ఓటీటీలోకి వచ్చేసిన 'ఇరుముడి' పాప థ్రిల్లర్ సినిమా | Irumudi Child Artist Nakshatra Malayalam Thriller I Nobody Movie Released In OTT, Check Streaming Platform Details Inside | Sakshi
Sakshi News home page

I Nobody In OTT: 'ఇరుముడి' పాప చేసిన థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్

Aug 26 2026 10:09 AM | Updated on Aug 26 2026 10:34 AM

Irumudi Nakshatra I Nobody Movie OTT Streaming

'ఇరుముడి' థియేటర్లలో అదరగొడుతోంది. నాలుగు రోజుల్లోనే రూ.100 కోట్ల కలెక్షన్స్ సాధించి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే మరో వారం వరకు ఈ జోరు ఉండొచ్చనిపిస్తోంది. రవితేజ సహా ఇందులో నటించిన ప్రతి ఒక్కరికి ప్రశంసలు దక్కుతున్నాయి. మరీ ముఖ్యంగా హీరోకి కూతురిగా నటించిన నక్ష‍త్ర అయితే అందరికీ తెగ నచ్చేస్తోంది. థియేటర్లలో ఇదలా ఉండగానే ఓటీటీలోకి ఈమె నటించిన ఓ మలయాళ థ్రిల్లర్ వచ్చేసింది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఇంతకీ ఈ చిత్రమేంటి?

(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)

మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్, పార్వతి ప్రధాన పాత్రలు చేసిన హీస్ట్ థ్రిల్లర్ 'ఐ నోబడీ'. గత నెలలో థియేటర్లలో రిలీజైంది. తాజాగా హాట్‌స్టార్ ఓటీటీలోకి వచ్చేసింది. బ్యాంక్ దొంగతనంలో మాయమైన రూ.17 కోట్లు ఎక్కడికి పోయాయి? అనే స్టోరీతో ఈ సినిమాని తీశారు. ఇందులోనే నక్షత్ర.. హీరో కూతురిగా నటించింది. కొన్ని సన్నివేశాలే ఉన్నప్పటికీ ఆకట్టుకుంది.

'ఐ నోబడీ' విషయానికొస్తే.. రాజీవన్ (పృథ్వీరాజ్ సుకుమారన్) సెక్రటేరియట్‌లో పనిచేసే ఓ సాధారణ ప్రభుత్వ ఉద్యోగి. భార్య మీరా(పార్వతి), ఇద్దరు కూతుర్లతో పెద్దగా హడావిడి లేకుండా బతికేస్తుంటాడు. ఓరోజు ఇదే ఊరిలో బ్యాంక్ దొంగతనం జరుగుతుంది. అయితే అదే టైంకి బ్యాంక్‌లో ఉన్న రాజీవన్‌ని కొట్టి, దొంగలు తమతోపాటు కారులో బందీగా తీసుకొని వెళ్తారు.

దారిలో రాజీవన్‌ని వదిలేయాలని దొంగలు అనుకుంటారు కానీ అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్‌లో రాజీవన్ బతికిపోయి దొంగలు స్పాట్‌లోనే చనిపోతారు. పోలీసులు వచ్చి కేసు నమోదు చేస్తారు. అంతా ఓకే గానీ దోపీడికి గురైన రూ.17 కోట్ల డబ్బు మాత్రం మాయం అవుతుంది. మరి ఆ డబ్బు ఎక్కడుంది? ఎవరు తీశారు? ఇందులో రాజీవన్ హస్తం ఉందా? చివరకు పోలీసులు డబ్బు కనుగొన్నారా లేదా అనేది మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: పృథ్వీరాజ్ 'ఐ, నోబడీ' సినిమా రివ్యూ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement