ఓటీటీలోకి తెలుగు మ్యూజికల్ డ్రామా.. ట్రైలర్ రిలీజ్ | Jagamae Sangeetham Series OTT Trailer And Release Date | Sakshi
Sakshi News home page

OTT: సంగీత ప్రేమికుల కోసమో సిరీస్.. ట్రైలర్ చూశారా?

Aug 25 2026 4:04 PM | Updated on Aug 25 2026 4:14 PM

Jagamae Sangeetham Series OTT Trailer And Release Date

ఓటీటీల్లో కొన్ని సినిమాలు నేరుగా రిలీజ్ అవుతుంటాయి. అలానే సిరీస్‌లు కూడా తీస్తుంటారు. అలా ఇప్పుడు తీసిన మ్యూజికల్ డ్రామా సిరీస్ 'జగమే సంగీతం' స్ట్రీమింగ్‌కి సిద్ధమైంది. ఈ మేరకు ట్రైలర్ రిలీజ్ చేసి స్టోరీ ఏంటనేది చెప్పే ప్రయత్నం చేశారు. ఇందులో ప్రకాశ్ రాజ్, మధుబాల, శ్రీకాంత్ ప్రధాన పాత్రలు చేయగా.. మెగాస్టార్ చిరంజీవి కూతురు సుస్మిత నిర్మాతగా వ్యవహరించింది.

(ఇదీ చదవండి: ఓటీటీ ప్రేక్షకులపై నటుడు శ్రీకాంత్ చిల్లర వ్యాఖ్యలు)

వచ్చే నెల 04వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో తెలుగు, తమిళ భాషల్లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఆరేళ్ల క్రితం ఇదే ఓటీటీలో రిలీజైన 'బండిష్ బండిట్స్'కి ఇది తెలుగు రీమేక్. ట్రైలర్ బట్టి చూస్తే.. వైకుంఠపురం అనే ఊరిలో శాస్త్రి గారి కుటుంబం శాస్త్రీయ సంగీతం నేర్పిస్తూ ఉంటారు. ఈయన మనవడు కూడా తాత తగ్గ వారసుడు అయ్యే ప్రయత్నాల్లో ఉంటాడు. ఆ టైంలో వెస్ట్రన్ సంగీతంపై మక్కువ ఉండే ఒకమ్మాయి ఈ కుర్రాడికి పరిచయమవుతుంది. తర్వాత ఏమైందనదే స్టోరీలా అనిపిస్తుంది.

ఇప్పటివరకు థ్రిల్లర్, రొమాంటిక్, యాక్షన్ జానర్లలో సిరీసులు వచ్చాయి. 'జగమే సంగీతం' పూర్తి మ్యూజిక్ నేపథ్యంగా తెరకెక్కించారు. ట్రైలర్‌లో విశాల్ చంద్రశేఖర్ అందించిన సంగీతం వినసొంపుగా ఉంది. మరి ఇది ప్రేక్షకుల్ని ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి?

(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement