కొన్ని సినిమాలు థియేటర్లలో హిట్ అవుతాయి. ఓటీటీకి వచ్చాక చాలా ట్రోలింగ్ ఎదుర్కొంటాయి. గతంలో పలు చిత్రాల విషయంలో ఇలా జరిగింది. ఇప్పుడు కిరణ్ అబ్బవరం 'చెన్నై లవ్ స్టోరీ'కి అదే రిపీటైంది. నాలుగు రోజుల క్రితం ఈ మూవీ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. డిజిటల్ మాధ్యమాల్లో దీన్ని చూసిన చాలామంది ట్రోల్ చేస్తున్నారు తప్పితే బాగుందని మెచ్చుకోవట్లేదు. కొంతమంది మాత్రం బాగుందని అంటున్నారు. దీనికి కారణాలు కూడా ఉన్నాయి.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ ఐదు డోంట్ మిస్)
ప్రేమకథ, అందులో పాటలు, సీన్స్ చూసినప్పుడు థియేటర్లలో ఆ సౌండ్ సిస్టమ్ వల్ల పర్లేదు బాగానే ఉందనిపిస్తాయి. అదే సినిమా ఓటీటీకి వచ్చిన తర్వాత చూస్తే ఎక్స్‌పీరియెన్స్ మారుతుంది. 'చెన్నై లవ్ స్టోరీ'కి సరిగ్గా అదే జరుగుతోంది. అసలు ఈ మూవీ థియేటర్లలో ఎలా హిట్ అయిందా అని కొందరు నెటిజన్లు సందేహపడుతున్నారు. థియేటర్లలో చూసినవాళ్లకు ఫస్టాప్ నచ్చేయగా, సెకండాఫ్ ఓకే ఓకే అనిపించింది. ఓటీటీకి వచ్చిన తర్వాత చూసినవాళ్లు ఫస్టాప్ పర్లేదని, సెకండాఫ్ మాత్రం ఘోరాతి ఘోరంగా ఉందని పోస్టులు పెడుతున్నారు.
మరికొందరు నెటిజన్లు అయితే సినిమా, అందులోని ఎమోషన్స్ అన్నీ కృత్రిమంగా ఉన్నాయని.. ఎక్కడా కూడా సహజంగా అనిపించలేదని కంప్లైంట్ చేస్తున్నారు. అదే టైంలో 'బేబి'లానే ఇది కూడా క్రింజ్‌గా ఉందని అంటున్నవాళ్లు లేకపోలేదు. ఓ ప్రేమకథకి ఈ రేంజ్ ట్రోల్స్ రావడం కాస్త చిత్రంగానే అనిపిస్తుంది. ఇలా ట్రోల్స్ చాలానే వస్తున్నప్పటికీ హీరోయిన్ గౌరిప్రియ నటన మాత్రం బాగుందని అంటున్నారు. ఈ విషయంపై దర్శకనిర్మాతలు ఓసారి ఆలోచించుకోవాలేమో!
'చెన్నై లవ్ స్టోరీ' సినిమాలో ఫస్టాప్ అంతా హీరోహీరోయిన్ ప్రేమించుకుంటారు. కానీ ఇంటర్వెల్ వచ్చేసరికి ప్రమాదంలో హీరో చనిపోతాడు. ఆత్మ రూపంలో భూమ్మీదకు తిరిగొచ్చి హీరోయిన్‌తో కలిసి ఉంటాడు. దీనికి 'బేబి' దర్శకుడు సాయి రాజేశ్ కథ అందించగా, రవి నంబూరి దర్శకత్వం వహించాడు. ఎస్కేఎన్, సాయి రాజేశ్ కలిసి నిర్మించారు.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా)


