బెంగళూరు: పట్టిన దయ్యాన్ని విడిపిస్తానంటూ మహిళలు, యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న నకిలీ స్వామి ఉదంతమిది. చిక్కమగళూరు జిల్లా కొప్ప తాలూకా మేకనహుడ్లు గ్రామంలో సతీశ్ పత్రి అనే వ్యక్తి స్వామీజీ వేషమెత్తి దయ్యం, భూతం విడిపిస్తానని చెప్పుకుంటున్నాడు.
దీంతో కొందరు అతనిని ఆశ్రయించగా, పూజల పేరుతో యువతితో కలిసి చిందులేస్తూ అసభ్యంగా ప్రవర్తించాడు. దయ్యం వీడాలంటే కోడిని కొరికి రక్తం తాగాలని ఆమెను ఒత్తిడి చేశాడు. ఈ వీడియో ప్రచారంలోకి వచ్చింది. కొందరు గ్రామస్థులు అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.


