‘టాక్సిక్‌’ మూవీ ఫస్ట్‌ రివ్యూ.. బ్లాక్‌ బస్టర్‌ పక్కా? | Toxic Movie First Review In Telugu | Sakshi
Sakshi News home page

‘టాక్సిక్‌’ ఫస్ట్‌ రివ్యూ.. సినిమాలో హైలెట్స్‌ ఇవే!

Aug 25 2026 8:25 PM | Updated on Aug 25 2026 8:36 PM

Toxic Movie First Review In Telugu

రాకింగ్‌ స్టార్‌ యశ్‌ హీరోగా నటించిన అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రం ‘టాక్సిక్‌: ఏ ఫెయిరీ టేల్‌ ఫర్‌ గ్రోన్‌-అప్స్‌’. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్‌దాస్‌ తెరకెక్కించిన ఈ పీరియాడిక్‌ గ్యాంగ్‌స్టర్‌ యాక్షన్‌ డ్రామా మరికొద్ది గంటల్లో(ఆగస్టు 26) ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘కేజీఎఫ్‌ 2’ తర్వాత దాదాపు నాలుగేళ్లకు యశ్‌ నుంచి వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు   ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు తగ్గట్టే ఇప్పటి వరకు విడుదలైన ప్రచార చిత్రాలు ఉన్నాయి. అయితే సినిమా ఫలితం ఎలా ఉంటుందో మరికొద్ది గంటల్లో తేలిపోతుంది. 

( చదవండి: అడ్వాన్స్‌ బుకింగ్స్‌కే 40+ కోట్లు.. ఫస్ట్‌డే 100 కోట్లు పక్కా!)

ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకు మాత్రం ఈ సినిమాకు పాజిటివ్‌ రెస్పాన్సే వచ్చింది. ఈ సినిమా చూసిన సెన్సార్‌ సభ్యులు కూడా ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించారట. అయితే హింసాత్మక సన్నివేశాలతో పాటు రొమాంటిక్‌ సీన్లు కూడా ఎక్కువే ఉండడంతో ‘ఏ’ సర్టిఫికేట్‌ ఇచ్చారు. అంటే పెద్దలు మాత్రమే చూడాల్సిన సినిమా అన్నమాట. 

టాక్సిక్‌ స్టోరీ ఇదేనా?
సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న పోస్టులు, ట్రైలర్ బట్టి చూస్తే.. ఈ సినిమా కథనం ఇలా కొనసాగబోతుంది. ఇండియాకు స్వాతంత్య్రం వచ్చినా.. గోవా మాత్రం పోర్చుగీసు వారి ఆధీనంలోనే ఉంటుంది. అక్కడ చాలా ఇల్లీగల్‌ దందాలు జరుగుతుంటాయి. డ్రగ్స్‌,మాఫియా యదేచ్ఛగా కొనసాగేవి. ఆ చీకటి రాజ్యాన్ని సొంతం చేసుకోవడానికి కొన్ని  గ్రూపులు పోరాడుతుంటాయి. ఈ నేపథ్యంలో గోవాలో హింస మితిమీరిపోతుంది. వెన్నుపోట్లు, ఆధిపత్య పోరు ఉన్న ఇలాంటి ప్రపంచంలో రాయ(యష్‌) ఎలా ఎదిగాడు? సొంత చెల్లి గంగ(నయనతార)తో ఎందుకు పోరాటం చేయల్సి వచ్చింది? నాడియా (కియారా)తో రాయ ప్రేమాయణం కొనసాగింది? ఎలిజబెత్ (హ్యుమా ఖురేషి), రెబెకా (తారా సుతారియా), మెలిసా (రుక్మిణి వసంత్) పాత్రలు ఏమిటి? అనేది సినిమా చూసి తెలుకోవాల్సిందే.

టాక్సిక్‌ హైలెట్స్‌..
ఈ సినిమాలో హైలెట్‌ ఏంటంటే.. యష్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నాడట. ఇందులో రాయగా, రూమిగా కనిపించి అలరించాడట. మొత్తంగా మూడు డిఫరెంట్‌ గెటప్‌లో ఆయన కనిపించబోతున్నాడు. సినిమా విజువల్‌ ట్రీట్‌గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అయితే సినిమాకు రవి బస్రూర్‌ అదిరిపోయే బీజీఎం ఇచ్చాడట. అలాగే యాక్షన్‌ సీన్లు కూడా అదిరిపోయాయట. ముఖ్యంగా యష్‌, నయనతారల మధ్య వచ్చే సన్నివేశాలు హైలెట్‌గా నిలుస్తాయని సమాచారం. ఇక తెలుగులో దిల్‌రాజు అల్రెడీ కొంతమందికి సినిమా చూపించాడట. వారంతా సినిమా అదిరిపోయిందని చెప్పినట్లు తెలుస్తోంది. సినిమా ప్రారంభం అయిన 20 నిమిషాలకే అంతా టాక్సిక్‌ ప్రపంచంలోకి వెళ్తారట.  ఫస్టాఫ్‌లో వచ్చే బోల్డ్‌ సీన్లు, యాక్షన్‌ సీక్వెన​్‌ హాలీవుడ్‌ రేంజ్‌లో ఉన్నాయని అంటున్నారు.

రికార్డులు పక్కా.. 
అయితే సోషల్‌ మీడియాలోనూ ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే కొంతమంది ఈ చిత్రం అదిరిపోయిందని పోస్టులు పెడుతున్నారు. అయితే వారిలో చాలా మంది సినిమా చూడకుండా 4 రేటింగ్‌లు ఇచ్చి ట్వీట్లు చేస్తున్నారు.బ్లాక్‌ బస్టర్‌ సినిమాకు కావాల్సిన అన్ని అంశాలు ఇందులో ఉన్నాయని చెబుతున్నారు. ఇక సెన్సార్‌ మెంబర్‌ని అని తనకు తానుగా చెప్పుకునే ఉమైర్‌ సందు మాత్రం ఈ చిత్రానికి నెగెటివ్‌ రివ్యూ ఇచ్చాడు. బీగ్రేడ్‌ సినిమా అని, యానిమల్‌ మూవీకి కాపీలా ఉందని ట్వీట్‌ చేశాడు. అయితే అతని పోస్టులను అంతగా నమ్మే పరిస్థితి లేదు. ప్రతి సినిమాకి ఇలా రిలీజ్‌కు ముందే ఇష్టం వచ్చినట్లుగా రివ్యూ ఇస్తుంటాడు. ఓవరాల్‌గా మాత్రం ఈ సినిమాకు నెట్టింట ఫుల్‌ క్రేజీ ఏర్పడింది. టాక్సిక్‌.బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అవుతుందని చెబుతున్నారు. మరి నిజంగా ఈ చిత్రం సూపర్‌ హిట్‌ అవుతుందో  లేదో చూడాలి.  ఒరిజినల్‌ రివ్యూ కోసం సాక్షి డాట్‌కామ్‌(sakshi.com)ని ఫాలో అవ్వండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement