విజయదశమి పర్వదినం రోజున దేశవ్యాప్తంగా రావణ దహనాలు జరుగుతుంటాయి. అపర జ్ఞాని, విద్యాంసుడైన రావణుడు ఒక్క స్త్రీ బలహీనతే విలన్‌గా మార్చిందని మనం కథల్లో చదువుకున్నాం. కానీ అక్కడ మహిళలు రావణుడిని తమ సోదరుడుగా గౌరవించడం విశేషం. అక్కడ ఆడవాళ్లకు రావణుడే దైవం. ఎక్కడంటే..
పంజాబ్‌లోని లూధియానా జిల్ల పాయల్ అనే పట్టణ వాసులకు రావణుడే దైవం. అక్కడ మహిళలు తమ సోదరుడు లాంటి వాడని, తమకు రక్షణ కల్పిస్తాడని విశ్వసిస్తారు. అంతేగాదు అతడిని పూజిస్తే తీరని కోరక అంటూ ఉండదని అక్కడ ప్రజల ప్రగాఢ నమ్మకం కూడా. పైగా అక్కడ భారీ రావణుడి విగ్రహం ఉంది. వాళ్లంతా రావణుడిని దేవుడిగా 18 ఏళ్ల నుంచి కొలుస్తున్నారట. ఈ విగ్రహం ఏర్పాటు చేసిన విధం కూడా అత్యంత విచిత్రం.
దసరా పండుగ రోజున అందరు రావణుడిని నిందిస్తూ దిష్టిబొమ్మలు తగలబెడితే..అక్కడ రావణుడుని విద్వాంసుడు, జ్ఞానికగా కొలుస్తారు. అంతేగాదు వాళ్లంతా ఇవాళ మన చుట్టూనే ఎంతమంది రావణులు ఉన్నారని, అభం శుభం తెలియని చిన్నారులను చిందిమేస్తున్నారని అంటున్నారు. వాళ్లకు మించిన భయంకర రాక్షసులు ఇంకేవరని ప్రశ్నిస్తున్నారు. అలాంటి వాళ్లనే శిక్షించాలి కానీ రావణుడిని కాదని అంటున్నారు. పైగా ఆయన్ను అపర శివ భక్తుడు, గొప్పవాడు అని కీర్తిస్తుండటం విశేషం.
ఈ విగ్రహం వెనుక కథ..
దశాబ్దాల క్రితం ఒక స్థానికుడు రావణుడు విగ్రహాన్ని నిర్మించాలని కల వచ్చిందట. దాంతో అతడు నిజంగానే ఈ విగ్రహాన్ని నిర్మించాడని చెబుతున్నారు స్థానికులు. అయితే ఈ రావణుడు విగ్రహం ఏర్పాటు విషయంలో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నా..లెక్కచేయకుండా నిర్మించాడట. ఆ తర్వాత కాలక్రమేణ అందరూ తెలియకుండానే రావణుడినా ఆరాధించటం ప్రారంభించినట్లు కథనం.
ఇదీ చదవండి: వెల్నెస్ కోచ్‌గా డెంటిస్ట్..! కట్‌చేస్తే ఇవాళ ఏకంగా..


