కేరళకు చెందిన 19 ఏళ్ల కజియా లిజ్ మెజో (Keziah Liz Mejo) మిస్ యూనివర్స్ ఇండియా 2026 కిరీటాన్ని గెలుచుకున్నారు. (Miss Universe India 2026)
ఆదివారం జైపూర్‌లో జరిగిన అందాల పోటీల ఫైనల్‌లో 52 మంది ఇతర పోటీదారులను ఓడించి జాతీయ టైటిల్‌ను గెలుచుకున్నారు. కజియా లిజ్ మెజో కొత్త మిస్ యూనివర్స్ ఇండియా 2026గా నిలిచారు.
కజియా నవంబర్‌లో ప్యూర్టో రికోలో జరిగే 75వ మిస్ యూనివర్స్ పోటీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనుంది.
కజియా లిజ్ మెజో కేరళలోని మావెలిక్కరకు చెందిన లా విద్యార్థిని, మోడల్ కూ. 17వ ఏట మిస్ టీన్ దివా 2024 టైటిల్‌ని, ఆ తర్వాత మిస్ టీన్ ఇంటర్నేషనల్ 2025లో ఫస్ట్ రన్నర్-అప్‌గా నిలవగా, ఈ ఏడాది ప్రారంభంలోనే మిస్ యూనివర్స్ కేరళ 2026 టైటిల్ గెలుచుకుని, రాష్ట్ర టైటిల్ విజేతలలో అత్యంత పిన్న వయస్కురాలిగా నిలిచింది.
అంతేగాదు మిస్ యూనివర్స్ ఇండియా టైటిల్ గెలుచుకున్న తొలి కేరళీయురాలు కజియా లిజ్ మెజోనే.
(Images Source : Instagram / kaziahmejo)


