, శ్రియా పిల్గాంకర్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement