ఆమె అందరిలాంటి బామ్మ కాదు..! 44 ఏళ్ల వయసులో ఎంటెక్‌, పీహెచ్‌డీ.. | 59 year old grandmother Ashu Jain Goes Viral | Sakshi
Sakshi News home page

ఆమె అందరిలాంటి బామ్మ కాదు..! 44 ఏళ్ల వయసులో ఎంటెక్‌, పీహెచ్‌డీ..

Aug 23 2026 4:57 PM | Updated on Aug 23 2026 5:40 PM

59 year old grandmother Ashu Jain Goes Viral

కొందరు వృద్ధాప్యానికి వ్యతిరేకంగా చురుకుగా యువతలా ఉండేలా ‍ప్రయత్నం చేయడం కాదు..ఆ వయసులో చేసే సాహాసాలను చేస్తుంటారు. యువతలా యాక్టివ్‌గా ఉంటూ అందర్నీ ఆశ్చర్యపరుస్తుంటారు. పైగా భావితరాలకు ఓ గొప్ప స్ఫూర్తిగా నిలుస్తారు. అలాంటి కోవకు చెందిందే ఈ బామ్మ. ఈమె అలాంటి ఇలాంటి బామ్మ కాదు.!.

ఆషు జైన్ అనే బామ్మ అందరిలాంటి బామ్మ కాదామె. డెహ్రాడూన్‌కు చెందిన ముగ్గురు పిల్లల తల్లి. ఆమె ఒకప్పుడు అల్లికలు అల్లుతూ మనవళ్లను చూసుకుంటూ గడిపింది. కానీ ఇప్పుడామె జిమ్‌లో డెడ్‌లిఫ్ట్, జుంబా,  హైరాక్స్ రేసుల వంటివి సునాయాసంగా చేస్తుంటుందామె. జీవిత చరమాంకంలో ఎలా ఫిట్‌నెస్‌తో ఉండొచ్చో చూపిస్తూ..తనలాంటి వాళ్లకు ఆదర్శంగా నిలుస్తోందామె.

సాధారణ బామ్మలా కాదు..
ఆమె పిల్లలు చదువుకోమని ప్రోత్సహించడంతో 44 ఏళ్ల వయసులో తిరిగి చదువుని ప్రారంబించింది. అలా ఆమె ఎంటెక్‌, ఐఐటీ ఢిల్లీ నుంచి పీహెచ్‌డీ పూర్తి చేసింది. అదే క్రమశిక్షణ ఫిట్‌నెస్‌లో కూడా సాగింది. ఫిట్‌నెస్‌ అంటే కేవలం అందంగా కనిపించడం మాత్రమే కాదు, నొప్పి లేకుండా ట్రెక్కింగ్, నృత్యం చేయడం, మనవరాలిని ఎత్తుకోగలగడం తదితరాలని అంటోంది ఈ బామ్మ. 

ఇది కేవలం స్వేచ్ఛకు సంబంధించినది కాదని అంటోంది. అంతేగాదు తన ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లో తన నాలుగేళ్ల జిమ్‌ అలవాట్లను కూడా ఆమె షేర్‌ చేసుకున్నారు. అందుకు తనకు ఉపకరించిన టిప్స్‌ను కూడా పంచుకున్నారు. అవేంటంటే..

  • కొత్తగా ఫిట్‌నెస్‌ మొదలుపెడితో చిన్నగా ప్రారంభించమని అంటోంది. చిన్నపాటి లక్ష్యాలతో సాగితే..ఆ తర్వాత పునరావృతం చేసే సంఖ్య పెంచుకుంటూ పోవచ్చని అంటోంది. 

  • ఇప్పటికే ఉన్న అలవాట్లకు రోజువారీ అలవాట్లను అనుసంధానించండి. 

  • ముందుగా ఏ రోజుకారోజు సన్నద్ధమవ్వడం వంటివి చేయాలి. రేపుచేసే వ్యాయామాలకు కావాల్సిన విధంగా రెడీ అయ్యి ఉండటం. 

  • నిలకడగా చేసేలా చూసుకోండి 

  • ఒక్కోసారి ఆటంకాలు రావడం, క్రమశిక్షణాయుతంగా చేయలేకపోవడం జరిగినా..నిలకడగా కొనసాగేలా కేర్‌ తీసుకోవాలి

  • పరిపూర్ణంగా చేయడం కంటే నిలకడగా..సాగిపోవడమే అసలైన ఫిట్‌నెస్‌ మంత్ర.

అలాగే ఆమె హైరాక్స్‌ కోసం ఎలా సన్నహామవుతుందో కూడా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకున్నారు. ఓర్పుతో కూడిన ఫంక్షనల్‌ వ్యాయామాలతో కూడిన  గ్లోబల్‌ ఫిట్‌నెస్‌ రేస్‌. ఈ ఏడాది ప్రారంభంలోనే రెండో హైరాక్స్‌ను పూర్తి చేశారామె. 

ఆమె రోజు ఉదయం నాలుగు గంటలకు నీరు, ప్రార్థన, నానబెట్టిన నట్స్‌తో ‍ప్రారంభమవుతుంది. ఆమె శిక్షణలో ప్రత్యేకమైన స్ట్రెంగ్త్‌, డెడ్‌లిఫ్ట్‌, రన్నింగ్‌, జుంబా, బాల్కనీ వాక్‌లు ఉంటాయి. కాగా డబ్ల్యూహెచ్‌ఓ కూడా 18 నుంచి 64 ఏళ్ల వయసుల పెద్దలు 150–300 నిమిషాల మధ్యస్థ-తీవ్రతతో కూడిన ఏరోబిక్ కార్యకలాపాలు లేదా 75–150 నిమిషాల అధిక-తీవ్రతతో కూడిన ఏరోబిక్ కార్యకలాపాలు చేయాలని సూచిస్తోంది. 

అలాగే వారానికి కనీసం రెండు రోజులు కండరాలను బలోపేతం చేసే ప్రధాన కార్యకలాపాలు చేయాలని సిఫార్సు చేస్తోంది. ఇక్కడ ఆషు బామ్మ దినచర్య కనీస ప్రమాణాలకు మించి పోయింది. నిజంగా ఆమె ‘హైబ్రిడ్ అథ్లెట్ బామ్మ’. 

 

(చదవండి: మూడుగంటల ట్యాక్సీ ప్రయాణం..ప్రేమకథగా ఎలా మారిందంటే..!)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement