ఒక భారతీయ మహిళ దుబాయ్ వెళ్లి డెంటిస్ట్‌గా సెటిల్ అవ్వాలనుకుంది. అనుకోకుండా ఆ లక్ష్యం యూటర్న్ తీసుకుని ఆమెను మరో కెరీర్‌ని ఎంచుకునేలా చేసి..ఏకంగా నెలకు రూ. 11 లక్షలు ఆర్జించే రేంజ్‌కు చేరుకుంది. నిజానికి ఆమె అస్సలు ఆ కెరీర్‌ని ఎంచుకోవాలని ఎన్నడూ అనుకోలేదు. సరదాగా నేర్చుకుందామని వెళ్లి అదే తన కెరీర్‌గా మారి లక్షలు సంపాదించేలా చేసింది.
ఆ మహిళే మోనికా సింగ్. దుబాయ్‌లో డెంటిస్ట్‌గా పనిచేయాలని 12 ఏళ్ల క్రితం దుబాయ్ హెల్త్ అథారిటీ(డీహెచ్‌ఏ) లైసెన్సింగ్ పరీక్షలు కూడా రాసింది. యూఏఈలో డెంటిస్ట్‌గా ప్రాక్టీస్ చేయాలని కూడా ప్లాన్ చేసింది. అయితే లైసెన్సింగ్ పరీక్షలకు సన్నద్దమవుతుండగా గ్రూప్ వర్కౌట్ క్లాసులకు హాజరుకావడం ప్రారంభించింది. అలా ఆమెకు డ్యాన్స్ ఫిట్‌నెస్‌పై ఆసక్తి మొదలై దాన్నే వృత్తిగా ఎంచుకునే రేంజ్‌కు తీసుకువెళ్లింది.
అలా ఆమె దుబాయ్‌లోని స్టూడియోలలో గ్రూప్ వ్యాయామా తరగతులను బోధించడం ప్రారంభించింది. ఫిట్‌నెస్ కోచ్‌గా చిన్నగా మొదలైన ప్రస్థానం కాస్తా..సొంతంగా కోచింగ్ సెంటర్‌ని నడిపే అనుభవాన్ని అందించాయి. ఆ విషయాన్నే తన భర్తకు చెప్పడంతో అతడిచ్చిన సపోర్టుతో సొంతంగా ఫిట్‌నెస్ సెంటర్‌ని ఏర్పాటు చేసింది. అలా మధ్య వయసు మహిళలను మంచి ఫిట్‌నెస్ ట్రైనింగ్ ఇచ్చే కోచ్‌గా పేరుతెచ్చుకుంది.
ఆమె అధిక శారీరక ఒత్తడి పడకుండా ఆరోగ్య లక్ష్యాలను చేరుకోవడంలో క్లయింట్లకు సహాయం చేస్తుంది. ఇలా ఫిట్‌నెస్ కోచ్‌గా విజయవంతంగా రాణించడానికి తన వైద్య నేపథ్యమే హెల్ఫ్ అయిందని అంటోందామె. ప్రస్తుతం ఆమె దుబాయ్‌లో సుమారు 23 మందికి శిక్షణ ఇస్తోంది. అంతేగాదు ఆమె నెలవారి ఆదాయం దాదాపు రూ. 11 లక్షలు పైనే ఉంటుందట. మంచి ఆదాయం ఆర్జిస్తున్నా ఇంకా ఎలాంటి పెట్టుబడులు పెట్టలేదని పేర్కొంది.
ప్రస్తుతం తన వెల్నెస్ వ్యాపారం కోసం ఆన్‌లైన్ పోర్టల్, యాప్‌ను ప్రారంభించడమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొంది. దీని అభివృద్ధికి చాలా ఖర్చు అవుతుందని, అందుకే డబ్బును పొదుపు చేసే పనిలో ఉన్నానని అంటోంది మోనికా సింగ్. అన్నీ మనం అనుకున్నట్లు జరగకపోయినా..మన అభిరుచిని గుర్తించి మరింత కృషి చేస్తే విజయవంతమైన వ్యాపారాన్ని నిర్మించడం పెద్ద కష్టమేమి కాదని మోనిక్ సింగ్ కథ చెబుతోంది కదూ..!.
ఇదీ చదవండి: అత్తారింటికి విమానంలో..! అరుదైన వివాహ వేడుక


