రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఇరుముడి’. తండ్రీకూతురు సెంటిమెంట్‌కి అయ్యప్ప స్వామి నేపథ్యాన్ని జోడించి మూవీ తీయండంతో డైరెక్టర్ శివ నిర్వాణ మంచి మార్కులు కొట్టేశాడు. ప్రస్తుతం ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. అయ్యప్ప మాలలో రవితేజ చాలా సహజంగా కనిపంచాడు. చాలామంది అయ్యప్ప భక్తులు తమని తాము ఆ రవితేజ పాత్రలో ఊహించుకుంటున్నారు. ఇప్పుడీ ఫీవర్ అంతర్జాతీయస్థాయికి పాకింది.
గతంలోనూ వైరల్..
అయ్యప్ప మాల ధరించిన గెటప్‌లో ఆస్ట్రేలియా క్రికెట్ ప్లేయర్ డేవిడ్ వార్నర్.. ఫ్యాన్ ఎడిట్ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రీపోస్ట్ చేశాడు. ఇప్పుడు ఇది వైరల్‌గా మారింది. అయితే వార్నర్ అభిమానులకు ఇదే కొత్త కాదు. ఇంతకముందు తెలుగులో రిలీజ్ అయిన సినిమాలు, పాటలకు ఎన్నో సార్లు తనదైన స్టైల్‌లో డైలాగ్‌లు చెప్పడం, స్టెప్పులు వేయడం వంటి చేశాడు. ఇలా చేయడంతో ఇంతక ముందు కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాడు. ఇప్పుడు అదే స్టైల్‌లో ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేయడంతో మరోసారి వైరల్‌గా మారాడు.
ఇదీ చదవండి: 'ఇరుముడి'కి పట్టం కట్టిన ప్రేక్షకులు.. ఎన్ని కోట్లు వచ్చాయ్?



