వీల్‌చైర్‌లో మహిళ పుల్‌ అప్స్‌..! వీడియో వైరల్‌ | Woman in wheelchair does pull-ups at gym Goes Viral | Sakshi
Sakshi News home page

వీల్‌చైర్‌లో మహిళ పుల్‌ అప్స్‌..! వీడియో వైరల్‌

Aug 24 2026 1:04 PM | Updated on Aug 24 2026 1:06 PM

Woman in wheelchair does pull-ups at gym Goes Viral

దివ్యాంగులు చూపే అసాధారణ ప్రతిభ, పట్టుదల ఎవ్వరినైనా ఇట్టే కట్టిపడేస్తాయి. అవయవాలన్నీ సక్రమంగా ఉన్నవారికంటే మెరుగ్గా అద్భుతంగా డేరింగ్‌ ఫీట్‌లు చేస్తూ ఆశ్చర్యపరుస్తుంటారు. తమ శారీరక పరిస్థితికి మించి చేసి ఆదర్శంగా నిలుస్తుంటారు. అలాంటి సూమర్‌వుమన్‌ ఈ మహిళ.

ఒక దివ్యాంగురాలు జిమ్‌లో సవాలుతో కూడిన వ్యాయామానికి సిద్ధమవుతుంది. పలువురు మహిళలు ఆమె వీల్‌చైర్‌ను పుల్‌అప్‌ బార్‌ దగ్గర ఉంచడానికి సహాయం చేస్తారు. ఆమె ఆ తర్వాత చాలా అలవోకగా ఆ పుల్‌ అప్స్‌ చేస్తుంది. 

నిజానికి అక్కడున్న మహిళలు ఆ వ్యాయామాన్ని పూర్తి చేయగలదో లేదా అని అనుమానంగా చూస్తారు. కానీ ఆమె చాలా సునాయాసంగా వీల్‌చైర్‌లోనే కూర్చొని పుల్‌ అప్స్‌ చేస్తుంటుంది. మొదట్లో సంకోచించినప్పటికీ..విజయవంతంగా ఆ వ్యాయామాన్ని పూర్తి చేయడమే గాక ఇంకా కొనసాగించాలనే ఉత్సుకతత కనిపిస్తుంటుంది. 

వీడియో చివర్లో ఆమె తన లక్ష్యాన్ని పంచుకోవడం విశేషం. తాను ఏడాది ముగిసేలోపు 10 పుల్‌ అప్‌లు చేయడమే తన లక్ష్యం అని చెప్పింది. ఈ వీడియోక్లిప్‌ ఆమె బలాన్ని మాత్రమే కాకుండా, ఆమె చుట్టూ ఉన్న మహిళలు మద్దతుగా నిలబడం అందర్నీ తెగ ఆక‌ర్షించింది. నెటిజన్లు ఇది పూర్తిగా నివ్వెరపరిచే విషయం, నిజంగా ఆమె  ‘సూపర్‌వుమన్’ అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. 

 

(చదవండి: ట్రావెల్‌ వీడియోల్లో ఇంత కిక్‌ ఉందా? ఏడాదికి రూ.85 లక్షలు ఆర్జించే ఉద్యోగాన్నే..)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement