సినిమా విడుదలకు ముందే లీక్‌ కావడం బాధాకరం | Yash’s ‘Toxic’ Grand Release Event: Pan-India Action Entertainer Set to Hit Screens | Sakshi
Sakshi News home page

సినిమా విడుదలకు ముందే లీక్‌ కావడం బాధాకరం

Aug 26 2026 8:02 AM | Updated on Aug 26 2026 8:21 AM

Yash’s ‘Toxic’ Grand Release Event: Pan-India Action Entertainer Set to Hit Screens

కేజీఎఫ్‌ చిత్రంతో పాన్‌ ఇండియా స్థాయికి ఎదిగిన కన్నడ యష్‌. ఈయన తాజాగా నటించిన టాక్సీక్‌ చిత్రం కోసం భారతీయ సినిమా నే ఆసక్తిగా ఎదురుచూ స్తోంది. నటి నయనతార,రుక్మిణి వసంత్, బాలీవుడ్‌ నటి హ్యూమషి , కియారా అద్వానీ, తార సుట్టారియ వంటి ముద్దుగుమ్మలు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి నటి, దర్శకురాలు గీతు మోహన్‌ దాస్‌ దర్శకత్వం వహించారు. కెవిఎన్‌ ప్రొడక్షన్స్‌ , మాన్స్టర్‌ మైండ్‌ క్రియేషన్స్‌ అధినేతలు వెంకట్‌ కే.నారాయణన్, యష్‌ కలిసి నిర్మించిన ఈ  భారీ, బ్రహ్మాండ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ కథ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం ,హిందీ భాషల్లో బుధవారం ప్రపంచ వ్యాప్తంగా తెరపైకి రానుంది. 

ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం చెన్నై లోని నెహ్రూ ఇండోర్‌ స్టేడియంలో ఈ చిత్ర ఫ్రీ రిలీ జ్‌ ఫంక్షన్‌ను భారీఎత్తున నిర్వహించారు. ఇందులో పాల్గొన్న నటుడు యష్‌ మాట్లాడుతూ ‘‘ఇంతకుముందు నేను నటించిన కేజీఎఫ్‌ చిత్రాన్ని తమిళ ప్రేక్షకులు ఎలాంటి పక్షపాతం చూపకుండా ఆదరించి ఘన విజయాన్ని అందించారు. ఈ చిత్ర నిర్మాత వెంకట్‌ కె నారాయణన్‌  ఇంతకుముందు ముఖ్యమంత్రి జోసెఫ్‌ విజయ్‌ హీరోగా నటించిన జననాయకన్‌ చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. ఆ చిత్రం విడుదలకు ముందే అక్ర మంగా ఇంటర్‌నెట్‌లో విడుదలైనప్పుడు నిర్మాత ఎంతో బాధకు గురయ్యారు. 

అయితే ఆ సమయంలో మీరు అందించిన సపోర్టు, జననాయకన్‌ చిత్రాన్ని విజయవంతం చేసిన తీరు చూస్తే విజయ్‌పై  మీకు ఉన్న ప్రేమాభిమానాలు తెలిశాయి. కేజీఎఫ్‌ చిత్రాన్ని ఆదరించినట్లే ఈ చిత్రాన్ని విజయవంతం చేస్తారని నమ్ముతున్నాను. ఒక సాధారణ మనుషులమైన మమ్మల్ని  మీరే (ప్రేక్షకులే) హీరోలను  చేశారు. మిమ్మల్ని ఆనందింప చేయడమే మా బాధ్యత ‘‘ అని నటుడు యష్‌ పేర్కొన్నారు.  నటుడు యష్‌ ఇచ్చిన పడయప్పా వంటి కొన్ని  కమర్షియల్‌ అంశాలతో కూడిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ కథా చిత్రాల రిఫరెన్స్‌ తోనే నేను టాక్సిక్‌ చిత్రాన్ని చేశాను ‘‘ అని దర్శకురాలు గీతూ మోహన్‌ దాస్‌ పేర్కొన్నారు.   

స్పిరిట్ Vs వారణాసి.. సందీప్ రెడ్డి వంగ సంచలన వ్యాఖ్యలు!


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement