breaking news
Nobody Movie
-
ఓటీటీలోకి వచ్చేసిన 'ఇరుముడి' పాప థ్రిల్లర్ సినిమా
'ఇరుముడి' థియేటర్లలో అదరగొడుతోంది. నాలుగు రోజుల్లోనే రూ.100 కోట్ల కలెక్షన్స్ సాధించి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే మరో వారం వరకు ఈ జోరు ఉండొచ్చనిపిస్తోంది. రవితేజ సహా ఇందులో నటించిన ప్రతి ఒక్కరికి ప్రశంసలు దక్కుతున్నాయి. మరీ ముఖ్యంగా హీరోకి కూతురిగా నటించిన నక్షత్ర అయితే అందరికీ తెగ నచ్చేస్తోంది. థియేటర్లలో ఇదలా ఉండగానే ఓటీటీలోకి ఈమె నటించిన ఓ మలయాళ థ్రిల్లర్ వచ్చేసింది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఇంతకీ ఈ చిత్రమేంటి?(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్, పార్వతి ప్రధాన పాత్రలు చేసిన హీస్ట్ థ్రిల్లర్ 'ఐ నోబడీ'. గత నెలలో థియేటర్లలో రిలీజైంది. తాజాగా హాట్‌స్టార్ ఓటీటీలోకి వచ్చేసింది. బ్యాంక్ దొంగతనంలో మాయమైన రూ.17 కోట్లు ఎక్కడికి పోయాయి? అనే స్టోరీతో ఈ సినిమాని తీశారు. ఇందులోనే నక్షత్ర.. హీరో కూతురిగా నటించింది. కొన్ని సన్నివేశాలే ఉన్నప్పటికీ ఆకట్టుకుంది.'ఐ నోబడీ' విషయానికొస్తే.. రాజీవన్ (పృథ్వీరాజ్ సుకుమారన్) సెక్రటేరియట్లో పనిచేసే ఓ సాధారణ ప్రభుత్వ ఉద్యోగి. భార్య మీరా(పార్వతి), ఇద్దరు కూతుర్లతో పెద్దగా హడావిడి లేకుండా బతికేస్తుంటాడు. ఓరోజు ఇదే ఊరిలో బ్యాంక్ దొంగతనం జరుగుతుంది. అయితే అదే టైంకి బ్యాంక్‌లో ఉన్న రాజీవన్‌ని కొట్టి, దొంగలు తమతోపాటు కారులో బందీగా తీసుకొని వెళ్తారు.దారిలో రాజీవన్‌ని వదిలేయాలని దొంగలు అనుకుంటారు కానీ అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్లో రాజీవన్ బతికిపోయి దొంగలు స్పాట్లోనే చనిపోతారు. పోలీసులు వచ్చి కేసు నమోదు చేస్తారు. అంతా ఓకే గానీ దోపీడికి గురైన రూ.17 కోట్ల డబ్బు మాత్రం మాయం అవుతుంది. మరి ఆ డబ్బు ఎక్కడుంది? ఎవరు తీశారు? ఇందులో రాజీవన్ హస్తం ఉందా? చివరకు పోలీసులు డబ్బు కనుగొన్నారా లేదా అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: పృథ్వీరాజ్ 'ఐ, నోబడీ' సినిమా రివ్యూ) -
'జైలర్'.. ఆ హాలీవుడ్ సినిమాకు కాపీనా?
సూపర్‌స్టార్ రజినీకాంత్ 'జైలర్' విడుదలకు రెడీ అయిపోయింది. తెలుగులో పెద్దగా బజ్ లేదు. అయితే రీసెంట్గా విడుదలైన ట్రైలర్ చూసిన తర్వాత అంచనాలు కాస్త పెరిగాయి. రజినీ స్టైల్, స్వాగ్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఎందుకంటే తలైవాకు సరైన హిట్ పడి చాలా కాలమైపోయింది. ఇలాంటి టైంలో 'జైలర్' ఓ హాలీవుడ్ మూవీకి కాపీ అనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఓ వివాదం 'జైలర్' ఎలా ఉండబోతుందో అనే విషయం ఆగస్టు 10న తెలిసిపోతుంది. కాపీ అనేది పక్కనబెడితే ఇప్పటికే టైటిల్ విషయమై ఓ వివాదం నడిచింది. 'జైలర్' టైటిల్ తమదని మలయాళ దర్శకుడు సక్కిర్ మడతిల్ కోర్టుని ఆశ్రయించారు. మార్కెట్ పరంగా తమ చిత్రానికి నష్టం రాకూడదని సన్ పిక్చర్స్ సంస్థ కోర్టుని ఆశ్రయించింది. ఆగస్టు 2న హియరింగ్ జరగ్గా.. తీర్పు ఏంటనేది తెలియాల్సి ఉంది. (ఇదీ చదవండి: ఓటీటీల్లోకి ఈ శుక్రవారం 18 మూవీస్) కథ కాపీ కొట్టారా? ట్రైలర్లో చూపించిన దాని ప్రకారం.. 'జైలర్' ఫస్టాప్‌లో ఓ అమాయకుడిలా కనిపిస్తాడు. ఇంట్లో కొడుకు, మనవడు, భార్య.. ఇలా ప్రతి ఒక్కరూ అతడితో ఆడేసుకుంటూ ఉంటారు. అయితే అతడు బయటకు కనిపిస్తున్నది వేరు, గతం వేరే అనే విషయం తెలుస్తుంది. తనలో అసలు సిసలు యాక్షన్ ని బయటకు తీస్తాడు. తర్వాత ఏం జరిగింది? అనేది స్టోరీ అని తెలుస్తోంది. కథ ఒకేలా ఉందే? అయితే 'జైలర్' సినిమాకు 2021లో వచ్చిన హాలీవుడ్ మూవీ 'నోబడీ'తో పోలికలు కనిపిస్తున్నాయి. ఇందులోనూ ఓ వయసైపోయిన వ్యక్తి.. భార్యబిడ్డలతో బతుకుతుంటాడు. అనుకోని పరిస్థితుల్లో రష్యన్ మాఫియాతో తలపడతాడు. తనని 'నోబడీ' అనుకున్న వాళ్లందరికీ షాకిస్తాడు. 'జాన్ విక్' టీమ్ ఈ ప్రాజెక్ట్ కోసం పనిచేసింది. ఇప్పుడు ఈ రెండు సినిమాల మధ్య పోలికలు కనిపిస్తుండడంతో కాపీ కొట్టారనే ప్రచారం జరుగుతోంది. థియేటర్లలోకి 'జైలర్' వస్తే గానీ దీనిపై క్లారిటీ రాదు. (ఇదీ చదవండి: నా మనసులో ఉన్నది అతడే.. ఆల్రెడీ పెళ్లి!: రష్మిక)


