హై‘టెక్‌’ రాఖీ..! చూడ్డానికి చిన్నవే..సర్‌ప్రైజ్లో మాత్రం.. | Unique Rakhi Ideas 2026, From QR Code Memories To Eco Friendly And Dream Car Rakhis, Check Out Full Story Inside | Sakshi
Sakshi News home page

హై‘టెక్‌’ రాఖీ..! చూడ్డానికి చిన్నవే..సర్‌ప్రైజ్లో మాత్రం..

Aug 23 2026 3:39 PM | Updated on Aug 23 2026 5:47 PM

Raksha Bandhan: the best Rakhi gadget gift ideas

రాఖీ కట్టారు... గిఫ్ట్‌ ఇచ్చారు... స్వీటు తినిపించారు! ఇంతటితో అయిపోయిందనుకుంటే... ఎలా? కాస్త కొత్తగా ఆలోచించండి. ఈసారి అన్నయ్య చేతికి కట్టే రాఖీకి కాస్త క్రియేటివిటీ జోడిస్తే, ఆ చిన్న దారమే ఓ అందమైన జ్ఞాపకంగా మారొచ్చు. ఎందుకంటే, ఇవి చూడ్డానికి చిన్నవే అయినా సర్‌ప్రైజ్‌ సైజ్‌లో మాత్రం పెద్దవే!

స్కాన్‌  చేస్తే... సెంటిమెంట్‌ ఓపెన్‌ !
రాఖీ కట్టగానే సోదరుడు ‘థ్యాంక్యూ’ చెప్పి ఊరుకుంటే ఎలా? ఈసారి కాస్త టెక్నాలజీని కూడా బంధంలోకి లాగేద్దాం! ఈ ప్రత్యేక రాఖీపై ఉండే క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌  చేస్తే, అన్నాచెల్లెళ్ల జ్ఞాపకాల చిన్న డిజిటల్‌ ప్రపంచమే తెరుచుకుంటుంది. చెల్లెలు ముందే ఎంపిక చేసుకున్న ఫొటోలు, వీడియోలు, ప్రత్యేక సందేశాలు అందులో కనిపిస్తాయి. 

పేర్లు, పర్సనల్‌ మెసేజ్‌లు, సరదా జ్ఞాపకాలు... ఇలా మనసులోని మాటలన్నింటినీ ఇందులో దాచుకోవచ్చు. ఒక రాఖీకి ఏకంగా 10 ఫొటోలు, ఒక వీడియో, ఐదు వ్యక్తిగత సందేశాలు జోడించుకోవచ్చు. యాప్‌ అవసరం లేకుండానే స్కాన్‌  చేసి చూడొచ్చు. ఇలా రాఖీ కట్టేది చేతికి... కానీ టచ్‌ అయ్యేది మాత్రం మనసుకే! ధర బ్రాండ్‌ని బట్టి ఉంటుంది.

మొక్కగా మారే బంధం! 
రాఖీ ఒక్కరోజు చేతికి కట్టి... తర్వాత పెట్టెలో దాచేయడం పాత పద్ధతి! అందుకే, ఈసారి ఆ రాఖీకి కాస్త పచ్చదనం జోడిస్తే ఎలా ఉంటుంది? ఈ పర్యావరణహిత రాఖీతో అన్నాచెల్లెళ్ల బంధంతో పాటు, ప్రకృతితోనూ చిన్న బంధం మొదలవుతుంది. 

రాఖీ పండగ పూర్తయ్యాక దీన్ని నాటితే మొక్కగా పెరిగేలా పప్పులు, కూరగాయల విత్తనాలను ఇందులో పొందుపరిచారు. అలాగే, ప్లాస్టిక్‌ అలంకరణలకు బదులుగా సహజ పదార్థాలతో వీటిని తయారు చేశారు. రాఖీతో పాటు చిన్న కాయిర్‌ ప్లాంటర్, కోకోపీట్‌ డిస్క్, రోలి–చావల్, చిన్న స్వీట్‌ కూడా ఉండటంతో ఇది ఒక చిన్న  ప్రకృతి పండగ కిట్‌లా ఉంటుంది. ధర రూ. 500 నుంచి మొదలు.

చేతికి.. అన్నయ్య కలల కారు!
కారంటే అబ్బాయిలకు ఎంత ఇష్టమో చెప్పడానికి గ్యారేజీకి వెళ్లాల్సిన పనిలేదు... వాళ్ల ఫోన్‌ లోని కార్ల ఫొటోలు చూస్తే చాలు! అలాంటి కార్‌ లవర్‌కి ఈసారి రాఖీ కూడా తన ఫేవరెట్‌ కారే అయితే? అందుకే, ఈసారి రాఖీ కోసం సోదరుడు మనసు దోచుకున్న ఏ కారునైనా ఎంచుకుని, దాన్ని ప్రత్యేకంగా రాఖీ రూపంలో కస్టమైజ్‌ చేయించుకోవచ్చు. 

అలా, అన్నయ్య కలల కారును కొనివ్వలేకపోయినా... చేతికి మాత్రం అతని డ్రీమ్‌ కారును కట్టేయొచ్చు! అది కూడా బడ్జెట్‌లోనే!  చేతికి కట్టుకున్న ప్రతిసారీ ‘ఇది నా కారు’ అంటూ మురిసిపోవడానికి పర్ఫెక్ట్‌ గిఫ్ట్‌. ధర రూ. 200 నుంచి మొదలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement