జెన్‌ ఆల్ఫాతో మోదీ రాఖీ వేడుక.. హై-ఫైవ్‌లు ఇస్తూ | Modi Gen Alpha Raksha Bandhan edition | Sakshi
Sakshi News home page

జెన్‌ ఆల్ఫాతో మోదీ రాఖీ వేడుక.. హై-ఫైవ్‌లు ఇస్తూ

Aug 28 2026 3:08 PM | Updated on Aug 28 2026 3:26 PM

 Modi Gen Alpha Raksha Bandhan edition

ఢిల్లీలోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో రక్షాబంధన్‌ వేడుకలు నిర్వహించారు. చిన్నారులకు హై-ఫైవ్‌లు ఇస్తూ, వారితో కలిసి చిరునవ్వులు చిందిస్తూ మోదీ రాఖీ సంబరాలు జరుపుకున్నారు. మోదీకి చి‍న్నారులు రాఖీ కట్టారు.

కాగా, రాఖీ పౌర్ణమి అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య పవిత్ర బంధానికి ప్రతీకగా నిలుస్తోంది. దేశవ్యాప్తంగా శుక్రవారం ప్రజలు ఎంతో ఉత్సాహంగా, సంప్రదాయ ఆచారాలతో రాఖీ పౌర్ణమి వేడుకలు జరుపుకుంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, పలువురు కేంద్ర మంత్రులు సామాజిక మాధ్యమాల ద్వారా దేశ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

“రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ పవిత్ర పండుగ మీ అందరి జీవితాల్లో ఆనందం, సౌభాగ్యం, విజయాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఆప్యాయత, అనురాగం, పరస్పర విశ్వాసంతో కూడిన బంధాలు ఎప్పటికీ చెక్కుచెదరకుండా ఉండాలి”  అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు.

లోక్‌సభ స్పీకర్‌ సందేశం
కుటుంబ విలువలు, సంస్కృతికి ప్రతీకగా రాఖీ పౌర్ణమిని అభివర్ణించిన లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా.. ఈ పండుగ కేవలం పవిత్రమైన దారాన్ని కట్టే వేడుక మాత్రమే కాదని అన్నారు. విశ్వాసం, గౌరవం, ప్రేమ, జీవితాంతం కలిసి ఉండాలనే ప్రతిజ్ఞకు ఇది ప్రతీక అని తెలిపారు.

ఇదీ చదవండి: యశ్‌ ‘టాక్సిక్‌’కు అన్నామలై రివ్యూ

మహిళల గౌరవం, ఆత్మగౌరవం, హక్కులు, కలలతో రక్షణ అనే భావన కూడా ముడిపడి ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రతి కుమార్తె, ప్రతి సోదరి సురక్షితంగా, గౌరవంగా ఉన్నప్పుడే దేశం మరింత బలంగా మారుతుందని ఆయన అన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement