అక్కినేని హీరోల్లో సుమంత్ ఒకడు. చాన్నాళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ సత్యం, మళ్లీ రావా లాంటి మూవీస్ తప్పితే చెప్పుకోదగ్గ హిట్స్ లేవు. 'సీతారామం' లాంటి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ చేశాడు. ఇతడు నటించిన ఓ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు.
(ఇదీ చదవండి: కియారా నువ్వు చాలా లక్కీ.. ఆ సినిమా చేయలేదు)
సుమంత్, జగపతిబాబు ప్రధాన పాత్రలు చేసిన సినిమా 'న్యూటన్స్ థర్డ్ లా'. గత నెల 31న థియేటర్లలోకి వచ్చింది. థ్రిల్లర్ అంశాలు ఓ మాదిరిగా ఉన్నాయంతే. దీంతో జనాలు పెద్దగా పట్టించుకోలేదు. బహుశా ఓటీటీకి వచ్చిన తర్వాత చూద్దామని అనుకున్నట్లున్నారు. ఈ క్రమంలోనే నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ తేదీని ప్రకటించింది. ఈ శుక్రవారం నుంచి మూవీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుందని వెల్లడించింది.
'న్యూటన్స్ థర్డ్ లా' విషయానికొస్తే.. వినయ్(త్రినాథ్ వర్మ) ఇంజినీరింగ్ స్టూడెంట్. ఓరోజు అనుమానాస్పద రీతిలో చనిపోతాడు. ఈ కేసుని పోలీసాఫీసర్ వాసుదేవ్(సుమంత్) దర్యాప్తు చేయడం మొదలుపెడతాడు. వినయ్ తల్లిదండ్రుల్ని విచారించగా కొన్ని విషయాలు బయటపడతాయి. వీళ్లు ఏదో దాస్తున్నారని వాసుదేవ్ అనుమానిస్తాడు. ఇంతకీ వినయ్ ఎవరు? ఇతడికి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ మెర్క్యురి(జగపతిబాబు)కి సంబంధమేంటి? ఈ కేసుకి 'న్యూటన్ థర్డ్ లా' పుస్తకంతో సంబంధమేంటనేది మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ ఐదు డోంట్ మిస్)


