గూగుల్‌లో రూ. 83 లక్షల వేతనం వదులుకుని..సేంద్రీయ వ్యవసాయం! | Mantaj Sidhu Ex Google employee quits Punjab to grow organic food | Sakshi
Sakshi News home page

గూగుల్‌లో రూ. 83 లక్షల వేతనం వదులుకుని..సేంద్రీయ వ్యవసాయం!

Aug 28 2026 3:46 PM | Updated on Aug 28 2026 3:57 PM

Mantaj Sidhu Ex Google employee quits Punjab to grow organic food

ఇటీవల టెకీలు లక్షల్లో వేతనాలు అందుకునే ఉద్యోగాలను కాదనుకుని మహర్షి మూవీలో మహేశ్‌ మాదిరిగా పదరా పదరా అంటూ వ్యవసాయం బాట పడుతున్నారు. పైగా చక్కగా రసాయనిక ఎరువులు ఉపయోగించకుండా పంటలు పండించి శెభాష్‌ అని అనిపించుకుంటున్నారు. అలాగే రైతన్నలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. తాజాగా ఆ కోవలో మరో టెకీ చేరిపోయారు. మరి ఈయన ఏవిధంగా ఈ రంగంలోకి వచ్చారంటే..

మంతజ్‌ సిధు అనే వ్యక్తి డబ్లిన్‌లోని గూగుల్‌ ఉద్యోగి. ఆ టెకీ ఉద్యోగానికి స్వస్తి చెప్పి వ్యసాయం రంగం వైపుకి వచ్చాడు. చక్కగా సేద్యం చేస్తూ..ఆరోగ్యకరమైన పంటలను పండిస్తూ ఔరా అనిపించుకుంటున్నాడు. ఆయన దాదాపు ఐదేళ్లకు పైనే గూగుల్‌లో అడ్వర్టైజింగ్‌ విభాగంలో పనిచేశారు. ఆయన జీతం దాదాపు రూ. 83 లక్షలు పైనే. గూగుల్‌లో ఆయన  ఉద్యోగ ప్రస్థానం మొదలైంది ఇలా..2018లో గూగుల్‌ హైదరాబాద్‌లో చేరాడు. ఆ తర్వాత డబ్లిన్‌ బృందానికి మారాడు. 

ఆ తర్వాత ప్రముఖ యూకే అడ్వర్టైజింగ్‌ ఏజెన్సీల కోసం గూగుల్‌ యాడ్స్‌ భాగస్వామ్యాల వ్యాపార వ్యూహంపై పని చేశాడు. మహమ్మారి కారణంగా ఐర్లాండ్‌కి పయనమయ్యాడు. ఆయన 2021లో డబ్లిన్‌కు వెళ్లేముందు రెండేళ్లపాటు డబ్లిన్‌ బృందంతో రిమోట్‌గా పనిచేశాడు. జూన్‌2022 నాటికి సిద్ధూ భారత్‌కి తిరిగి వచ్చి కొన్ని నెలల తదనంతరమే ఉద్యోగానికి రిజైన్‌ చేశాడు. తన కెరీర్‌ మొత్తం ఒత్తిడితో ఎటువైపుకో వెళ్తున్నట్లు అనిపించి తన సొంతూరు పంజాబ్‌కి వచ్చేశానని చెబుతున్నాడు. తన జీవితానికి వాస్తవికంగా దగ్గరగా ఉండే ఏ పనైనా చేయాలని భావించి వ్యవసాయ రంగంలోకి వచ్చినట్లు తెలిపాడు. 

యూరప్‌లో ఉన్నప్పుడే వ్యవసాయ పద్ధతులపై మనసుమళ్లిందని, రసాయనాలు, పురుగుల మందుల వినయోగం కారణంగా ఉన్న ఆందోళన తన కుటుంబం కోసం పాటుపడేలా చేసిందని అంటున్నాడు. అనారోగ్యకరమైన ఆ రసాయనిక ఆహారాలకు తన కుటుంబం దూరంగా ఉండాలని భావించే సేంద్రియా వ్యవసాయ వ్యాపారం వైపుకి వెళ్లినట్లు తెలిపాడు. అలా సిద్ధూ పంజాబ్‌లో గిల్ ఆర్గానిక్స్‌ను 'ఫార్మ్-టు-టేబుల్' ప్రారంభించాడు. దీనికి తన కార్పొరేట్‌ అనుభవం కూడా ఉపయోగపడింది. 

అయితే తానను గూగుల్‌లో ఆర్జించిన జీతం కంటే సంపాదించినా..మొత్తం పెట్టుబడి, నిర్వహణ ఖర్చులకు పోను మిగిలే ఆదాయం ఇంతకమునుపు మీద తక్కువేనని అన్నారు. అయితే తనకు ఈ నిర్ణయం సంతృప్తికి సంబంధించినదని అంటున్నారు. తన శక్తిని, ఏకాగ్రతను పూర్తిగా తన కోసం ఉపయోగిస్తున్నానని ఆనందంగా చెబుతున్నారు. 

అయితే భారత్‌కి వచ్చాక ట్రాఫిక్‌, అధికా యంత్రంగంతో మమేకమై వ్యాపారాన్ని నిర్మించడంలో కొంత ఇబ్బందులు ఎదర్కొన్నానని అన్నారు. అలాగే తన అపారమైన కార్పొరేట్‌ అధ్యాయానికి కృతజ్ఞత కలిగి ఉన్నానని, అలాగే సరైన సమయంలోనే ముగించానని అంటున్నారు. 

(చదవండి: పల్లెటూరి అమ్మాయి ఘనత..! జస్ట్‌ రూ. 3వేల రూపాయల ఐడియా..)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement