గత మూడు నెలల నుంచి తెలుగు రాష్ట్రాల్లో సినిమాలు రిలీజ్ అవుతున్నప్పటికీ ఏ చిత్రానికి కూడా టికెట్ల పెంపు లేదు. రేపు(ఆగస్టు 26) రిలీజయ్యే 'టాక్సిక్' కోసం తెలంగాణ, ఆంధ్రా ప్రభుత్వాలు టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతిచ్చాయి. ఈ మేరకు జీవో జారీలు చేశాయి.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)
తెలంగాణలో సింగిల్ స్క్రీన్లలో రూ.50, మల్టీప్లెక్స్‌ల్లో రూ.100 (జీఎస్టీతో కలిపి) ఒక్కో టికెట్‌పై పెంచుకునేందుకు అనుమతిచ్చారు. బుకింగ్స్ కూడా ఓపెన్ చేసేశారు. పెంచిన ధరలు పది రోజుల పాటు అమల్లో ఉంటాయని, రోజుకు ఐదు షోలు ప్రదర్శించుకోవచ్చని తెలిపింది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ కమిటీకి రూ.కోటి డిపాజిట్ చేయాల్సిందిగా నిర్మాణ సంస్థ కేవీయన్ ప్రొడక్షన్స్‌కు ప్రభుత్వం సూచించింది.
మరోవైపు ఆంధ్రాలో 'టాక్సిక్' కోసం ఒక్కో టికెట్‌పై సింగిల్ స్క్రీన్లలో రూ.50, మల్టీప్లెక్స్‌ల్లో రూ.100 వరకు పదిరోజుల పాటు పెంపు ఉండనుంది. అలానే ఉదయం 6 గంటలకు వేసే స్పెషల్ షోకి టికెట్ ధర రూ.600గా నిర్ణయించారు. అయితే ఓ డబ్బింగ్ సినిమాకు ఇలా టికెట్ ధరలు పెంపునకు ఎలా అనుమతిస్తారని సోషల్ మీడియాలో విమర్శలు మొదలయ్యాయి. థియేటర్లలో 'ఇరుముడి' సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శితమవుతున్నందున 'టాక్సిక్' కోసం స్క్రీన్లని ఎలా సర్దుబాటు చేస్తారనేది డిస్కషన్ పాయింట్ అయింది.
పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా 'టాక్సిక్' తీశారు. ఇందులో యష్.. తండ్రికొడుకులుగా నటించాడు. కియారా అడ్వాణీ, రుక్మిణి వసంత్, నయనతార, హ్యుమా ఖురేషి, తారా సుతారియా హీరోయిన్లు. గీతూ మోహన్ దాస్ దర్శకురాలు. 3 గంటల 14 నిమిషాల నిడివితో ఇది ప్రదర్శితమవనుంది. సెన్సార్ బోర్డ్ 'ఏ' సర్టిఫికెట్ జారీ చేసినందున పెద్దలకు మాత్రమే థియేటర్లలోకి అనుమతించనున్నారు.
(ఇదీ చదవండి: ‘టాక్సిక్’ కోసం యశ్ ఎంత తీసుకున్నాడు? రెమ్యునరేషన్ డీటైల్స్)


