టాలీవుడ్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ బర్త్ డే కావడంతో ఆయన సతీమణి స్పెషల్ విషెస్ తెలిపింది. తన భర్తకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా తమ పెళ్లి ఫోటోలను కూడా షేర్ చేసింది. వితం ఎలాంటి కష్టాలు తెచ్చినా, నువ్వు ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ ఉండాలంటూ పోస్ట్ చేసింది. నీ మనసు కోరుకున్నవన్నీ దేవుడు నీకు ప్రసాదించి, నీకు సంతోషాన్ని అందించాలని కోరుకుంటున్నా.. నిన్ను ఎల్లప్పుడూ ప్రేమిస్తూనే ఉంటానంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
కాగా.. టాలీవుడ్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ గతేడాది నవంబర్‌లో పెళ్లి పీటలెక్కాడు. ప్రియురాలు హరణ్య రెడ్డిని పెళ్లాడారు. గతేడాది ఆగస్టులో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట.. కొన్ని నెలలకే వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు.
రాహుల్ ప్రస్థానం..
హైదరాబాద్‌లోని ధూల్‌పేటలో మధ్య తరగతి కుటుంంలో రాహుల్ సిప్లిగంజ్ జన్మించాడు. అతడికి సంగీతంపై ఉన్న ఆసక్తి గమనించిన తండ్రి గజల్ మాస్టర్ వద్దకు తీసుకెళ్లాడు. ఓవైపు సంగీతంలో శిక్షణ తీసుకుంటూ మరోవైపు తండ్రికి సాయంగా బార్బర్ షాప్‌లో పని చేశాడు.
ఫేమస్ సాంగ్స్..
కాలేజీ బుల్లోడ.. వాస్తు బాగుందే.. ఈగ టైటిల్ సాంగ్.. సింగరేణుంది బొగ్గే పండింది, రంగా రంగా రంగస్థలానా.. బోనాలు ఇలా అనేక సాంగ్స్ పాడాడు. మంగమ్మ, పూర్ బాయ్, గల్లీకా గణేశ్, దావత్ వంటి పలు ప్రైవేట్ ఆల్బమ్స్ రూపొందించాడు. తెలుగు బిగ్‌బాస్ సీజన్ 3లో పాల్గొని విజేతగా నిలిచాడు. ఆర్‌ఆర్‌ఆర్ మూవీలో కాలభైరవతో కలిసి పాడిన నాటునాటు పాట అతడికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టింది.


