ఓటీటీలో రాబోయే థిల్లర్‌ సినిమాపై కాపీరైట్‌ వివాదం..! | Taapsee Pannu Gandhari Faces Copyright Row Ahead Of Netflix Release, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

ఓటీటీలో రాబోయే థిల్లర్‌ సినిమాపై కాపీరైట్‌ వివాదం..!

Aug 25 2026 8:07 AM | Updated on Aug 25 2026 10:18 AM

Taapsee Pannu New Movie Copyright Controversy

తాప్సీ పన్ను.. ‘గాంధారి’తో అలరించేందుకు సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 3న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌ సినిమాపై తాజాగా కాపీరైట్ వివాదం మొదలైంది. ఈ సినిమా కథ 2019లో రాసి తాను రిజిస్టర్‌ చేసిన కథాంశంతో పోలి ఉందని కల్యాణ్‌ బండి అనే రచియిత ఆరోపించారు. 

తాను రాసిన కథలో కూడా చిన్నారి కిడ్నాప్‌, చైల్డ్‌ ట్రాఫికింగ్‌ నేపథ్యంలో ఓ తల్లి తన బిడ్డను రక్షించేందుకు పోరాడుతుందని, ఆ క్రమంలో ఆమెను ఉగ్రరూపం దాల్చిన దేవతగా చూపించానని ఆయన తెలిపారు.  2019లో ఈ కథను అప్పటి వూట్‌ సంస్థలో ఉన్న మోనికా షెర్గిల్‌కు పంపినట్లు చెప్పారు.  అనంతరం స్కీృరైటర్స్‌ అసోసియేషన్‌లో కథ, సారాంశాన్ని రిజిస్టర్‌ చేసినట్లు పేర్కొన్నారు. 
రూ.40లక్షల పరిహారం..
2025లో నెట్‌ఫ్లిక్స్‌లో ‘గాంధారి’ ప్రకటన వచ్చినప్పుడు తన కథతో పోలి ఉన్నట్లు గమనించానని కల్యాణ్‌ తెలపారు. ఈ విషయంపై 2025లోనే నిర్మాతలకు లీగల్‌ నోటీసులు పంపి సుమారు 40 లక్షల పరిహారం కోరినట్లు వెల్లడించారు. అయితే తనకు డబ్బు కంటే తన ఆలోచనకు గుర్తింపు, క్రెడిట​ అభించడమే ముఖ్యమని చెప్పారు. 

ఆరోపణలను  ఖండిస్తూ..
మరోవైపు కనికా ధిల్లాన్‌కు చెందిన కత్త పిక్చర్స్‌ ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించింది.  ‘గాంధారి’ పూర్తిగా ఒరిజినల్ కథ అని.. కనికా ధిల్లాన్ స్వయంగా కథను రచించినట్లు స్పష్టం చేశారు. దేవాశిష్ మఖిజా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తాప్సీతో పాటు ఇష్వాక్ సింగ్, ఛాయా కదమ్, స్వస్తికా ముఖర్జీ తదితరులు నటించారు. సెప్టెంబర్ 3న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.

ఇదీ చదవండి: మరో క్రేజీ ప్రాజెక్ట్‌తో రవితేజ, శ్రీ విష్టు మల్టీస్టారర్‌ మూవీ.!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement