కర్ణాటకలోని మాండ్య జిల్లాలో ఒక దిగ్భ్రాంతికర ఘటన వెలుగుచూసింది. నిజంగా ఈ ఘటన గురించి తెలిస్తే కళ్లు చెమర్చక మానవు. అత్యంత పేదరికంలో జీవిస్తూ, భిక్షాటనతో రూపాయి రూపాయి కూడబెట్టి, లక్షలు పోగు జేసింది. కానీ ఏ లాభం? ఆ లక్షలేవీ ఆమెకు అక్కరకు రాలేదు. ఆ ధనాన్ని అనుభవించ కుండానే ఆమె కన్నుమూయడం స్థానికులను తీవ్రంగా కలచివేసింది.
మాండ్యకు చెందిన 68 ఏళ్ల హూర్ (Hoor) అనే వృద్ధురాలు వయోభారంతో వచ్చిన అనారోగ్యం కారణంగా కన్నుమూసింది. జీవితాంతం భిక్షాటన చేస్తూ గడిపిన ఒక మహిళ ఇంట్లో లక్షల రూపాయల నగదుతో నిండిన సంచులు లభ్యమైన ఘటన సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
అనంతరం స్థానికులు ఆమె అద్దె ఇంటిని తనిఖీ చేయగా, దాదాపు 30కి పైగా గోనె సంచుల్లో నింపి ఉన్న వేలాది నాణేలు, రూ. 10,20,రూ 50 కరెన్సీ నోట్లు బయటపడ్డాయి. స్థానికులు ఆ డబ్బును లెక్కించగా రూ.8,40,000 (ఎనిమిది లక్షల నలభై వేల రూపాయలు) నగదు చూసి అందరూ దిగ్భ్రాంతి పోయారు.
At least 30 cash-filled sacks worth over ₹8 lakhs have been found at the house of a woman in Karnataka who spent all of her life begging. She died yesterday due to an age-related illness. The money was handed over to her brothers. One of the brothers took Rs 6 lakh while the… pic.twitter.com/Q0L89fM8d1
— Piyush Rai (@Benarasiyaa) August 24, 2026
ఇదీ చదవండి: రోజుకు రూ. 50లే, ఇపుడు ఫార్చ్యూనర్ కారు : స్వీపర్ సక్సెస్ స్టోరీ వైరల్
హూర్ తన సోదరితో కలిసి ఆ అద్దె ఇంట్లో నివసించేవారు. ఇద్దరికీ వివాహం కాలేదు. రెండేళ్ల క్రితమే ఆమె సోదరి కూడా మరణించారు. దీంతో ఈ సొమ్మును హూర్ సోదరులకు అప్పగించారు. ఒక సోదరుడు రూ. 6 లక్షలు తీసుకోగా, మరొక సోదరుడు తన వాటాకి వచ్చిన రూ. 2,40,000 లను స్థానిక మసీదుకు విరాళంగా ఇచ్చారు.
ఇదీ చదవండి: మిస్ యూనివర్స్ ఇండియా 2026 విజేత : ఎవరీ కేరళ బ్యూటీ


