‘సరిలేరు నీకెవ్వరు’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత హీరో మహేశ్‌బాబు, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో మళ్లీ ఓ సినిమా తెరకెక్కనుందనే వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ‘వారణాసి’ సినిమాతో బిజీగా ఉన్నారు మహేశ్‌బాబు. 2027 ఏప్రిల్ 7న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత దర్శకుడు అనిల్ రావిపూడితో మహేశ్‌బాబు సినిమా చేస్తారనే వార్త మంగళవారం వైరల్‌గా మారింది.
ఈ అంశంపై అదే రోజు సాయంత్రం తర్వాత అనిల్ రావిపూడి స్పందించారు. ‘‘మహేశ్‌బాబుగారంటే నాకు ఎంతో అభిమానం... గౌరవం. అయితే ప్రస్తుతం ప్రచారంలో ఉన్న వార్తల్లో నిజం లేదు. దయచేసి ఇలాంటి వదంతులు నమ్మకండి, వ్యాప్తి చేయకండి’’ అంటూ ‘ఎక్స్’లో పేర్కొన్నారు అనిల్ రావిపూడి.
మరోవైపు వెంకటేశ్, కల్యాణ్ రామ్ హీరోలుగా నటిస్తున్న ‘జనవరి 12 విడుదల’ సినిమా చిత్రీకరణతో ప్రస్తుతం అనిల్ రావిపూడి బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం 2027 సంక్రాంతికి విడుదల కానుంది.


