బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ నటించిన ఓ రక్షా బంధన్ జ్యువెలరీ యాడ్ గత కొద్ది రోజులుగా వివాదాస్పదంగా మారుతోంది. ఈ ప్రకటనలో కృతి సనన్ స్కర్ట్ ధరించి గ్లామరస్‌గా కనిపించారు. అయితే పవిత్రమైన రాఖీ పండగ యాడ్‌లో గ్లామర్ షో చేయడం ఏంటని నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ విషయమై బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ సోషల్ మీడియా వేదికగా తనదనైన సైలిలో ఘాటు వ్యాఖ్యలు చేశారు.
‘మహిళలకు డ్రెస్ ఎంపికలో ఎన్నో రకాల ఆప్షన్లు ఉన్నాయి. మన దగ్గర జీన్స్, చీరలు, సల్వార్ కమీజ్ నుంచి కాక్టైల్ డ్రెస్సుల వరకు మరెన్నో మంచి దుస్తులు ఉన్నాయి. వాటిని వదిలి సోదరుడికి బికినీ, లోదుస్తుల వేసుకుని రాఖీ కట్టాల్సిన అవసరం ఏంటి?. ఈ యాడ్ కూడా కావాలనే వివిదాస్పదంగా చిత్రీకరించినట్లు కనిపిస్తోంది’ అని తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేస్తూ మండిపడ్డారు. అయితే ఈ యాడ్‌పై అటు కృతి సనన్‌గానీ, యాడ్ యాజమాన్యం గానీ ఏవిధంగా స్పందించలేదు.
ఇదీ చదవండి: విలన్‌గా మెప్పించిన జబర్దస్త్ నటుడు


