రవితేజ హీరోగా వచ్చిన లేటేస్ట్ మూవీ ఇరుముడి. శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. తొలి మూడు రోజుల్లోనే ఏకంగా రూ.80 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా.. తాజాగా మరో క్రేజీ రికార్డ్ సాధించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏకంగా సెంచరీ దాటేసింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లు కొల్లగొట్టింది. రిలీజైన ఐదు రోజుల్లోనే ఈ ఘనత సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని మైత్రి మూవీ మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్ షేర్ చేశారు.
తండ్రీ, కూతురి కాన్సెప్ట్ ఆడియన్స్‌కు కనెక్ట్ కావడంతో థియేటర్లకు క్యూ కడుతున్నారు. తొలి రోజే పాజిటివ్ టాక్ అందుకున్న ఈ సినిమా వందమార్క్‌ను కేవలం ఐదు రోజుల్లోనే చేరుకుంది. దీంతో రవితేజ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా.. ఈ మూవీలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా కనిపించారు. బేబీ నక్షత్ర రవితేజ కూతురి పాత్రలో ఆకట్టుకుంది. కాగా.. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించారు.
With the blessings of Lord Ayyappa and the love from the audience, #Irumudi hits a century ❤🔥❤🔥
100 CRORES GROSS WORLDWIDE 🔥🔥
Book Your Tickets Now!
🎟️https://t.co/LPeVCIRYVl#IRUMUDI / #IRUMUDIKATTU pic.twitter.com/QSJF8T3GrC— Mythri Movie Makers (@MythriOfficial) August 25, 2026


